నల్లగొండ : బీఆర్ఎస్ పార్టీకి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుడ్ బై చెప్పారు. బుధవారం తన అనుచరులతో సమావేశమైన ఆయన కార్యకర్తల నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తన ముఖ్య అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన అందరి నిర్ణయం మేరకు ఈ ప్రకటన చేశారు. అలాగే ఆయనతో పాటు బీఆర్ఎస్కు ఆయన అనచరులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు కూడా రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేసే విషయం అధికారికంగా ఆయన ఇంకా ప్రకటించలేదు.
Wednesday, 30 August 2023
పెంచిన వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలి*
*పెంచిన వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలి*
*పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి*
*4న మండల ఆఫీసు ముందు ధర్నా*. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను చెల్లించుటకు బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని, మరియు పెండింగ్ బిల్లును తక్షణమే చెల్లించాలని *సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ* లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక నల్లగొండ దేవరకొండ రోడ్డులో గల బాలుర ఉన్నత పాఠశాల లో కార్మికులతో కలసి సమస్యలకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 మార్చి 15న గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు ప్రస్తుతం పొందుతున్న వేతనంపై అదనంగా రూపాయలు 2000/ పెంచుతున్నట్లు ప్రకటించారు. యూనియన్ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా జీవో ఎంఎస్ నెంబర్ 8 ని విడుదల చేసింది కానీ కార్మికులకు పెరిగిన జీతం ఇంతవరకు ఇవ్వలేదు పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వలేదని కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన వేతనాలకు బడ్జెట్ కేటాయించి చెల్లించాలని, పెండింగ్ బిల్లులు గుడ్లకు అదనంగా బడ్జెట్ ఇవ్వాలని జూలై 10,11,12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ సమ్మె చేసి జూలై 14 తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని సమ్మె నోటీసు ఇచ్చిన ఫలితంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి 2023 జూలై 15న ప్రెస్ మీట్ పెట్టి పెరిగిన వేతనం జూలై నెల నుండి చెల్లిస్తామని పెండింగ్ బిల్లులు కూడా వారం రోజుల్లో క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినా ఆచరణలో కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని మరో మారు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం మంత్రిని కలిసిన చెల్లిస్తామని వాగ్దానం చేశారే తప్ప ఆచరణలో అమలు కావడం లేదని కాలయాపన చేస్తూ కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది సరైన కాదని సూచించారు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పెరిగిన వేతనం చెల్లించేందుకు బడ్జెట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి వంటలు చేసి పెట్టి తెచ్చిన దగ్గర వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందుల పాలవుతున్నారని ఇప్పుడున్న మెనూ కేటాయించిన బడ్జెట్ సరిపోవటం లేదు కొత్త మెనూ పెట్టడానికి బడ్జెట్ కేటాయించి ఒక్కొక్క విద్యార్థికి స్లాబ్ రేటు 25 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలన్నారు కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వంటకు సరిపడా గ్యాస్ను సబ్సిడీపై ఇవ్వాలని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా గుడ్లు సరఫరా చేయాలని ప్రమాద బీమా పి ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లను మరియు పెరిగిన వేతనం సాధన కోసం ఇతర సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 4వ తేదీన అన్ని మండల కేంద్రాలలో మరియు సెప్టెంబర్ 13వ తేదీ చలో కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలకు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు కోయగూర పద్మ అలివేలు సైదమ్మ వెంకటమ్మ రామణా తదితరులు పాల్గొన్నారు*
కక్కిరేణి గ్రామంలో గల ప్రైమరీ స్కూల్ కి ప్రింటర్ బహుకరణ:బుక్కాఈశ్వరయ్య
*కక్కిరేణి గ్రామంలో గల ప్రైమరీ స్కూల్ కి ప్రింటర్ బహుకరణ*
బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలో భాగంగా సొసైటీ వ్యవస్థాపకులు శ్రీ బుక్కాఈశ్వరయ్య
గారు 24000/- రూపాయల విలువగల ప్రింటర్ ను ప్రైమరీ స్కూల్ కు బహుకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారు కూడా ఆధునిక పరిజ్ఞానం లో రానించాలని ఆకాంక్ష తో *గతంలో బెస్ట్ సేవా సొసైటీ వారిచే ప్రోజెక్టర్ , సిస్టమ్ ఏర్పాటు చేయనైనది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.కనకసేన గారు మాట్లాడుతూ స్వస్ధలం వదిలి హైదరాబాద్ లో స్థిరపడిన అన్ని వేళల కక్కిరేణి గ్రామంలో గల పాఠశాలకు పలురకాలుగా ఆదుకోనుచున్నా బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు *బుక్కా ఈశ్వరయ్య* గారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ సర్పంచ్ పిట్ట కృష్ణ రెడ్డి గారు ప్రసంగిస్తూ *బుక్కాఈశ్వరయ్య గారు గ్రామంలో సేవాకార్యక్రమాలు చేయడం ఆనందదాయకం, కరోనా సమయంలో కూడా చాలా సహాయం చేశారని యాబై సంవత్సరాల క్రితం ఊరినుండి వెళ్ళి పోయినా జన్మనిచ్చిన గ్రామం పై మమకారంతో సేవలందిండం మా అదృష్టం అన్నారు*.
బెస్ట్ సేవా సొసైటీ ఆర్గనైజర్ వేముల సైదులు ప్రసంగిస్తు పలు ప్రాంతాల్లో బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు చేయడం ఆనందదాయకం మని, అనాథలకు ఎంతో ఉపయోగకరంగా సేవలందిస్తున్న బుక్కా ఈశ్వరయ్య గారికి ఈ గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.గణేష్ , పి గోపాల్ రెడ్డి , వి.యోగి భాలి , భార్గవి , మల్లిక, ఈదులకంటి శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి*
*రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి*
సోదరభావానికి నిలువెత్తు నిదర్శనమే రాఖీ పౌర్ణమి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొప్ప ఆచారమని పేర్కొన్నారు. ప్రజల మధ్య సోదరభావం మరింతగా ఫరిడవిల్లాలని ఆకాంక్షించారు.
సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.రక్షాబంధన్ వేడుకల సందర్భంగా ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
LPG cylinder: ఎల్పీజీ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. సిలిండర్‌పై రూ.200 తగ్గింపు
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. నగృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 చొప్పు తగ్గించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇంట్లో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో రూ.1103గా ఉంది. తగ్గించిన తర్వాత రూ.903కి తగ్గనుంది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ పొందిన వారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా.. తగ్గింపుతో వారికి రూ.400 మేర ప్రయోజనం చేకూరనుంది. అంటే వారికి గ్యాస్ సిలిండర్ రూ.703కే లభించనుంది. అలాగే, ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75 లక్షల కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కొత్తగా ఇవ్వనున్న కనెక్షన్లతో కలిపితే ఈ లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరనుంది..
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను మాత్రం స్థిరంగా ఉంచాయి. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం..
Tuesday, 29 August 2023
Banjara Hills: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ కేంద్రాలు, స్పాల ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న రెండు కేంద్రాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇక్కడ దాడులు నిర్వహించి అయిదుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్.కార్తీక్‌లపై కేసు నమోదు చేశారు.
ది వెల్‌వెట్ స్పాపై…
బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న ది వెల్వెట్ స్పాలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ నలుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసు నమోదు చేశారు.
జాబ్ మేళా లను యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలి.: ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల
జాబ్ మేళాని ప్రారంభించిన గౌ.ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు..
నిజామాబాద్ నగరం లోని భూమా రెడ్డి కన్వెన్షన్ లో గౌ.ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు జాబ్ మేళాని ప్రారంభించారు.
*ఈ సందర్భంగా గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ..*
జాబ్ మేళా లను యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలి.
IT హాబ్ లో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించినపుడు 280 మందికి ఆఫర్ లెటర్ లు ఇవ్వడం జరిగింది.
ఆ రోజే మీ అందరికి చెప్పాము. జాబ్ మేళా లు నిరంతర ప్రక్రియ.ఇది ఆరంభం మాత్రమే అని చెప్పాము.
ఈరోజు 41 కంపెనీలు జాబ్ మేళకి రావడం జరిగింది.
ఉద్యోగం రాని వారు నిరుత్సాహ పడకుండా మరోసారి ప్రయత్నం చేసి కొలువు సాధించాలి.
ఉద్యోగానికి ఎంపికయిన యువతకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు, శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గారు,ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ శ్రీ సాంబారి మోహన్ గారు, నుడా చైర్మన్ శ్రీ ఈగ సంజీవరెడ్డి గారు, టాస్క్ ప్రతినిధులు,BRS నాయకులు,తదితరులు పాల్గొన్నారు
Monday, 28 August 2023
అర్హులైన వారందరికీ రుణాల పంపిణీలో ఆర్.పి ల పాత్ర కీలకం - మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
అర్హులైన వారందరికీ రుణాల పంపిణీలో ఆర్.పి ల పాత్ర కీలకం - మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
*హైదరాబాద్, ఆగస్టు 28:* మహిళాలకు ఆర్థిక చేయూత అందించే పలు రకాల రుణాలు అర్హులైన వారందరికీ పంపిణీలో ఆర్.పి ల పాత్ర కీలకమని అందుకు వారికి డ్రెస్ కోడ్ ను అమలు చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్ సి.ఎం.టి.ఐ.ఎస్ లో సోమవారం అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం అడిషనల్ కమిషనర్, ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్ లతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమీక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సాధికారతకు తోడ్పాటు అందించేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు కాకుండా సీనియర్ సిటిజెన్లకు, వివిధ ప్రతిభావంతులు (దివ్యాంగుల)కు అందించే సహాయం లక్ష్యాన్ని మించి అందించేందుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా స్ట్రీట్ వెండర్స్ కు నగరంలో అందించిన పీఎం స్వానిధి అమలులో జిహెచ్ఎంసి కి మంచి గుర్తింపు రావడం జరిగిందని, అదే విధంగా యు.సి.డి విభాగం ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలు కూడా మంచి గుర్తింపు తేవాలని ఆమె కోరారు.
దానం నాగేందర్ మాట్లాడుతూ... మహిళలు ఆర్థిక శక్తి, బ్యాంకు రుణాలు కాకుండా వివిధ విభాగాలలో భాగస్వామ్యాన్ని కల్పించాలని కోరారు. కాలనీలో పచ్చదనం నిర్వహణకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన జిహెచ్ఎంసి కి బాగా పేరు వచ్చినట్లు తెలిపారు.
అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ఆర్థిక సంవత్సరం నగరంలో 1713 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 48,564 మంది సభ్యులతో కూడిన 515 గ్రూపు లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనంతరం ఈ సమావేశంలో సోమవారం ఉదయం రాంకోఠిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కాలేజ్ బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు సునీత మరణించిన సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సమావేశంలో డి.సి ప్రశాంతి పి డి సౌజన్య, పి డి లు తదితరులు పాల్గొన్నారు.
ఏసీబీ అధికారులను చూసి పరోగో పరుగు … ఏపీలో ఘటన
అన్నదాతను లంచం కోసం వేధించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు రాత్రిపూట దొంగలాగా పరుగెత్తాడు.. పొలంలో పడుతూ లేస్తూ కాళ్లకు బుద్ధి చెప్పాడు. ముచ్చటపడి కొనుక్కున్న కారును పొలంలో వదిలేసి.. కొద్ది క్షణాల క్రితం తీసుకున్న లంచం సొమ్మును పారేసి పరారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం..
