Monday, 22 April 2024

జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పగడాల మోహన్ కృష్ణను సస్పెండ్

 కారేపల్లి : కారేపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పగడాల మోహన్ కృష్ణను సస్పెండ్


చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ తన్నీరు శ్రీకాంత్ రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే సంతలో అవకతవకలు జరుగుతున్నట్లుగా డిప్యూటీ కమిషనర్ కు కొందరు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు డిసి శ్రీకాంత్ రావు ఆదివారం కారేపల్లి సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో డీసీ స్వయంగా పలు అవకతవకలను గుర్తించారు. 60 మేకల లోడుతో సంత నుండి బయటికి వచ్చిన వాహనాన్ని డీసీ స్వయంగా తనిఖీ చేశారు. 20 మేకలకు రుసుం చెల్లించి మిగతా వాటికి చెల్లించకుండా వెళ్తున్న విషయాన్ని గుర్తించారు.

ఆ వ్యాపారితో 4 500 రూపాయలు కట్టించి రసీదు ఇప్పించారు. రుసుము వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణతో పాటు, విచారణకు వచ్చిన అధికారులతో కూడా దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించారనే కారణాలతో జూనియర్ అసిస్టెంట్ పడాల మోహన్ కృష్ణను సస్పెండ్ చేస్తూ డీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను ఈవో శేషయ్య ద్వారా సోమవారం మోహన్ కృష్ణకు స్వయంగా అందజేయడానికి ఉన్నతాధికారులు పంపగా సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకోవడానికి మోహన్ కృష్ణ నిరాకరించారని ఈవో శేషయ్య తెలిపారు. నిరాకరించారు కాబట్టి సస్పెన్షన్ ఉత్తర్వులు రిజిస్టర్ పోస్టు ద్వారా మోహన్ కృష్ణకు పంపుతామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత తెలిపారు.

అధికార పార్టీ నాయకురాలి భర్త కావడంతో చర్చనీయాంశమైంది..

సస్పెన్షన్ కు గురైన పగడాల మోహన్ కృష్ణ భార్య అధికార కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకురాలుగా, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అనుచరురాలిగా ఉండడంతో ఈ సస్పెన్షన్ వ్యవహారం కారేపల్లి మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిన్న చిన్న కారణాలతో మోహన్ కృష్ణను సస్పెండ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఏదైనా దాగి ఉందనే విషయాలు కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాయకురాలు రాష్ట్ర స్థాయి నామినేట్ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో భర్త సస్పెండ్ గురి కావడం, సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా నిరాకరించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

No comments:

Post a Comment