Sunday, 28 April 2024

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు*







 ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు


ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ 2000 సంవత్సరములో తిరుపతిలో ప్రారంభింపబడి ఇంతింతై వటుదింతైనట్టు ఎంతో ఎదుగుతూ ఇవాళ 50 దేశాలలో ప్రబలిపోయి ఉన్నది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎదుగుదలకు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ అధ్యక్షులుగా ఎనలేని సేవలు అందిస్తూ వారి జీవితాన్ని త్యాగం చేయడం జరిగినది. హైదరాబాదులోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ  నాయకులలో ఉత్సాహాన్ని ప్రోత్సహాన్ని నింపడానికి మరియు ప్రస్తుతము జరుగుతున్న గ్లోబల్ కన్వెన్షన్ 2024 గురించి తెలపడానికి ఈరోజు టంగుటూరి రామకృష్ణ  గారు హైదరాబాద్ విచ్చేసినారు.  


వారు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ విభాగము నుండి సేవా కార్యక్రమములో భాగముగా ఈరోజు గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ వద్ద ఒక వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. అన్నార్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈరోజు భోజన కార్యక్రమం ద్వారా మా సేవలను వినియోగించుకున్నారు. ఈనాటి భోజన వసతిని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారులు శ్రీ కౌటికె విఠల్  గారు వారి భుజస్కందాలపై వేసుకొని మొత్తం గా వారే స్పాన్సర్ చేయడం జరిగినది. 


ఈ కార్యక్రమానికి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసిన అన్నార్తులకు స్వయంగా వడ్డించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు శ్రీ రాజశేఖర్ గారు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్ శ్రీ ఊరబాబు రావు గారు, జాతీయ న్యాయ సలహాదారులు అడ్వకేట్ శ్రీ రవి గుప్తా గారు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ  సీనియర్ సిటిజర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సింగిరికొండ నరసింహ గారు మరి ఇతర ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొని సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగినది.

No comments:

Post a Comment