Tuesday, 30 April 2024

కాంగ్రెస్ కండువా కప్పుకొన్న గుత్తా: తెలంగాణలో అనూహ్య పరిణామం..!!

 కాంగ్రెస్ కండువా కప్పుకొన్న గుత్తా: తెలంగాణలో అనూహ్య పరిణామం..!!




                    : లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. అధికారాన్ని కోల్పోయాక పలువురు సీనియర్లు బీఆర్ఎస్‌ను వీడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం దీనికి మినహాయింపు కాదు. ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడారు. బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు కూతురు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కేశవరావు కూడా కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఆయన ధృవీకరించారు కూడా. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం చేస్తా - హీరోయిన్ బీఆర్ఎస్‌కే చెందిన మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం, కూతురు కడియం కావ్యతో సహా కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ లోక్‌సభ టికెట్‌ను కేటాయించిన తరువాత కూడా ఆమె దాన్ని వదులుకుని మరీ పార్టీని వీడారు. అదే వరంగల్ లోక్‌సభలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న వారిలో మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావు సహా పలువురు నాయకులు ఉన్నారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో- బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఉదయం ఆయన హైదరాబాద్‌లో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

No comments:

Post a Comment