Friday, 11 August 2023

విప్లవ ఉద్యమ వీరుడు గద్దర్. సంతాప సభలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా



విప్లవ ఉద్యమ వీరుడు గద్దర్ అని పలువురు వక్తలు అన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభ శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో చిక్కడపల్లి గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి పాల్గొని గద్దర్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే తన పాటల ద్వారా చైతన్యాన్ని నింపాడని పేర్కొన్నారు. గద్దర్ మరణం సమాజానికి తీరని లోటన్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గద్దర్ తన పాటలతో చైతన్య పరిచారని తెలిపారు. గద్దర్ మరణం యావత్ ప్రపంచానికి తీరని లోటన్నారు. గద్దర్ రచించిన 'నీ పాదం పై పుట్టుమచ్చనై చెల్లెమ్మ' రాసిన పాటను పాడి గద్దర్ తో తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. పాటకు కదిలించి తత్వం ఉందన్నారు. గద్దర్ భౌతికంగా లేకపోయినా పాట రూపంలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment