కిలో నూనె రూ.30కే.. వాళ్లకు మాత్రమే!
:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులపాలిట కల్పతరువు ఇప్ప చెట్టు. ఇప్పచెట్టుతో ఆదివాసి గిరిజనులకు విడదీయలేని సంబంధం ఉంది. ఎంతో పవిత్రంగా భావించే ఈ చెట్టుకు గిరిజనులు వివిధ సందర్భాల్లో పూజలు కూడా చేస్తారు. ఇదే ఇప్పచెట్టు వేసవిలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులకు ఉపాధిని కూడా ఇస్తుంది. వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో విరివిగా లభించే ఇప్పపువ్వును సేకరించి గిరిజనులు ఉపాధిని పొందుతారు. మరోవైపు ఎన్నోపోషక గుణాలు కలిగి ఉన్న ఈ ఇప్పపువ్వుతో గిరిజనులు వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేసుకుంటారు. ఇందులో ఇప్ప లడ్డూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రక్త హీనత వంటి సమస్యలకు చక్కటి పరష్కారంగా ఈ ఇప్ప లడ్డూలను పేర్కొంటారు. అయితే తాజాగా ఇదే ఇప్ప పువ్వుల నుండి వచ్చ ఇప్ప పరకతో నూనె ను కూడా తయారు చేస్తున్నారు. కట్టెగానుగ పద్దతిలో ఈ నూనెను తయారు చేస్తున్నారు. దీన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ అని కూడా పిలుస్తారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండల కేంద్రంలో గిరిజన మహిళలు మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నూనె తయారీ కేంద్రాన్ని నెలకొల్పి ఉపాధిని పొందుతున్నారు. సిర్పూర్(యు) మండలం లోని నెట్నూరు(కె) గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజన మహిళలు జాయింట్ లైవ్ లి వుడ్ గ్రూపుగా ఏర్పడి సిర్పూర్(యు)లోని మండల మహిళా సమాఖ్య భవనంలో ఈ నూనె తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. వారే స్వయంగా దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు.............
ఇప్ప పరకతో ఇప్ప నూనె తీయడంతోపాటు పల్లీలు, నువ్వుల నూనె కూడా తయారు చేస్తారు. ఉట్నూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్థిక మద్దతు కూడా వీరికి లభించింది. ఇక్కడ ఇప్ప పరకతో తయారు చేసిన నూనె 200 గ్రాములకు 150 రూపాయల ధర పలుకుతుండగా, కిలో నూనె ధర 800 రూపాయల వరకు పలుకుతోంది. అయితే తాము తయారు చేసిన నూనెలను విక్రయించడమే కాకుండా ఎవరైనా తమ సొంత నూనె గింజలను తీసుకుని వస్తే 30 రూపాయలకు కిలో చొప్పున నూనె తీసి ఇస్తారు. పది కిలోల ఇప్ప పరకతో నాలుగు కిలోల ఇప్ప నూనె తయారవుతోంది.
ఈ నూనె ను స్థానికంగానే కాకుండా గిరిజన వేడుకలు, సభలు, సమావేశాలు జరిగే ప్రదేశాల్లో, ఇంకా అధికారిక కార్యక్రమాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. కాగా ఆన్ లైన్ మార్కెట్ లో ఇదే ఇప్ప నూనె ధర ఇక్కడికంటే ఎక్కువగానే ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ నూనె తయారీ కేంద్రం తమ ఆర్థిక అభివృద్దికి ఎంతో తోడ్పడుతోందని మండల సమాఖ్య అధ్యక్షురాలు మడావి వనజ NS99
న్యూస్తో తెలిపారు. ప్రభుత్వం తమకు మరింత చేయూతను అందిస్తే మరింత నాణ్యమైన నూనె తక్కువ ధరకే తాము అందిస్తామని
No comments:
Post a Comment