జిల్లాలోని ములక్కాయవలస గ్రామానికి చెందిన రైతు డి.ఈశ్వరరావు తన పొలానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఏఈ శాంతారావును ఆశ్రయించారు. ఇందుకు శాంతారావు రూ.60 వేలు లంచం డిమాండ్ చేశాడు. దరఖాస్తు కోసం రూ.4 వేలు ఫో
న్ పే చేసిన ఈశ్వరరావు.. అడ్వాన్స్ గా రూ.20 వేలు శాంతారావుకు ముట్టజెప్పాడు. మిగతా సొమ్ము కూడా ఇస్తేనే విద్యుత్ కనెక్షన్ ఇస్తానంటూ తేల్చి చెప్పాడు. దీంతో ఈశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచనల ప్రకారం ఏఈ శాంతారావును తన పొలం వద్దకు పిలిచి మిగతా రూ.40 వేలు అందజేశాడు.
ప్లాన్ ప్రకారం ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, సీఐ టి.శ్రీనివాసరావులు బైక్ పై అక్కడికి చేరుకున్నారు. కారులో కూర్చుని డబ్బులు లెక్కపెట్టుకుంటున్న కాంతారావు ఏసీబీ అధికారులను చూసి కంగుతిన్నాడు. చేతిలో సొమ్మును బయటకు విసిరేసి, కారును స్టార్ట్ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. బైక్ పై వెంబడించిన సీఐ శ్రీనివాసరావును ఢీ కొట్టి కారును పొలంలోకి మళ్లించాడు. పొలంలో కారు ఆగడంతో కిందకు దిగి కాళ్లకు బుద్ది చెప్పాడు. కారు ఢీ కొట్టడంతో కిందపడ్డ ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయని, ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్పించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏఈ శాంతారావును వెంటనే లొంగిపోవాల్సిందిగా సూచించాలంటూ విద్యుత్ శాఖ ఎస్ఈకి ఫోన్ లో సమాచారం అందించామన్నారు.
ఎన్టీఆర్ నాణెం విడుదల.. స్టేజ్ పై చంద్రబాబుకి దక్కని చోటు*.
* ఎన్టీఆర్ నాణెం విడుదల.. స్టేజ్ పై చంద్రబాబుకి దక్కని చోటు*. 👇👇 *ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంలో తాను సెంటరాఫ్ అట్రాక్షన్ కావాలని చంద్రబాబు విపరీతమై ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ చంద్రబాబుకి స్టేజ్ పై ఎంట్రీ లేకుండా పోయింది. కేవలం ఎన్టీఆర్ సంతానం మాత్రమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు స్టేజ్ పై కూర్చున్నారు. ఓవైపు ఎన్టీఆర్ కుమారులు, మరోవైపు ఎన్టీఆర్ కుమార్తెలు రాష్ట్రపతికి ఇరువైపులా కూర్చున్నారు. వీరందరి సమక్షంలో రాష్ట్రపతి.. ఎన్టీఆర్
స్మారకంగా రూపొందించిన రూ.100 నాణెం విడుదల చేశారు.
Sunday, 27 August 2023
*హైదరాబాద్ లో ఘరానా మోసం..మనిషి ప్రాణాలతో చెలగాటం...పేస్టు కాదు.. వేస్ట్.! కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెలుగుచూసిన భయానక విషయాలు.*
*హైదరాబాద్ లో ఘరానా మోసం..మనిషి ప్రాణాలతో చెలగాటం...పేస్టు కాదు.. వేస్ట్.! కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెలుగుచూసిన భయానక విషయాలు.*
శవ శంకర్.
అబ్బోచికెన్ ,మటన్ ,కోడిగుడ్డు కూర బలే రుచిగా ఉంది....అబ్బో పలావు బలే టెస్ట్ గా ఉంది... అని లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాం...టెస్ట్ రావాలంటే ముందుగా కావాల్సింది అల్లం,వెల్లుల్లి పేస్ట్... ఇది ఇంట్లో చేసుకుంటే ఒకే...*
*బయట అల్లం,వెల్లుల్లి పేస్ట్ కొన్నారా..మన ఆయుస్సుచేతులారా మనం తగ్గించుకునట్టే...ఏంటి అంటారా..అయితే ఈ స్టోరీ చదవాల్సిందే*
కూరలో అయినా అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా వేస్తుంటాం. అల్లం వెల్లుల్లి లేని మసాలా వంటకం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకున్న ఓ ముఠా మనుషుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. విచ్చల విడిగా కల్తీ ఆహారపదార్ధాలను తయారు చేస్తూ మార్కెట్లో చెలామణి చేస్తున్నారు.
తాజాగా మరోసారి హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ బయటపడింది.
రాజేంద్రనగర్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా తయారుచేస్తున్న కల్తీ అల్లం పేస్టు తయారీ గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఉప్పరపల్లిలో ఒక మారుమూల ప్రదేశంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌను ఏర్పాటు చేశారు. ఉప్పరపల్లిలో దిల్దార్ అనే వ్యక్తి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తూ పెద్ద ఎత్తున మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న SOT పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేశారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి అల్లం పేస్టును తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కెమికల్స్‌తో పాటు యాసిడ్, కుళ్లిపోయిన పేస్టును ప్యాకింగ్ చేసి ఎక్స్‌పైరీ డేట్ మార్చి అమ్ముతున్నట్టు దాడుల్లో బయటపడింది. ఈ దాడుల్లో 4 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేశారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కల్తీ ఆహార పదార్ధాలను తయారు చేస్తున్న ముఠాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో చీప్‌గా దొరుకుతుంది కదా అని ఏడితే దాన్ని కొనుక్కోవద్దని సూచిస్తున్నారు అధికారులు. కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్నారు దుర్మార్గులు.
Saturday, 26 August 2023
"అన్ని దనలోకెళ్ల విద్యా దానం మిన్న": mogilapalli upender:
"అన్ని దనలోకెళ్ల విద్యా దానం మిన్న"పూరి స్నేహిత్ కుమార్ 10th లో 9.7% సాధించినాడు మొగుల్లపల్లి యూవసేన ద్వారా చైతన్య కాలేజీలో సీటు ఇప్పించి 10000 ఆర్థిక సహాయం చేయడమైనది బొనగిరి రమేష్ ఆనంద్ రాఘవరెడ్డి పాల్గొన్నారు
దేవాలయాలపై మద్రాస్ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది.*
*ఆలయ భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయని... వాటి మీద వచ్చే ఆదాయం దేవాలయాల అభివృద్ధి, హిందువుల కోసమే ఉపయోగించాలంది.*
*ప్రభుత్వాలు దొంగల మాదిరిగా దోచుకొని ఇతర కార్యక్రమాలు ఇతర మతాలకు ఇవ్వకూడదని చెప్పింది. ఆలయాలకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను తెలిపింది మద్రాస్ హైకోర్టు’*
*1985లో తమిళనాడులో 5 లక్షల ఎకరాలు దేవాలయాల భూములను ఉండేవి... ప్రస్తుతం 4 లక్షల 50 వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారు... మరి 50 వేల ఎకరాలు ఏమయ్యాయి లెక్క తీయండి, ఆక్రమంలో ఉంటె తొక్క తీయండి కేసులు పెట్టండి, మళ్లీ 50 వేల ఎకరాలను దేవాలయాలకు అప్ప చెప్పండి... ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలి, దేవాలయ అధికారులు ఆధీనంలో దేవాలయం ఆధీనంలో మాత్రమే ఉండాలి...*
*ప్రభుత్వాలు పనికిరాని చెత్త పెత్తనం చేయకూడదు... హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అంతేకాదు... దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి, ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, దొంగల మాదిరిగా దోచుకొని మరి ఇతర మతాల కోసం క్రైస్తవులు, ISLAMIC కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ప్రభుత్వాల రోజు వారి పరిపాలన కోసం మీ యొక్క భోగాల కోసం హిందువుల దేవాలయాల ఆదాయాన్ని ఎందుకు వాడుతున్నారు...*
*దాతలు హిందూ దేవాలయాలకు హిందూ దేవుడికి భూములు ఇచ్చారు... దాతలు మీ భోగాల కోసం ఇవ్వలేదు హిందూ ధర్మం కోసం ఇచ్చారు... హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి... దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయండి హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వండి అన్యమతస్తులకు కాదు... సెక్యూలరిజం బొంగు భోషాణం దొంగ ముచ్చట్లు అన్ని మీరు చూసుకోండి కానీ అది హిందూ దేవాలయాలు వాటిని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి... దేశంలో చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు అందులో ఎంత ఆదాయం వస్తుందో ఎవరికీ తెలియదు కానీ హిందూ దేవాలయాలను మాత్రం దొంగల మాదిరిగా దోచుకుంటున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవాలయాల భూములు దేవుళ్ళ యొక్క సంక్షేమం కోసం కృషి ఇచ్చింది ఎస్సార్ మహదేవన్ అనే జడ్జిగారు... కొన్ని రోజుల క్రితమే మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది... హిందూ ధర్మం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు తీసుకొని క్రైస్తవం ఇతర మతాలలో ఉద్యోగాలు తొలగించండి, జీతాన్ని రికవరీ చేయండి కేసులు పెట్టండి అని జడ్జి గారు తీర్పు ఇచ్చారు ఇప్పుడు అదే జడ్జిగారు మళ్లీ హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ కోసం గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది త్వరలో హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వాధీనంలో నుండి బయటకి రావాలి, ఆక్రమణకు గురైన హిందూ దేవాలయాల భూములన్నీ మళ్ళీ దేవాలయాలకు చెందాలి. ఆలయాలు దేవుడి సాక్షిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడవాలి... హిందూ దేవాలయాల ఆదాయంతో హిందువులకు మాత్రమే విద్య, వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి కార్యక్రమాలు జరగాలి. SAVE టెంపుల్స్ అని ఒక గొప్ప ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది. భారతదేశ చరిత్ర మొత్తం మలుపుతిప్పే విధంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది
Thursday, 24 August 2023
వరలక్ష్మి వ్రతం
శ్రావణ శుక్రవారం
వరలక్ష్మి వ్రతం
ధర్మాన్ని సంప్రదాయాన్ని ఈ నాటికి మనం చూస్తున్నామంటే మహిళల యొక్క చల్లటి హృదయంలో ఉండే సౌకుమార్యమే కారణం. వారు పాటించాలి అని అనుకోబట్టే తమ పిల్లల్ని, భర్తని మరియూ తమ గృహానికి సంబంధించిన బంధువర్గాన్ని అందరిని క్రమబద్దం చేసి శాసించే శక్తి కలిగిన వారు మహిళలే. సాధారణంగా మగవారికి నియమాలని తగ్గించుకొనే లక్షణాలు ఉంటాయి. కానీ మహిళలది సంప్రదాయ విషయాల్లో ఏమాత్రం మినహాయింపు లేకుండా ఇలా చేయాలి అని శాసించే హృదయం కలిగినవారు.
ఒక్కో సారి ధనం వస్తుంది, పోతుంది. లేక అది ఉన్నా మనం ఉండకపోవచ్చు. అది ఎట్లా ఉన్నా మనం నిరంతరం మన స్థితిలో నిలబడే యోగ్యత ఏర్పడాలి. అలాంటి 'శ్రీ' అసలైన సంపద అని అంటారు. అది కేవలం భగవంతుని దయ వల్ల కలగాల్సిందే. అందుకే అట్లాంటి సంపద కోసం భగవంతుని దయనే ప్రార్థన చేస్తాం. భగవంతునిలోని దయనే మనం లక్ష్మీ అని అంటాం. ఆ దయకే శ్రీ అని పేరు. భగవంతుని హృదయ మందిరంలో నిండుగా ఉంటుంది 'శ్రీ'. దయ అనేది స్త్రీ స్వభావం కనుకనే స్త్రీ రూపంలో చూస్తాం. ఈ జగత్తుని శాసించే సర్వ జగత్తు యొక్క నియంతని తండ్రి అని అనుకుంటే, ఆ భగవంతునిలో ఉండే దయని ఆమ్మ అని భావిస్తే, ఆ అమ్మ ద్వారా వెళ్తే మనం భగవంతుడిని అశ్రయించడం సులభం. మన తప్పులను కనపడకుండా చేసి భగవంతుని అనుగ్రహాన్ని ప్రసరింపజేసేది అమ్మ. అమ్మ మన పాలిటి వర ప్రదాత. అందుకే వరలక్ష్మి అని ఆమెకు పేరు.
రూపు దాల్చిన దయ అమ్మ లక్ష్మీ దేవి. అమ్మని భగవంతుణ్ణి చూపే గుర్తుగా భావిస్తాం. సాధారణంగా తల్లి దగ్గర ఉన్న చనువు తండ్రివద్ద ఉండదు. తల్లి వద్ద మనకు కావల్సిన వాటిని చెప్పడంలో ఆలోచించము. అట్లానే ఈ జగత్తును కాపాడే భగవంతుని విషయంలో కూడా మనం భగవంతుణ్ణి చేరడానికి ఒంటరిగా ఒక సమయాన్ని మనకే అందుబాటులో మన మాటలే వినడానికి అమ్మ స్వీకరించిన సమయమే శ్రావణమాసం. పూర్ణిమ శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటుంది. శ్రవణ నక్షత్రం మన మాటలని అమ్మను వినేట్టు చేస్తుంది. శ్రవణ సంబంధమైనది కనుక శ్రావణం అని పేరు. ఈ మాసం మొత్తం అమ్మ మనకు అందుబాటులో ఉంటుంది కనుక అమ్మ అనుగ్రహం పొందేట్టు ప్రవర్తించాలి.
మాసానికున్న గొప్పతనం అది. అయితే శ్రావణ మాస ప్రతి శుక్రవారానికి మరింత ప్రాధన్యత ఉంది. అమ్మ పేరు భార్గవి, అంటే భృగు వంశానికి చెందినది. భృగు గ్రహమే అంటే శుక్ర గ్రహం. అందుకే ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఉండే రోజు శుక్రవారం. ఆనాడు ఆరాధన చేస్తే మరింత మంచిది. అట్లా ప్రతి శుక్రవారానికి అట్లాంటి ప్రత్యేకత ఉంటుంది, కానీ దానికి తోడు శ్రావణ మాసం అయ్యే సరికి లక్ష్మీ దేవిని ఆరాధన చేసుకోవడం, ఆ తల్లి నామాన్ని, తల్లి గురించి నోరారా పలికితే ఎంతో శ్రేయోదాయకం. అందుకే వైదిక ధర్మంలో మహిళలకు ఈ మాసం ప్రాధాన్యం ఇస్తారు. వారు చేసుకొనే ధార్మిక కార్యక్రమాలకి పూర్తి స్వాతంత్రం ఇస్తారు. తమ సఖీ వర్గంతో కలిసి భగవదారాధన, వేడుకలు చేసుకుంటారు.
డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు*
హైదరాబాద్;ప్రతినిధి
హైదరాబాద్:ఆగస్టు 24
తెలంగాణలో మరో ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్ తలిగింది. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు.
తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయనపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.
కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా విధిస్తూ అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది...
చంద్రయాన్-3 సక్సెస్ లో వైశ్యుల కీలకపాత్ర
🔹 ప్రధాన భూమిక పోషించిన ఆరుగురు వైశ్యులు
చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో మన వైశ్య శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించడం, జాతికి గర్వకారణం. శ్రీకాంత్ గుప్త,ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇస్రో, మెజెస్టి మురళీ గుప్త జిఎం,రాడార్ డివిజన్ ఇస్రో, కోటగిరి శ్రీలేఖ గుప్త యంగ్ సైంటిస్ట్ ఇస్రో, బూర్లే కౌషి ప్రియతం గుప్త యంగ్ సైంటిస్ట్ ఇస్రో, బలభద్ర సురేష్ గుప్త యంగ్ సైంటిస్ట్ ఇస్రో, మాటూరి హారిక గుప్త,యంగ్ సైంటిస్ట్ ఇస్రో, చంద్రయాన్ విజయవంతంలో భాగస్వాములయ్యారు. ప్రాజెక్ట్ ఆరంభమైన నాటి నుండి ఈ ఆరుగురు శాస్త్రవేత్తలు చంద్రయాన్-3లో తలమునకలుగా పని చేశారు. వారి వారి విభాగాల్లో ఎవరికి వారు తమ ప్రతిభ కనబరుస్తూ, త్రివర్ణ పతాకాన్ని చంద్రమండలంపై రెపరెపలాడించారు. ఈ విధంగా వైశ్య జాతి రత్నాలు, భరతజాతికి వన్నెతెచ్చారు.
"జయహో భారత్"
"జయహో ఇస్రో"
"జయహో వైశ్య"
Wednesday, 23 August 2023
చంద్రయాన్ -3 విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలన లో మనఆర్యవైశ్య ముద్దుబిడ్డ కోటగిరి శంకర్ గారి కూతురు శ్రీలేఖ
చ రి
త్ర సృష్టించిన చంద్రయాన్ -3 విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలన లో మన సూర్యాపేట ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కోటగిరి శంకర్ గారి కూతురు శ్రీలేఖ తన వంతు పాత్ర పోషించడం మనందరికీ ఎంతో గర్వకారణం . వారికి అభినందనలు .
Monday, 21 August 2023
వేముల శ్రీనివాసులు కు కీర్తి పురస్కారం
💐💐
*వరంగల్ జల్లాలోని ముల్కనూర్ గ్రంధాలయ అభివృధి కి విశేష కృషి చేసిన మన ఉన్నతాధికారి శ్రీ వేముల శ్రీనివాసులు గుప్త గారిని పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రత్యేకంగా గుర్తించి వారికి కీర్తి పురస్కారం ప్రకటిచడం జరిగింది.*
*ఈ సందర్భంగా వేముల సార్ కి హృయపూర్వక శుభాభినందనలు*💐💐
Saturday, 19 August 2023
ఆదిత్యనాథ్ కన్నా రజనీకాంత్ వయసులో చాల పెద్ద!రజనీకాంత్ వినయానికి, నమ్రతకు పెట్టింది పేరు.
యోగి ఆదిత్యనాథ్ కు రజనీకాంత్ పాదాభివందనం.
ఆదిత్యనాథ్ కన్నా రజనీకాంత్ వయసులో చాల పెద్ద!
ఇలాంటివాటిని చూసైనా విద్వేషవాదులైన మేధగాళ్లు (మేధావులు) బుద్ధి తెచ్చుకోవాలి.
రజనీకాంత్ వినయానికి, నమ్రతకు పెట్టింది పేరు.
రజనీకాంత్ జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి ఉచ్చస్థాయికి ఎదిగిన వ్యక్తి.
రజనీకాంత్ కులం, మతంతో ఎదిగిన తుచ్చుడు కాదు. వికృత స్వభావుడు కాదు.
ప్రభుత్వ రిజర్వేషన్లతో అక్రమంగానూ, అనర్హతతోనూ, పనికిమాలినతనంతోనూ పబ్బం గడుపుకుంటూ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక నీచుడు, భ్రష్టుడు, దుష్టుడు కాదు రజనీకాంత్.
రజనీకాంత్ జాతీయభావల వ్యక్తి.
మతి పగిలిపోయిన విద్వేషవాదులకు రజనీకాంత్ ఇలా యోగి ఆదిత్యనాథ్ కు పాదాభివందనం చెయ్యడం అర్థం కాకపోవచ్చు; అభిశంసనీయం కావచ్చు. వాళ్ల వక్రతవల్ల వాళ్లకు ఔన్నత్యం అర్థం కాదు.
*తన విజయం తనది కాదు", "*తాను ఒక సామాన్యుణ్ణి" అన్న భావన, ఆలోచన ఉన్న విజయవంతమైన వ్యక్తి తీరు ఇదిగో ఇలాగే ఉంటుంది*.
--- *శ్రీదర్. బొగ్గారపు* ✍️✍️✍️
అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో కంచెలు వేయడం కుదరదా?
అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో కంచెలు వేయడం కుదరదా?
రుమల నడక దారిలో చిన్నారి లక్షితపై చిరుతపులి దాడి తర్వాత టీటీడీకి ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్స్ లో ఒకటి అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గంలో కంచెను ఏర్పాటు చేయొచ్చు కదా.. ఎందుకు వేయట్లేదని భక్తులు, నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చే తిరుమల వెంకన్న నిధుల కొరతలేంటని మరికొందరి ప్రశ్న. ఇదే విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు కూడా గతంలో కొన్ని సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. వాస్తవానికి తిరుమల నడకమార్గంలో కంచె ఏర్పాటు విషయంలో అవరోధంగా మారుతున్న ప్రధాన అడ్డంకులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. దేశంలోనే మూడో అతిపెద్ద బయో స్పియర్ రిజర్వ్
కేంద్ర ప్రభుత్వం తిరుమల కొండలు ఉన్న శేషాచలం అటవీ ప్రాంతాన్ని దేశంలోనే మూడో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ గా గుర్తించింది. అంటే ఇక్కడ ఉండే అడవుల్లో చాలా రకాలైన జీవజాతులు ఉంటాయి. వాటిలో చాలా వరకూ అంతరించిపోయే దశకు వచ్చేసినవి ఉన్నాయి కనుక వాటిని కాపాడాలనే ఉద్దేశంతో శేషాచలం అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 8వేల కిలోమీటర్ల ప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్ చేసింది. ఈ ప్రాంతానికి లీగల్ ప్రొటక్షన్ ఉంటుంది. ఏ చిన్న అభివృద్ధి పని చేయాలన్నా చాలా పై స్థాయిలో పర్మిషన్ ఉండాలి. తిరుపతి, రాజంపేట ఫారెస్ట్ డివిజన్స్ తో పాటు తిరుపతి లో ఎస్వీ జూ పార్క్ కూడా ఈ పరిధిలోకి వస్తుంది. కనుక ఇక్కడ బతికే జీవజాతులకు ఆటంకంగా మారే ఏ పనినీ చేపట్టడం అంత సులభం కాదు.
