నల్గొండ : జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ రోడ్డు, కంచన పల్లి, గుండ్లపల్లి లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సెంటర్ వద్ద త్రాగునీటి వసతులు, సరైన నీడ సౌకర్యము కల్పించాలని సెంటర్ ఇన్చార్జీలకు సూచించారు.
కొనుగోలు చేసిన వరి ధాన్యం బస్తాల పైన తార్పాల్ తో జాగ్రత్త తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చీకటి సమయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment