తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది.
Half day school in Telangana from March 15th check timings here TS Half Day Schools : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో ఒంటిపూట బడులు
Half Day Schools in Telangana: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బడులు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాలలకు ఒంటిపూట బడులపై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ మూడోవారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యా హ్నం 12.30 గంటలకు అందజేస్తారు. ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి.. ఆ తర్వాత తరగతులు కొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత..యథావిథిగా ఉదయం పూట తరగతులు నిర్వహించనున్నారని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
No comments:
Post a Comment