2. వన్యప్రాణుల సంరక్షణ చట్టం - 1972
అడవుల్లో జీవించే వన్యప్రాణుల స్వేచ్ఛ కోసం, వాటి జీవనం కోసం మన రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. 1972లో రూపొందించిన వన్యప్రాణుల సంరక్షణ చట్టం అలాంటిదే. రాజ్యాంగంలో 48ఏ చెప్పేది ఏంటంటే.. రిజర్వు ఫారెస్ట్ (Reserve Forest) లలో వన్యప్రాణుల కదలికలను అడ్డుకోవటం కానీ వాటికి హాని తలపెట్టే విధంగా చర్యలు చేపట్టటం కానీ నేరంగా పరిగణిస్తారు. ఇప్పుడు తిరుమల నడకమార్గంలో కంచెలు ఏర్పాటు చేస్తే అది వన్యప్రాణుల స్వేచ్ఛను హరించటమే. మనకు ఎలా అయితే ఈ సమాజంలో స్వేచ్ఛగా బతికే హక్కు ఉందో అలాగే అడవిలో వన్యప్రాణులకు అన్నమాట.
3. కంచె వేయటం మరింత ప్రమాదకరం
చాలా మంది ఆలోచించని విషయం ఏంటంటే చిరుతల్లాంటి ప్రాణులు చాలా ఎత్తులు కూడా ఎక్కగలవు. 20, 30 అడుగుల చెట్టు పైకి ఎక్కి కొమ్మలపై చిరుత హాయిగా నిద్రపోతుంది. అలాంటిది ఐదు, పది అడుగుల ఎత్తైన కంచెలు చిరుతల్లాంటి జంతువులను ఏ మాత్రం ఆపలేవు. ఒకవేళ కంచె వేసినా అది దూకి కంచెలోపలకి పొరపాటున వస్తే... అప్పుడు ఇంకా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణభయంతో జనాల తొక్కిసలాట, అదే ప్రాణభయంతో ఆ క్రూరమృగం మనుషులపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించలేం. కనుక కంచె వేయడం, గోడలు లాంటివి నిర్మిస్తే అందులో దూరిన చిరుతపులి లాంటి వన్య ప్రాణాలు బయటకు వెంటనే వెళ్లగలిగే అవకాశం ఉండదు కనుక అది మరింత ప్రమాదకరం.
4. జంతువులను జూ కు తరలించటం
మరికొంత మంది చెబుతున్న విషయం చిరుతలు, పులుల వంటి వాటిని బోన్లు పెట్టి పట్టి జూలలో బంధించొచ్చు కదా. అది కూడా కరెక్ట్ కాదు. పులి, చిరుత, సింహం, ఏనుగు ఏ జంతువైనా అది బతికే వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటుంది. కనుక ఆ ప్రాంతం నుంచి మార్చినా..బోనులో పెట్టినా అది బెంగపడి చనిపోవచ్చు కూడా. సైకలాజికల్ గా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి వన్యప్రాణలు.
5. మరి చేయాల్సిందేంటీ
ఇవన్నీ సరే మనిషిగా మన ప్రాణం మరింత విలువైంది కదా అని సందేహం రావచ్చు. నిజమే. అందుకే తగిన జాగ్రత్తలు పాటించాలి. తిరుమల లాంటి ఆలయాలకు రాత్రి వేళల్లో నడిచి వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరే కాకుండా గుంపులుగా వెళ్లటం వలన క్రూరమృగాలు దగ్గరికి రావు. తమకు అపాయం ఉందన్నా, లేదా తమ శక్తి కంటే ఎక్కువ శక్తి ఉన్న జంతువులు, మనుషులు కనిపించినా పులి, చిరుత లాంటివి దాడులకు దిగవు. జంతువులకు ఆహారం పెట్టడం కూడా సరికాదు. వాటంతంట అవే ఆహారాన్ని సమకూర్చుకోగలవు. మనం ప్రేమతో పెడుతున్నాం అనుకున్నా వాటికి సొంతంగా ఆహారాన్ని సంపాదించుకునే శక్తిని దూరం చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి.
చివరగా ఆహారపదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయటం వలన వాటిని తినేందుకు కుక్కలు, నక్కలు లాంటి జంతువులు వస్తే.. వాటిని తినేందుకు పులులు, చిరుతలు లాంటివి వస్తాయి కనుక అలాంటి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం అని టీటీడీ అధికారులు సూచించారు.
Friday, 18 August 2023
జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ‘ఒక్కడే నెం.1’ పోస్టర్, టీజర్ లాంచ్
క్లాసిక్
క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సునీత, శృతిక, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఈ చిత్రం పోస్టర్, టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ, తెలంగాణ ఎమ్మెల్సీ బి. దయానంద్‌లు విచ్చేశారు. జేడీ లక్ష్మీనారాయణ సినిమా పోస్టర్, టీజర్‌లను ఆవిష్కరించారు. అనంతరం చిత్రంలోని 5 పాటల్లోంచి 4 పాటలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...
సహజంగా నేను సినిమా ఈవెంట్‌లకు రాను. అయితే వెంకన్నగారు పోలీస్ ఆఫీసర్ మీద తీసిన అని చెప్పారు. అలాగే ట్రైలర్ కూడా చూపించారు. అది చూసిన తర్వాత ఇంప్రెస్ అయి ఈ కార్యక్రమానికి రావటానికి అంగీకరించాను. ఈ వయసులో వెంకన్నగారు హీరోగా నటిస్తూ సినిమా నిర్మించడం.. అందులోనూ సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ చేయడం గ్రేట్. ఇప్పుడు ప్రదర్శించిన పాటలు కూడా వేటికవే చాలా బాగున్నాయి. సంగీతం, సాహిత్యం, కొరియోగ్రఫీ, కెమెరా వర్క్ అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విజయంతో వెంకన్నగారు సమాజానికి ఉపయోగపడే మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ ఆల్‌ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ మాట్లాడుతూ...
వెంకన్నగారు పారిశ్రామికవేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా రంగంపై దృష్టిపెట్టి సమాజానికి ఉపయోగపడేలా ఓ పోలీస్ ఆఫీసర్ కథను ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. ఆయన ఈ సినిమాతో విజయం అందుకుని మరిన్ని సినిమాల్లో నటించాలని, నిర్మించాలని కోరుకుంటున్నా అన్నారు.
తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ వెంకన్న ఇలాంటి మరిన్ని చిత్రాలు చేయాలని శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ...
ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన జేడీ లక్ష్మీ నారాయణ గారికి, ఎమ్మెల్సీ దయానంద్ గారికి, దర్శకులు రేలంగి నరసింహారావు గారికి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి మరియు నా మిత్రులు, శ్రేయోభిలాషులకు, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. నాకు పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాలవలన కాలేక పోయాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీర్చుకుంటున్నా. ట్రైలర్‌లో మీరు చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా మంచి కంటెంట్, ట్విస్ట్‌లు ఉంటాయి. ఈ వయస్సులో నేను హీరోగా చేయడం ఏంటి అనుకోలేదు. మన టాలీవుడ్ సీనియర్ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. దర్శకుడు శ్రీపాద రామచంద్రరావు గారు బాగా డీల్ చేశారు. తుమ్మపల్లి రామసత్యనారాయణ గారు సినిమా పరిశ్రమలో సక్సెస్ రేటు 5 శాతానికి మించి లేదు కదా.. హాయిగా వ్యాపారాలు చేసుకోక ఎందుకు అన్నారు. ఆ 5 శాతంలో నేను ఎందుకు ఉండ కూడదు అన్నాను. ఆయన ఈ సినిమాకు సంబంధించి చాలా మంచి సలహాలు ఇచ్చారు. అలాగే థియేట్రికల్ రిలీజ్ విషయంలో కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. యూనిట్ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ...
వెంకన్నగారిలో ఇంత ప్యాషన్ ఉందని నేను ఊహించలేదు. ఖచ్చితంగా మంచి నటుడు అవుతారు. చిన్న బడ్జెట్‌తో పెద్ద సినిమా తీశారు. ఆయన నాతో అన్నట్టు సక్సెస్ అవుతున్న 5 శాతం మందిలో ఈయన కూడా ఉంటారు. పాటలు, సంగీతం, కొరియోగ్రఫీ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ...
నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినప్పుడు ఇదేదో చిన్న సినిమాలే అనుకున్నాను. కానీ ఇప్పుడు తెరమీద ట్రైలర్, పాటలు చూస్తే ఓ పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. యూనిట్ అంతా సమష్టిగా కృషి చేశారు. అది తెరమీద కనిపిస్తోంది. నిర్మాత ఆర్థిక భరోసా అందిస్తే టెక్నీషియన్స్ సినిమాను ఏ రేంజ్‌కు తీసుకెళ్తారో ఈ సినిమా నిరూపిస్తోంది. అందరికీ మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నా అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్‌తో పాటు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, యంగ్ హీరో క్రిష్, చిత్ర హీరోయిన్‌లు, తల్లాడ వెంకన్న శ్రేయోభిలాషులు సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ ప్రసంగించారు.
ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి`యన్.టి.ఆర్, సంగీతం: రామ్ తవ్వా, కొరియోగ్రఫీ: సాగర్ వేలూరు, లిరిక్స్: శ్రీనివాస్, ఫైట్స్: రాజ్‌కుమార్, కృష్ణంరాజు, శ్యాం, కెమెరా: డి. యాదగిరి, ఆర్.ఆర్. చిన్నా (చెన్నై), వి.ఎఫ్.ఎక్స్: చందు ఆది Ê టీమ్, పి.ఆర్.ఓ: బి. వీరబాబు, నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడp సునీల్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద రామచంద్రరావు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా ధ్రువీకరించి పంపాలి. దరఖాస్తుతోపాటు జర్నలిస్టు మరణ ద్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ ధ్రువీకరణ పత్రం, జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలు ఉండాలని అన్నారు.
ప్రమాదం బారిన పడిన జర్నలిస్టు లేదా అనారోగ్య కారణాలతో పని చేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు కూడా ఆర్థిక సహాయార్థం దరఖాస్తు చేసుకోవాలని, ఈ దరఖాస్తుతోపాటు ప్రభుత్వ సివిల్ సర్జన్ డాక్టరు ఇచిన “జర్నలిస్టు పని చేసే స్థితిలో లేడు (INCAPACITATION)” అనే సర్టిఫికేట్, ఆదాయ ధ్రువీకరణ, జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలతో జిల్లా పౌర సంబంధాల అధికారి ధ్రువీకరణతో పంపాలి. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని మీడియా అకాడమి చైర్మన్ తెలిపారు.
ఇప్పటికే మీడియా అకాడమీ నుండి లబ్ది పొందిన వారు, పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఇప్పటి వరకు దరఖాస్తులు ఇవ్వని వారు మాత్రమే తమ దరఖాస్తులను ఆగస్టు నెల 21వ తేదీలోపు కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి.నెం.10-2-1, యఫ్.డ్.సి.కాంప్లెక్సు, 2వ అంతస్థు, సమాచార భవన్, మాసబ్ టాంక్, హైదరాబాదు – 500028 లో అందజేయాలి. అందిన దరఖాస్తులను జర్నలిస్టు సంక్షేమ నిధి కమిటీ పరిశీలించి ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఇతర వివరాలకు కార్యాలయ అధికారి మొబైల్ నెంబర్ 7702526489 ను సంప్రదించగలరని ఆయన తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త.
శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త.