హైదరాబాద్: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ తొలగిపోయింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం ( మార్చి 31న) కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించినా, ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. అనుకున్నట్లుగానే కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. ఏఐసీసీ పెద్దలు, కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలతో చర్చించిన అనంతరం అధిష్టానం సోమవారం రాత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
No comments:
Post a Comment