నల్లగొండ: నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం ఈనెల 30న ఉదయం 11 గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుం.
దని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు.
మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 28న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో సీఈసీ సమావేశానికి వెళ్లాల్సి ఉండడంతో సమావేశాన్ని 30కి వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ సిఇసి సభ్యుడైనందున ఈ సమావేశానికి వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.
30న రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ,నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం యధావిధిగా జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు పాల్గొంటారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశానికి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, ఏఐసీసీ, మెంబర్లు, డిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు, సభ్యులు, జిల్లా, బ్లాక్, మండల గ్రామ, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శిలు , జెడ్పిటిసిలు, ఎంపీపీలు,పిఎసిఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,తాజా మాజీ సర్పంచ్లంతా హాజరుకావాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కత్తుల కోటి, మాజీ కౌన్సిలర్లు మందడి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ ఇంతియాజ్ అలీ, నాయకులు జూలకంటి సైదిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా రాకేష్, గోలి రవి, పెరిక చిట్టి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment