ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం..
కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై ఇంకా వీడని సస్పెన్స్
ఖమ్మం రేసు నుంచి వైదొలగిన భట్టి నందిని!: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఆదివారమే పార్టీలో చేరిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను వరంగల్ అభ్యర్థిగా నిర్ణయించింది. సోమవారం జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమె పేరును ఖరారు చేశారు. మొత్తం నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. కేవలం వరంగల్‌కు మాత్రమే ఖరారు చేసి మరో 3 స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. కడియం కావ్య తొలుత వరంగల్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపిక కాగా, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఆ పార్టీకి ప్రతికూలంగా మారడంతో పోటీ నుంచి విరమించుకుని తండ్రితోపాటు కాంగ్రె్‌సలో చేరారు. కాగా.. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం నుంచి రెడ్డి వర్గానికి చెందిన నేతను ఎంపిక చేస్తే.. కరీంనగర్ నుంచి బీసీ వర్గానికి చెందిన నేతను బరిలోకి దించే అవకాశాలున్నాయి. అయితే కరీంనగర్ నుంచి ఇప్పటివరకూ చర్చకు వచ్చిన బీసీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నేతల పేర్లను సీఈసీ భేటీలో నేతలు తిరస్కరించిన ట్లు సమాచారం. దీంతో ఆ స్థానానికి బీసీ అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పజెప్పాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరీంనగర్‌కు బీసీ అభ్యర్థి ఖరారైతే.. ఖమ్మం నుంచి రెడ్డి సామాజికవర్గం నేతను అభ్యర్థిగా ఖరారు చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఖమ్మం రేసు నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తన భార్య నందిని పేరును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ఈ రీత్యా ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డినే ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment