కొందరు పెద్దలు వివిధ రకాల భ్రమలతో ఈ మహాపురుషుని నిర్లక్ష్యం చేస్తుంటారు. గడచిన 1200 సం||ల నుండి ఒక దురాక్రమణ జాతికి, ఈ భూమి సంతానమైన హిందువులకు మధ్య జరిగిన నిరంతర పోరాటాన్ని మరచిపోయాం. ఆ కారణంగా జాతి వ్యతిరేక శక్తులను కౌగలించుకోవడానికి వారు విఫలయత్నం చేస్తున్నారు. శివాజీ జయంతి ఉత్సవాలను తిలక్ ప్రారంభించారు. తిలక్ తర్వాత జాతీయ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాయకులు బుద్ధి పూర్వకంగానే ప్రజలు శివాజీని మరచిపోయేట్లు చేసారు. అయినప్పటికీ ఆ మహానుభావుడి ప్రభావం ప్రజల గుండెల్లో నుండి రవ్వంత కూడా తొలగలేదు. సామ్యవాదుల్లోని కొందరు విద్వాంసులు శివాజీ గురించి వారి పత్రికల్లో వ్యాసాలు వ్రాస్తూ అతనిని ధర్మస్థాపకుడిగా కాకుండా సామ్యవాదియైన విప్లవ కారుడిగా ఆవిష్కరించే ప్రయత్నాలు చేసారు. శివాజీ రైతులను ఐక్యపరచాడనేది వాస్తవం. అయితే 19వ శతాబ్దపు కార్ల్‌మార్ట్క్ పుస్తకం చదివి 17వ శతాబ్దపు శివాజీ వర్గపోరాటం కల్పనతో సామ్యవాద పోరాటం చేసారని సూచించడం హాస్యాస్పదం. శివాజీకి సంబంధించిన ఏ విషయం రహస్యం కాదు. కాబట్టి ఈ గొప్ప వ్యక్తి ప్రఖర తేజస్సును తగ్గించ డానికి ఈ విధమైన భ్రమలు కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు.
మూర్ఖుడెవరైనా కళ్లుమూసుకొని సూర్యుడు లేేడని అన్నప్పటికీ కాళ్లక్రింద వేడెక్కినప్పుడు సూర్యుడున్నట్లు గ్రహిస్తారు. అలాగే శివాజీ తేజస్సును మరిపింపచేసే ప్రయత్నం ఎవరు చేసినా సాగదు. చరిత్రలో ఆయన స్థానాన్ని ప్రతి తరానికి తెలియచేయడానికి ఒక గొప్ప స్ఫూర్తి ఇప్పటికీ మిగిలి ఉంది. అందువలన శివాజీని పదవీ భ్రష్టుడైన నేత అని, మొగల్ సామ్రాజ్యానికి బద్ధ్ద వ్యతిరేకియని, ఒక మతానికి శత్రువు అని ఆరోపించే వారు కూడా సర్వత్రా అంధకారమే అలుముకున్నప్పుడు శివాజీ గాథను స్మరించుకోకపోతే దేశాభివృద్ధి అసంభవం అనక తప్పదు. సుమారు 350 ఏళ్ల తర్వాత కూడా భ్రమలతో కూడిన నేటి తరాన్ని కొరడా ఝళిపించి, పెను నిద్దుర వదిలించి అప్రమత్తం గావించే శక్తి శివాజీ చరిత్రకు ఉంది.
శివాజీ మీద దొంగ సెక్యులరిస్టులు కల్పిస్తున్న భ్రమలు క్రమంగా తొలగుతున్నాయి. దేశ నాయకులు అప్రమత్తం కావడం ప్రారంభమైంది. ప్రతి సంకట సమయంలో, ప్రతి పరీక్షా సమయంలో ఒక మార్గదర్శకుడు అవసరం. శివాజీ అలాంటి మార్గదర్శకుడు. ప్రజాజీవనంలో పనిచేసే వివిధ వ్యక్తులకు ఆయనొక కరదీపిక. తన కాలం నాటి పరిస్థితుల పట్ల అవగాహన చేసుకోవడంలో, వాటిని తట్టుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, అమలు చేయడంలో శివాజీ విలక్షణంగా వ్యవహరించారు. వ్యక్తిగత ఇష్టాలకతీతంగా నిర్ణయాలుండేవి. ఒకానొక దశలో ఆయన వద్ద 300 కోటులుండేవి. కాని ఒక్కకోటకు కూడా ఆయన బంధువులను అధిపతిగా నియమించ లేదు. ఇది నేటి పరిస్థితులలో వింతగానే ఉంటుంది.
*_శివాజీని స్మరిద్దాం_*
ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా అని పిలిపించుకొనే మొగలు సింహాసనానికి ప్రతి ద్వంద్విగా హిందూ సామ్రాజ్య సింహాసనాన్ని 1674 సం|| జ్యేష్ఠ త్రయోదశి రోజున శివాజీ అధిష్టించాడు. దేశ వర్తమాన నిరాశామయ పరిస్థితులలో శివాజీ ఒక దీపస్తంభంలాగా నిలబడ్డారు. ఈ వెలుగులోనే ప్రతి భారతీయ తరం దారి వెతుక్కోవాలి. ఆ మహనీయుని మరల మరల స్మరించాలి. అంతేకాని ఆయనను మనిషి స్థాయికి మించి భగవంతునిగా స్మరించరాదు. మనసులోనే శివాజీ మహారాజుతో మీలాంటి గుణాలను మాలో కూడ కలిగించమని మనం అడగాలి. మీరు చూపిన ఆదర్శాన్ని మా ముందు ఉంచుకొని భయంకరమైన పరిస్థితులను ఓడించి మేము విజయం పొందుతాం. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడ శత్రువు మనపై ఆక్రమణ చేస్తే- ఆ శత్రువును ఓడించే అభేద్యమైన కవచాన్ని ఈ దేశంలో నిర్మిద్దాం. ఇది మన నిశ్చయం.
శివాజీ జీవితమంతా ఇక్కట్లతో, గెలుపోట ములతో నిండి ఉంటుంది. కానీ రాజ్యాభిషేకం మాత్రం పెద్ద ఎత్తున జరిగినది. ఎందుకు? భారతదేశంలో దురాక్రమణ చేసి రాజ్యాన్ని స్థాపించిన విదేశీయులు హిందువులను చులనకనగా చూశారు. అలాంటి దురహంకారులకు హిందువులు సవాలు విసిరి రాజ్యస్థాపన చేయగలుగుతారని చాటి చెప్పడమే శివాజీ రాజ్యాభిషేకం వెనుక ఉద్దేశం. స్వదేశీ, విదేశీ పాలకులు కూడ హిందూ సామ్రాట్టు ముందు తలవంచవలసి ఉంటుందని శివాజీ రాజ్యాభిషేకం నిరూపించింది. శివాజీ నిర్మించిన సామ్రాజ్యం పరపీడన మీద యుద్ధం ప్రకటించింది. తుదివరకు పోరాడింది. హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసం పెల్లుబికింది. ఈ నేపథ్యంలో ఆర్.ఎస్.ఎస్. సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ శివాజీ పట్టాభిషేక ఉత్సవాన్ని సామాజిక ఉత్సవంగా జరిపే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ మాద్యమంలో శివాజీ పాటించిన సత్యనిష్టను, త్యాగనిరతని కూడా మనం అలవాటు చేసుకోవాలి.
➖🔸*జై భవానీ... జై శివాజీ…*🔸➖
🚩 *ॐ_హర్ హర్ మహాదేవ్_卐* 🚩
*_"ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు"_*
*_బ్ర.శ్రీ. నారాయణభట్ల చైతన్య శర్మ గారి సౌజన్యంతో_*
No comments:
Post a Comment