Tuesday, 1 August 2023

రూ. 2 వేల నోట్లు: బ్యాంకులకు ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయి? ఇంకా ఎన్ని రావాలి?


 రూ. 2 వేల నోట్లు: బ్యాంకులకు ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయి? ఇంకా ఎన్ని రావాలి?

ఒక గంట క్రితం

రూ. 2,000 నోటును ఉపసంహరిస్తూ ప్రకటన చేసిన తర్వాత 88 శాతం రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు భారత రిజర్వు బ్యాంకు తెలిపింది.

బ్యాంకుల డేటా ఆధారంగా జులై 31 వరకు రూ. 3.14 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు తిరిగి వచ్చినట్లు ఆర్‌బీఐ మంగళవారం చెప్పింది.

ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 42 వేల కోట్ల రూపాయల 2,000 నోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపింది.

2,000 నోట్లను సెప్టెంబర్ 30లోపు బ్యాంకులో డిపాజిట్ చేయాలని, తద్వారా చివరి క్షణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

దేశంలో రూ. 2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 మే 19న ప్రకటించింది.

మే 23 నుంచి ఏదైనా బ్యాంకు శాఖను సందర్శించి ఈ నోట్లను మార్చుకోవచ్చని ఒక ప్రకటనలో చెప్పింది.

బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయడానికి ఎటువంటి పరిమితినీ ఆర్‌‌బీఐ పెట్టలేదు. ఇప్పటికే ఉన్న చట్టాలు మాత్రమే వర్తిస్తాయి. కానీ, నోట్లు మార్చుకోవడానికి షరతులను విధించింది.

ఆర్‌బీఐ షరతులేంటి?

రూ. 2 వేల నోట్లను మీ బ్యాంక్ ఖాతా నుంచి లేదా ఏదైనా బ్యాంక్‌లో మార్చుకోవచ్చు.

ఏ బ్యాంకు శాఖలోనైనా ఒకసారి రూ. 20,000 వరకు మాత్రమే రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు.

2023 మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు పంపింది.

ఈ నేపథ్యంలో 2,000 రూపాయల నోట్ల జారీని వెంటనే నిలిపివేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరింది.

దీని గురించి మరింత తెలుసుకోవడానికి తన వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 24 (1) ప్రకారం 2016 నవంబర్‌లో తొలిసారిగా రూ. 2,000 నోట్లను విడుదల చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

గతంలో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాలను తీర్చేందుకు రూ.2,000 నోట్లను విడుదల చేసినట్లు చెప్పింది.

చిన్న నోట్ల సరఫరా సజావుగా ఉండటంతో 2018-19లోనే రూ. 2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం రూ. 2000 నోట్లలో 89 శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి.

2018 మార్చి 31న అత్యధికంగా రూ. 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.

అయితే 2023 మార్చి 31న రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది.

 వెనుక కారణం?

‘‘ 2 వేల రూపాయల నోట్లను నల్లధనం రూపంలో దాచుకుంటున్నారని చెబుతున్నారు. దేశంలో రూ. లక్ష విలువైన రూ.2 వేల నోట్లను ఖర్చు కోసం ఇంట్లో ఉంచుకునే వారి సంఖ్యా పెద్దగా ఉండదు. అటువంటి పరిస్థితిలో ఇది ఎందుకు చేయాలో అర్థం కావడం లేదు. దాని వెనుక ఉన్న ప్రయోజనం ఏంటి? '' అని జవహర్‌లాల్ యూనివర్శిటీ ప్రొఫెసర్, ఆర్థిక వ్యవహారాల నిపుణుడు అరుణ్‌కుమార్ ప్రశ్నించారు.

భారత్‌లోనూ నగదు లావాదేవీలు పెరుగుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో మార్కెట్‌లో దాదాపు రూ. 18 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండగా, అవి ఇప్పుడు రూ. 35 లక్షల కోట్లకు చేరాయి.

భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నందున మార్కెట్‌లో నోట్లు కూడా పెరుగుతున్నాయి. ఆర్‌బీఐ మెల్లగా రూ.2000 నోటును చెలామణి నుంచి తొలగిస్తోంది. గతంతో పోలిస్తే ఈ నోట్లు మార్కెట్‌లో తక్కువే ఉన్నాయి.

No comments:

Post a Comment