Wednesday, 17 April 2024

ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. మార్కుల మెమో విడుదల! డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

 


ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. మార్కుల మెమో విడుదల! డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఇటీవల ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచింది. విద్యార్ధులు నేరుగా ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌..

            అమరావతి, : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఇటీవల ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచింది. విద్యార్ధులు నేరుగా ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని మార్కుల జాబితా పొందొచ్చు. కాగా ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 67 శాతం, ఇంటర్ ద్వితీయ సంత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది.

        ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2024 మార్కుల షీట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రేపట్నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపులు

ఇంటర్మీడియట్‌పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లింపులు ఏప్రిల్‌ 18 నుంచి ప్రారంభం అవుతాయి. ఫీజు చెల్లింపులకు ఏప్రిల్ 24వ తేదీని చివరి తేదీ. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం కూడా ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్‌ జవాబు పత్రం రీ వెరిఫికేషన్‌కు రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్ రీకౌంటింగ్‌కు రూ.260 చొప్పున చెల్లించాలి. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పేపర్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రూ.550 చెల్లించాలి. ఇక ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment