Monday, 15 April 2024

బీజేపీ మేనిఫెస్టో

 బీజేపీ మేనిఫెస్టో


లోని ముఖ్యాంశాలు


*వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్, నీరు, గ్యాస్ కనెక్షన్, జీరో విద్యుత్ బిల్లు అందించడం

*ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకూ ఉచిత చికిత్సలు.. వీటిని భవిష్యత్‌లోనూ కొనసాగింపు

*జన ఔషధి కేంద్రాల్లో 80 శాతం రాయితీకి ఔషధాలు

*మధ్య తరగతి కుటుంబాలకు 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం

*ముద్ర పథకం కింద రూ. 20 లక్షల వరకు రుణాలు

*జాతీయ విద్యా విధానం అమలు

*ప్రశ్నపత్రాల లీక్‌పై కొత్త చట్టం

*2036లో ఒలింపిక్స్ నిర్వహణ

*దివ్యాంగులకు పీఎం ఆవాస్ యోజనలో ప్రాధాన్యం

*యువత కోసం మౌలిక సదుపాయాల కల్పన, వస్తు తయారీ, అంకుర పరిశ్రమల ఏర్పాటు, స్పోర్ట్స్, పెట్టుబడులు, ఇతర సేవలు, పర్యటకం కింద లక్షల ఉద్యోగాల కల్పన

*ఇప్పటికే కోటి మంది అక్కాచెల్లెళ్లు లక్షాధికారులు అయ్యారు. మరో మూడు కోట్ల మందిని కూడా లక్షాధికారులను చేయాలని లక్ష్యం

*నారీ వందన చట్టం అమలు

*విత్తనాల కొనుగోలు నుంచి మార్కెట్ వరకు రైతుల ఆదాయం పెంచడానికి కృషి. నానో యూరియా, ప్రకృతి వ్యవసాయంతో నేలకు రక్షణ. శ్రీఅన్న సాగుకు ప్రోత్సాహం

*మత్స్యకారుల జీవితాలకు సంబంధించిన పడవలకు ఇన్సూరెన్స్, చేపల ప్రాసెసింగ్, సత్వర సమాచార బదిలీ లాంటి అన్ని సేవల బలోపేతం

సముద్రపు నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులకు ప్రోత్సాహం

*గిగ్ వర్కర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఇంటి పనిచేసేవారు, కూలీలు, ట్రక్కు డ్రైవర్లు అందరినీ ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా అనుసంధానించి సంక్షేమ పథకాలు అమలు

*భారత సంస్కృతిని తిరువళ్లూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ప్రపంచ దేశాలకు పరిచయం, వ్యాప్తి

*ఉన్నత విద్యా సంస్థల్లో భారత భాషల అధ్యయనాలకు ప్రోత్సాహం

*2025ను గిరిజన గర్వ ఏడాది (ట్రైబల్ ప్రైడ్ ఇయర్)గా ప్రకటన

*ఏకలవ్య పాఠశాలలు, పీఎం జన్‌మన్ లాంటి పథకాలను ప్రోత్సహించడంతోపాటు ఏకో టూరిజం, అటవీ ఉత్పత్తులకు ప్రాధాన్యం

*ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్ని విధానాల గౌరవం కల్పించేలా చర్యలు

*ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆయుష్మాన్ భారత్ వర్తింపు

No comments:

Post a Comment