ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ తేదీల్లో మార్పు..
: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఇంతకు ముందు మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మే 27న ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉంది. దీంతో పరీక్ష తేదీల్లో మార్పు చేశారు. అడ్వాన్స్ సప్లమెంటరీలో పరీక్షలు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు ఒకే రోజు నిర్వహించనున్నారు. ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థలకు మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వారికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయిర్ వారికి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు అధికారం దక్కేదెవరికి - సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా..!! సప్లిమెంటరీ, ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 24న ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ లో గతం కంటే ఉత్తీర్ణత శాతం తగ్గింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి జిల్ల తొలి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో మలుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 30 పదో తరగతి ఫలితాలు ప్రకటించనున్నారు.
No comments:
Post a Comment