హైదరాబాద్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆ పార్టీ వరంగల్ఎంపీ అభ్యర్థి కడియం కావ్య షాకిచ్చారు. తాను ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె కేసీఆర్ కు లేఖ రాశారు. ఇటీవల బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓటు అడగాలో అర్థం కావడం లేదని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. అలాగే జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకోవడమే మేలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. తన నిర్ణయానికి అసంతృప్తి చెందితే కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment