Monday, 8 April 2024

ఉగాది పంచాంగం విశిష్టతలేంటి... పంచాంగ శ్రవణ ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

  ఉగాది పంచాంగం విశిష్టతలేంటి... పంచాంగ శ్రవణ ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...




Ugadi Panchangam 2024 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కొత్త ఏడాది ఉగాది పండుగతోనే ప్రారంభమవుతుంది. ఈ ఏడాదిని శ్రీ ‘క్రోధి’నామ సంవత్సరంగా పరిగణిస్తాం. అయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసేందుకు గల కారణాలేంటి.. అసలు పంచాంగం అంటే ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ugadi Panchangam 2024 ఉగాది పంచాంగం విశిష్టతలేంటి... పంచాంగ శ్రవణ ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

Ugadi Panchangam 2024 తెలుగు వారందరికీ ఉగాది అంటేనే పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకొస్తాయి. ఈ పవిత్రమైన రోజున పంచాంగం వినడం ఆనవాయితీ. ఈరోజున తమ భవిష్యత్తుకు సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాల గురించి తెలుసుకోవాలనుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం నాడు ఉగాది పండుగ వచ్చింది. ఈసారి తెలుగు ఏడాది శ్రీ ‘క్రోధి’నామ సంవత్సరంగా ప్రారంభం కాబోతుంది. ఉగాది పండుగ రోజున దేవాలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి.. ఏమైనా దోషాలుంటే నివారణలు తెలుసుకుంటారు. ఇదిలా ఉండగా.. ఉగాది పంచాంగం విశిష్టతలేంటి.. పంచాంగం శ్రవణం చేసే ముందు పాటించాల్సిన నియమాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పంచాంగం అంటే..

తెలుగు పంచాంగ శ్రవణంలో భాగంగా పంచ అంగాలైన తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం వంటి వాటిని పక్కాగా లెక్కిస్తారు. వీటి ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెబుతారు. ఇందులో తిథి ఆదాయాన్ని, వారం ఆయువును, నక్షత్రం పాపప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణలను, కరణం పవిత్ర గంగానదిలో చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని చాలా మంది నమ్ముతారు. వీటితో పాటు కొత్త ఏడాదిలో ఎంతమేరకు వర్షం కురుస్తుంది.. పంట పొలాల పరిస్థితులు, ఏరువాక కార్యక్రమం ఎలా ఉంటుందనే వివరాలతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Mithuna Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ ‘క్రోధి’ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి ఏ రంగాల్లో అదృష్టం కలిసొస్తుందంటే.

పంచాంగంలో ఎన్ని రకాలంటే..

పంచాంగాలో రెండు రకాలుంటాయి. అందులో ఒకటి దృక్. రెండోది వాక్. వీటిలో ఖగోళ వస్తువులకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను నిర్ణయించేటప్పుడు మొదటి దాన్ని అంటే దృక్ పంచాంగాన్ని వాడతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల స్థానాల మార్పులను నిర్ణయించడానికి వాక్ పంచాంగాన్ని ఉపయోగిస్తారు.

పంచాంగ శ్రవణం ఎందుకంటే..

పురాణాల ప్రకారం, పంచాంగ శ్రవణం అంటే కేవలం భవిష్యత్తు గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు.. శ్రీ మహా విష్ణువు అయిన కాల పురుషుడిని గురించి తెలుసుకునేందుకు.. తనను గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. భగవంతుని సమయాన్ని లేదా కాలపురుషుడిని పూజించడం అంటే తనకు నివాళులు అర్పించినట్టే అని భావిస్తారు. ఆధ్యాత్మిక పరంగా, మన కర్మ ఫలాలను బట్టి మనకు ఫలితాలొస్తాయి. సమయాన్ని, కర్మ ఫలితాలను ఇచ్చే దైవానుగ్రహం పొందడానికి పంచాంగ శ్రవణం అనేది మనకు సహాయపడుతుంది. ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి అమల్లోకి రాగా.. తిరిగి మళ్లీ కొత్త ఏడాది ముందు రోజు వరకూ అమల్లో ఉంటుంది.

కర్మఫలాలు..

ప్రతి ఒక్కరి జాతకంలో మన కర్మఫలాల గురించి పూర్తి వివరాలు ఉంటాయి. పూజలు, పరిహారాలు, కర్మయోగం, దోషాల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. ఉగాది రోజున మనం తినే పచ్చడిలో ఆరు రుచులు మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరిస్తాయి.

ఏ సమయంలో పంచాంగ శ్రవణమంటే..

ఉగాది పండుగ రోజున సాయంకాలం సమయంలో దేవాలయాల్లో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వచ్చే ఏడాది వరకు జరిగే విషయాల గురించి తెలుసుకుంటారు. దీన్ని బట్టి కొత్త ఏడాదిలో తాము తీసుకోవాల్సిన నిర్ణయాలు లేదా చేయాల్సిన పనుల గురించి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు.

No comments:

Post a Comment