Friday, 15 March 2024

బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవితను ఈడీ అరెస్టు

 హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవితను ఈడీ అధికారులు అరెస్టు



చేశారు. ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవిత నివాసం వద్దకు బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బిఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా, ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కెటిఆర్‌, హరీష్‌రావుతో పాటు పలువురు బిఆర్‌ఎస్‌ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు.

No comments:

Post a Comment