Wednesday, 27 March 2024

ఏసీబీ వలలో తాసిల్దార్

 నారాయణపేట జిల్లా గుండుమల్‌ తహసీల్దార్‌ పాండు బుధవారం లంచం తీసుకుంటూ ఎసీబీకి చిక్కాడు. మండలంలోని బోగారం గ్రామానికి చెందిన మల్లేష్‌ తన భూమిని వేరొకరికి అమ్మగా.. భూ రిజిస్ర్టేషన్‌ కోసం ఈ నెల 21న స్లాట్‌ బుక్‌ చేసుకొని, 22న తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. భూమి రిజిస్ర్టేషన్‌ చేయాలంటే రూ.1,500 లంచం ఇవ్వాలని తహసీల్దార్‌ డిమాండ్‌ చేశాడు.                   


రూ.2 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడిన గుండుమల్‌ అధికారి

రికార్డ్‌ అసిస్టెంట్‌, ధరణి ఆపరేటర్‌ కూడా అదుపులోకి..

కోస్గి రూరల్‌, మార్చి 27: నారాయణపేట జిల్లా గుండుమల్‌ తహసీల్దార్‌ పాండు బుధవారం లంచం తీసుకుంటూ ఎసీబీకి చిక్కాడు. మండలంలోని బోగారం గ్రామానికి చెందిన మల్లేష్‌ తన భూమిని వేరొకరికి అమ్మగా.. భూ రిజిస్ర్టేషన్‌ కోసం ఈ నెల 21న స్లాట్‌ బుక్‌ చేసుకొని, 22న తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. భూమి రిజిస్ర్టేషన్‌ చేయాలంటే రూ.1,500 లంచం ఇవ్వాలని తహసీల్దార్‌ డిమాండ్‌ చేశాడు. తన దగ్గర డబ్బులు లేవని మల్లేష్‌ చెప్పడంతో నీ భూమి కోసం రెండు గంటలు ఎక్కువగా పని చేశానని, కచ్చితంగా ఇవ్వాలని అన్నాడు. దాంతో ధరణి ఆపరేటర్‌ రవీందర్‌కు ఫోన్‌పే ద్వారా మల్లేష్‌ వెయ్యి రూపాయలు పంపించాడు. తరువాత మరుసటి రోజు మరో భూమి రిజిస్ర్టేషన్‌ కోసం డాక్యుమెంట్‌ తీసుకొని మల్లేష్‌ తహసీల్దార్‌ ఆఫీ్‌సకు వచ్చాడు. దాంతో తహసీల్దార్‌ పాండు.. ఈశ్వర్‌గౌడ్‌కు 20 గుంటల భూమి అమ్ముతున్న డాక్యుమెంట్‌ అయితే నిన్ననే మాకు డబ్బులు తక్కువ ఇచ్చావని, ఒక్కో డాక్యుమెంట్‌కు 1,500 చొప్పున రెండింటికి మూడువేలు అవుతాయని చెప్పాడు. నిన్న వెయ్యి ఇచ్చావని, ఇంకో రూ.2,000 ఇవ్వకపోతే నీకు భవిష్యత్‌లో ఇబ్బంది అవుతుందని అన్నాడు. దాంతో మల్లేష్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు మల్లే్‌షకు బుధవారం రూ.2,000 ఇచ్చి పంపించారు. మల్లేష్‌ తహసీల్దార్‌ను సా యంత్రం కలువగా.. రికార్డ్‌ అసిస్టెంట్‌ మొగులప్పను పిలిచి డబ్బులు తీసుకోవాలని చెప్పాడు. అతను ఓ పాత పహాణి రికార్డు తీసుకొని అందులో డబ్బులు పెట్టాలని చెప్పాడు. రికార్డు అసిస్టెంట్‌ ఆ రికార్డు తీసుకెళ్లి తహసీల్దార్‌కు ఇచ్చాడు. వెంటనే మల్లేష్‌ బయటకు వచ్చి ఏసీబీ అధికారులకు చెప్పడంతో వారు వచ్చి తహసీల్దార్‌ను పట్టుకున్నారు. రూ.2,000 తీసుకొని తహసీల్దార్‌తోపాటు రికార్డ్‌ అసిస్టెంట్‌, ధరణి ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు చెప్పారు.

No comments:

Post a Comment