Thursday, 21 March 2024

హెచ్‌ఎండీఏ ఏపీవో సస్పెన్షన్‌


 

హెచ్‌ఎండీఏ ఏపీవో సస్పెన్షన్‌

 

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారిని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారిని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గండిపేట మండలం పుప్పాల గ్రామ రెవెన్యూ సర్వే నంబర్‌ 314, 317, 330, 332 పరిధిలో ఉన్న స్థలాలు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన 100 అడుగుల రోడ్డులో తమ భూ ములు పోయాయని కొందరు టీడీఆర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.                                        ఇందులో శ్రావణ్‌ కుమార్‌ 10-11-2023న 11698 చదరపు గజాల స్థలానికి, వెంకటరమణ 22046 చదరపు అడుగుల స్థలం ఉందని హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై హెచ్‌ఎండీఏ శంకర్‌పల్లి జోన్‌ ప్లానింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారి బీవీ కృష్ణకుమార్‌ రెండు దరఖాస్తులపై పూర్తి స్థాయిలో విచారణ చేయలేదు.

ఆయా స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్‌ నంబర్లు, వాటి యజమానులు ఎవరు అన్న విషయాలను పరిశీలించకుండానే వారికి టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) కింద పరిహారాన్ని ఇవ్వాలని సిఫారసు చేశారు. దీంతో ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీవీ కృష్ణ కుమార్‌ను కమిషనర్‌ సస్పెండ్‌ చేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉదంతంపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు హెచ్‌ఎండీఏ ఎస్టేట్‌ ఆఫీసర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు.

మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఆగ్రహం
హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్న అవకతవకలపై హెచ్‌ఎండీఏ మె ట్రోపాలిటన్‌ కమిషనర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక ప్రభుత్వ అధికారిగా సమర్థంగా విధులు నిర్వహించడంతోపాటు ప్రజాధనాన్ని వృథా కాకుండా కాపాడాల్సిన అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనడానికి ఇది నిదర్శనమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు సమాచారం.

No comments:

Post a Comment