Tuesday, 30 April 2024

మోడీ కాపీ కొట్టారు: కేసీఆర్ భవిష్యత్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు


 మోడీ కాపీ కొట్టారు: కేసీఆర్ భవిష్యత్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 

By Rajashekhar

 రంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఎం కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చేవెళ్ల లోక్‌సభ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా మంగళవారం రాత్రి బడంగ్‌పేట, బాలాపూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా తట్టుకుని నిలబడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చారని కొనియాడారు. బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని.. ఇక తిరిగి రాదని, తూకానికి వేయాల్సిందేనని రేవంత్ ఎద్దేవా చేశారు. డిసెంబర్‌లో జరిగిన సెమీఫైనల్స్‌లో బీఆర్ఎస్‌ను ఓడించి ఫైనల్స్‌కు వచ్చామని, ఫైనల్స్‌లో బీజేపీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. ఇండియా కూటమిలో కేసీఆర్‌ను చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు పిఠాపురంపై తాజా నివేదిక..మారిపోయిన సీన్..ఆ పార్టీదే లీడ్ కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. 12 ఎంపీ సీట్లు గెలిస్తే నామా నాగేశ్వరరావు కేంద్రమంత్రి అవుతారని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరి చెవిలో పువ్వు పెడతారు? ఇండియా కూటమి నేతలు.. కారును దగ్గరకు కూడా రానీయరని రేవంత్ తేల్చి చెప్పారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిచి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయబోతన్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ జీవితంలో సీఎం పదవి అనేది ఇక లేదు. సబితా ఇంద్రా రెడ్డి ఉదయం కారు గుర్తు అంటున్నారు.. సాయంత్రం కమలం గుర్తు అంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను ప్రధాని మోడీ రద్దు చేస్తే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని రేవంత్ నిలదీశారు. విశ్వేశ్వర్ రెడ్డి రాజ్యసభకు వెళితే మంచిదని హితవు పలికారు. 

             జహీరాబాద్‌లో కేసీఆర్ ప్రసంగాన్ని మోడీ కాపీ కొట్టారు తప్ప.. కొత్తదనం ఏమీ లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనను తిడితే మోడీకి ఏం వస్తుందని ప్రశ్నించారు. తెలంగాణకు మోడీ ఏమిస్తారో ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. మోడీని గద్దె దించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నిష్క్రమించబోరని అన్నారు.

No comments:

Post a Comment