హనంకొండ లోని అవోపా భవనంలో వైశ్యులు -ఆత్మగౌరవం అనే అంశంపై వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో హక్కుల సాధన చర్చాగోష్టి సమ్మేళనం నిర్వహించడం జరిగినది ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు శ్రీ కాచం సత్యనారాయణ
గారు మాట్లాడుతూ గత రెండు ఎన్నికలలో మేనిఫెస్టోలో ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఇంతవరకు ఇంతవరకు అమలు చేయలేదు కావున వెంటనే కార్పొరేషన్ తో పాటు వైశ్య కమిషన్, పేద విద్యార్థులకు విదేశీ విద్యా నిధి, ఈ డబ్ల్యూ ఎస్ పథకంలో దామాషా ప్రకారం రిజర్వేషన్లు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం ఐదు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు, మరియు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వైశ్య బంధు లాంటి పథకాలు అమలు చేయాలని 7డిమాండ్లతో కూడిన తీర్మాన పత్రాన్ని మరియు అక్టోబర్ ఒకటో తేదీ హైదరాబాదులో లక్ష మందితో నిర్వహించబోయే వైశ్య గర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ వేదిక ఉద్దేశించి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు శ్రీ ప్రేమ్ గాంధీ గారు మాట్లాడుతూ మా సంస్థ కూడా గత 11 సంవత్సరాల లో రాస్తారోకోలు అసెంబ్లీ ముట్టడి పాదయాత్రలు వంటి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రభుత్వంలో చలనం లేదు అందుకోసమే వైశ్య వికాస వేదిక కు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు మరియు వరంగల్ హనంకొండ జిల్లాల అధ్యక్షులు గుండా ప్రభాకర్ గుప్తా వెలగందుల రాజు నాగమల్ల శ్యాం ప్రసాద్ గారు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో సహకరించారన్నారు.
No comments:
Post a Comment