Wednesday, 24 April 2024

రెండు ఎంపీ సీట్లు గెలిచినా పదవికి రాజీనామా: మంత్రి కోమటిరెడ్డి

 

రెండు ఎంపీ సీట్లు గెలిచినా పదవికి రాజీనామా: మంత్రి కోమటిరెడ్డి

– పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా
– మాట నిలబెట్టుకుంటే డొక్కుకారును అమ్మి షెడ్లో కూర్చుంటావా కేసీఆర్ 
–  మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు
– ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మనుగడ  ప్రశ్నార్ధకం 
– కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను పూర్తి చేయిస్తా
– మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి
– ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ విఫలం
– ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ కు  మద్దతు
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి 
– సీపీఐ(ఎం),సీపీఐ మద్దతు కోరిన రఘువీర్ రెడ్డి
– ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.              నల్గొండ :రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రెండు ఎంపీ సీట్లు గెలిచినా  తన మంత్రి పదవికి రాజీనామా చేస్తా. కేసీఆర్ జగన్ తో గుమ్మక్కై ప్రాజెక్టులను ఎండబెట్టిండు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా మాట నిలబెట్టుకుంటే డొక్కు కారును అమ్మి షెడ్డు  లో  కూర్చుంటావా కెసిఆర్ అని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా  బుధవారం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వీటి కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం గడియారం చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..
10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసం కాలేశ్వరం కట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను ఎండ పెట్టాడని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటివారు  నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను కట్టి లెఫ్ట్ కెనాల్ ద్వారా నీరు అందించి ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి తో కుమ్మ కైనా కెసిఆర్ ప్రాజెక్టులను ఎండబెట్టడని మండిపడ్డారు. 10 సంవత్సరాలు  మంత్రిగా  పనిచేసిన పైసా పని చేయని పనికిమాలిన వాని గురించి మాట్లాడానని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. టీ న్యూస్ ఛానల్ లో ఎవరు  చూడాలని, టీవీ9 కి వచ్చి నాలుగు గంటలసేపు కెసిఆర్ మాట్లాడాడని ఎద్దేవ చేశారు. బిడ్డ కడిగిన ముత్యంలా బయటికి వస్తుందంటున్న కేసీఆర్, అసలు ఆడవాళ్లు మద్యాన్ని అమ్ముతారా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం దొంగ దీక్ష చేసిన కేసీఆర్ రాష్ట్రంలో రెండు సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇల్లు అయినా ఇచ్చారని  ప్రశ్నించారు. మూడు నెలల్లో రేవంత్ రెడ్డి 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశారని  పేర్కొన్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, మహిళలకు 2500 రూపాయలను ఇవ్వబోతున్నామని తెలిపారు. సీఎంతో పాటు మంత్రులమంతా టీం గా పనిచేస్తున్నామని, ఆయన ఎవరో చెప్పినట్టు.. ఈయన ఎవరో చెప్పినట్టు  ప్రభుత్వం పడిపోదు అన్నారు. పదేండ్లు  అధికారంలో ఉంటామని, సీఎం రేవంత్ రెడ్డి నే  ఉంటారని అన్నారు. 6 గ్యారంటీలలో 5 అమలు చేశామని మరొకటి కూడా  అమలు చేస్తామని అన్నారు. ఎక్కడ పేదవారు బాధపడ్డ తప్పక పోయి పని చేస్తానని రెండేళ్లలో ప్రతి ఊరును బంగారం లాగా చేస్తామని అన్నారు. ఇక్కడ పోటీ ఎవరూ లేరని, పోటీలో ఉన్నది స్వర్గంలో ఉన్న రావి నారాయణరెడ్డిని అని అన్నారు. గతంలో ఆయన గెలిచినట్లు అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అనంతరం రాష్ట్ర పౌరసరఫరాలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందని అన్నారు. వెంకట్ రెడ్డి కి సీఎం అర్హత ఉందంటూ భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి  కోమటిరెడ్డి కేంద్రం  నుంచి రూ.700 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం, రూ.280 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం, రూ.400 కోట్లతో నల్గొండ మున్సిపాలిటిని       అభివృద్ధి చేస్తున్నాడన్నారు. నల్గొండ లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ దక్కదని ఉత్తమ్ జోస్యం చెప్పారు. మోడీ నాయకత్వంలో ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్దకేమన్నారు. కెసిఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బీసీ, డిండి, బీ వెల్లెంలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తా మని చెప్పారు. 60 వేల ఎకరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల తర్వాత అవసరమైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. మిల్లర్లు తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..
ఇండియా కూటమిలో భాగంగా బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్ కు  ఇక్కడ కూడా మద్దతు ఇస్తున్నాం అన్నారు. దేశంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం లో  బీజేపీ పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలలో మార్పులు చేస్తుందని, ఉపాధి హామీ నిధులను తగ్గించిందని ఆరోపించారు ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని స్వయంగా ఒక మతాన్ని బలపరుస్తూ మరొక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విధానాలన్నింటిపై ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నామినేషన్ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి సీపీఐ(ఎం), సీపీఐ మద్దతును కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు  బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి సలీం, దండం పెళ్లి సత్తయ్య, తుమ్మల పద్మ, నెమ్మది వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, సీపీఐ(ఎం) నాయకురాలు మల్లు లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment