Saturday, 30 March 2024

పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిఎస్ఓ

         


నల్గొండ  : జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ రోడ్డు, కంచన పల్లి, గుండ్లపల్లి లో  పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్ఓ మాట్లాడుతూ  జిల్లా వ్యాప్తంగా  370 ధాన్యం  కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సెంటర్ వద్ద త్రాగునీటి  వసతులు,  సరైన నీడ సౌకర్యము కల్పించాలని సెంటర్ ఇన్చార్జీలకు సూచించారు.

 కొనుగోలు చేసిన వరి ధాన్యం బస్తాల పైన తార్పాల్ తో జాగ్రత్త తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చీకటి సమయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Thursday, 28 March 2024

బీఆర్ఎస్ కు షాకిచ్చిన కడియం కావ్య

 

నేను పోటీ చేయలేనంటూ బీఆర్ఎస్ కు షాకిచ్చిన కడియం కావ్య

హైదరాబాద్​ : మాజీ సీఎం, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ కు ఆ పార్టీ వరంగల్​ఎంపీ అభ్యర్థి కడియం కావ్య షాకిచ్చారు. తాను ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె కేసీఆర్ కు లేఖ రాశారు. ఇటీవల బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓటు అడగాలో అర్థం కావడం లేదని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. అలాగే జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకోవడమే మేలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. తన నిర్ణయానికి అసంతృప్తి చెందితే కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని విజ్ఞప్తి చేశారు.

రైస్ మిల్లులు తనిఖీ- హార్షం వ్యక్తం

 రైస్ మిల్లులు తనిఖీ- హార్షం వ్యక్తం


జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన

వేములపల్ల. ,:నల్గొండ జిల్లాలోని ఆసియా ఖండంలోనే అతి ఎక్కువగా ఉన్నటువంటి రైస్ మిల్లులను నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర గురువారం తనిఖీ నిర్వహించారు. అట్టి తనిఖీలో భాగంగా నూతనంగా నిర్మించినటువంటి కొత్త టెక్నాలజీతో ఉన్న రైస్ మిల్లులను పద్మశ్రీ, వసంత రైస్ ఇండస్ట్రీస్ రెండు మిల్లులను ఎంచుకోవడం జరిగింది. అట్టి మిల్లులో నూతన టెక్నాలజీతో నిర్మించినటువంటి మిల్లులను చూసి ఆమె హర్షం వ్యక్తం చేశారు. అట్టి మిల్లులకు సంబంధించినటువంటి వసంతా రైస్ ఇండస్ట్రీస్ ఎండి అయిన గంట సంతోష్ రెడ్డి మిల్లులో వివరాలను పూర్తి సమాచారాన్ని సంతోష్ రెడ్డి కలెక్టర్కు వివరించడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితులలో మీరు కొనుగోలు చేయవద్దని ఆమె మిల్లు యాజమాన్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె వెంట మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, పద్మశ్రీ రైస్ మిల్ యజమాని మురళి, వేములపల్లి తాసిల్దార్ శ్రీనివాస్ శర్మ, సివిల్ సప్లై అధికారి వాజిద్ తదితరులు పాల్గొన్నారు

ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ చర్యలు...*

 

*జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ చర్యలు...*


ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు...

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఓ పార్టీ కార్యక్రమాంలో పాల్గొన్న ఏసీపీ...

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్న ఈసీ..

ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ

 

ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ

మోత్కూరు పొడిచేడు గ్రామ పంచాయతీ కార్యదర్శి చిన్నం కిరణ్ రూ. 3000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు

ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? వైద్యులు చెబుతున్నదిదే


 ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? వైద్యులు చెబుతున్నదిదే..

              ఆయా ప్రాంతాల్లోని  వాతావరణాన్ని అనుసరించి ఆయా నూనెలు వాడటం జరుగుతుంది. మార్కెట్లో  సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, ఆలివ్ ఆయిల్ వంటి రకరకాల ఆయిల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల రుచి కూడా నూనెపైనే ఆధారపడి ఉంటుంది. కొవ్వు గురించి భయపడి చాలామంది ఆహరంలో తక్కువ నూనె వాడకానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. నలభై ఏళ్లు దాటినవారు ఆయిల్‌ ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటారు. ఇంతకీ ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? రిఫైన్డ్‌ ఆయిల్స్‌ కంటే గానుగ నూనె బెటరా అంటే..

గానుగ నూనె చాలా పురాతన నూనె. ఎద్దులను ఉపయోగించి గానుగపట్టి నూనె గింజల నుంచి నూనె తీసే విధానం శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. కొన్నిదేశాల్లో గుర్రాలు, ఒంటెలను కూడా అందుకోసం ఉపయోగిస్తారు.గానుగలో తిప్పడం ద్వారా లభించే నూనెను 'కోల్డ్ ప్రెస్డ్' ఆయిల్ అంటారు. అంటే ఇక్కడ.. గానుగపట్టే సమయంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది.

నూనె గింజలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద గానుగలో తిప్పడం వల్ల ఆ నూనెలో సహజ విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వాటి అసలు రూపంలో ఉంటాయి. ఇవి నూనెను మరింత రుచికరంగా ఉంచుతాయి. ఆ కారణంగానే గానుగ నూనె శరీరానికి మేలు చేస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. కానీ, ఈ నూనె తయారీకి ఖర్చు ఎక్కువ. ఎందుకంటే, విత్తనాల నుంచి 30 - 40 శాతం నూనె మాత్రమే వస్తుంది, అందువల్ల వ్యర్థాలు ఎక్కువ.

అయితే, ఎక్స్‌పెల్లర్ ప్రెస్డ్ ఆయిల్ మెషీన్ ద్వారా 80 నుంచి 90 శాతం నూనెను తీయవచ్చు. కానీ, మెషీన్ ద్వారా ఆయిల్ తీసే ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థాయిలు 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల నూనె సహజ స్వభావం మారుతుంది. ఆ తర్వాత వంట నూనె రిఫైనింగ్ (శుద్ధి) ప్రక్రియ జరుగుతుంది. మెత్తగా నూరిన విత్తనాల చూర్ణానికి హెక్సేన్ అనే రసాయనాన్ని కలుపుతారు. విత్తనాల నుంచి 100 శాతం నూనెను తీసేందుకు ఈ హెక్సేన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాతి దశలో నూనెతో కలిపిన హెక్సేన్‌ను వేరుచేస్తారు.

అలా వచ్చిన నూనెను వివిధ రసాయనిక పద్ధతుల్లో రిఫైన్ చేస్తారు. చివరగా, నీళ్లలా శుద్ధంగా కనిపించే రుచీపచీ లేని నూనె వస్తుంది.గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్న సన్‌ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్ హెక్సేన్ ఉపయోగించి రిఫైన్ చేసే నూనెలే.

ఏది బెటర్‌ అంటే..
చివరిగా అన్ని రకాల నూనెల్లోనూ మంచి కొవ్వులు ఉంటాయి. అవి శరీరానికి అవసరం కూడా. అయితే మనం ఎంత నూనె తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. గుండె జబ్బులు, ఊబకాయం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలుంటే నూనె తీసుకోవాల్సిన పరిమాణంలో మార్పులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యితో పాటు ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకోవచ్చు.

వేయించడానికి రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనెను వాడొచ్చు. కొబ్బరినూనె, పామాయిల్ వంటి వాటిని కొద్దిమొత్తంలో తీసుకోవచ్చు. అందువల్ల ఒకటే నూనె కాకుండా, అన్ని నూనెలను నిర్దిష్ట మొత్తంలో తీసుకోవడం మంచిది. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తికి రోజుకు 15 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. అంటే.. నెలకు సుమారు  450 నుంచి 500 మిల్లీలీటర్లు చాలు అని చెబుతున్నారు వైద్యులు. 

ఏసీబీ వలలో ఆర్

కార్వేటినగరం తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఏసీబీ వలలో ఆర్‌ఐ
పట్టుబడిన ఆర్‌ఐ
కార్వేటినగరం,: కార్వేటినగరం తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ రైతు నుంచి రూ.12 వేలు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పాస్‌బుక్‌ మార్పిడి కోసం రైతును తిప్పించుకుంటున్న ఆయన.. డబ్బు డిమాండు చేశారు. దీనిపై ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం కార్వేటినగరంలోని జాతీయ రహదారిలో టీ షాపు వద్ద ఆర్‌ఐ టీ తాగుతున్నారు. ఆ రైతు నుంచి వసూలు చేసిన రూ.12 వేల నగదును ఆయన తన ద్విచక్ర వాహనంలోని పెట్రోల్‌ ట్యాంకు వద్ద ఉంచారు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఆ మొత్తాన్ని చేసుకున్నారు.

వైరాలో రిజిస్ట్రేషన్లపై వరంగల్ డీఐజీ సీరియస్

 

వైరాలో రిజిస్ట్రేషన్లపై వరంగల్ డీఐజీ సీరియస్

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అడ్డగోలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలపై స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ వరంగల్ డీఐజీ సుభాషిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.                                             

 వైరా : వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అడ్డగోలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలపై స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ వరంగల్ డీఐజీ సుభాషిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరాలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్ ను సుభాషిని ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్ బుధవారం వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొని గత నాలుగు నెలల నుంచి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఆక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ నిర్వహించారు. ముఖ్యంగా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏన్కూరు మండలంలో 1/70 అమలులో ఉన్న నేపథ్యంలో

    ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కుటుంబసభ్యుల పేర్లతో పార్టేషన్ పేరిట రిజిస్టేషన్లు చేస్తున్న బాగోతంపై అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రైవేట్ బ్యాంకులకు చెందిన పలువురు ఏజెంట్లు దళారుల అవతారమెత్తి ఇక్కడ కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో భారీగా ముడుపులు దండుకుంటూ పార్టేషన్ పేరిట 200కుగాపై అక్రమ రిజిస్ట్రేషన్లు చేయటాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే వైరా, కొణిజర్ల మండలాల్లో లేఅవుట్ లేని స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల పేరిట కూడా నిబంధనలకు తూట్లు పొడిచారనే విమర్శలున్నాయి. అలాగే ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ కరుణను జిల్లా రిజిస్ట్రార్ ప్రశ్నించి రికార్డులను పరిశీలించారు. ఇక్కడ జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నిటిపై జిల్లా రిజిస్ట్రార్ సమగ్రమైన విచారణ నిర్వహించనున్నారు. 

Wednesday, 27 March 2024

ఏసీబీ వలలో తాసిల్దార్

 నారాయణపేట జిల్లా గుండుమల్‌ తహసీల్దార్‌ పాండు బుధవారం లంచం తీసుకుంటూ ఎసీబీకి చిక్కాడు. మండలంలోని బోగారం గ్రామానికి చెందిన మల్లేష్‌ తన భూమిని వేరొకరికి అమ్మగా.. భూ రిజిస్ర్టేషన్‌ కోసం ఈ నెల 21న స్లాట్‌ బుక్‌ చేసుకొని, 22న తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. భూమి రిజిస్ర్టేషన్‌ చేయాలంటే రూ.1,500 లంచం ఇవ్వాలని తహసీల్దార్‌ డిమాండ్‌ చేశాడు.                   


రూ.2 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడిన గుండుమల్‌ అధికారి

రికార్డ్‌ అసిస్టెంట్‌, ధరణి ఆపరేటర్‌ కూడా అదుపులోకి..

కోస్గి రూరల్‌, మార్చి 27: నారాయణపేట జిల్లా గుండుమల్‌ తహసీల్దార్‌ పాండు బుధవారం లంచం తీసుకుంటూ ఎసీబీకి చిక్కాడు. మండలంలోని బోగారం గ్రామానికి చెందిన మల్లేష్‌ తన భూమిని వేరొకరికి అమ్మగా.. భూ రిజిస్ర్టేషన్‌ కోసం ఈ నెల 21న స్లాట్‌ బుక్‌ చేసుకొని, 22న తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. భూమి రిజిస్ర్టేషన్‌ చేయాలంటే రూ.1,500 లంచం ఇవ్వాలని తహసీల్దార్‌ డిమాండ్‌ చేశాడు. తన దగ్గర డబ్బులు లేవని మల్లేష్‌ చెప్పడంతో నీ భూమి కోసం రెండు గంటలు ఎక్కువగా పని చేశానని, కచ్చితంగా ఇవ్వాలని అన్నాడు. దాంతో ధరణి ఆపరేటర్‌ రవీందర్‌కు ఫోన్‌పే ద్వారా మల్లేష్‌ వెయ్యి రూపాయలు పంపించాడు. తరువాత మరుసటి రోజు మరో భూమి రిజిస్ర్టేషన్‌ కోసం డాక్యుమెంట్‌ తీసుకొని మల్లేష్‌ తహసీల్దార్‌ ఆఫీ్‌సకు వచ్చాడు. దాంతో తహసీల్దార్‌ పాండు.. ఈశ్వర్‌గౌడ్‌కు 20 గుంటల భూమి అమ్ముతున్న డాక్యుమెంట్‌ అయితే నిన్ననే మాకు డబ్బులు తక్కువ ఇచ్చావని, ఒక్కో డాక్యుమెంట్‌కు 1,500 చొప్పున రెండింటికి మూడువేలు అవుతాయని చెప్పాడు. నిన్న వెయ్యి ఇచ్చావని, ఇంకో రూ.2,000 ఇవ్వకపోతే నీకు భవిష్యత్‌లో ఇబ్బంది అవుతుందని అన్నాడు. దాంతో మల్లేష్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు మల్లే్‌షకు బుధవారం రూ.2,000 ఇచ్చి పంపించారు. మల్లేష్‌ తహసీల్దార్‌ను సా యంత్రం కలువగా.. రికార్డ్‌ అసిస్టెంట్‌ మొగులప్పను పిలిచి డబ్బులు తీసుకోవాలని చెప్పాడు. అతను ఓ పాత పహాణి రికార్డు తీసుకొని అందులో డబ్బులు పెట్టాలని చెప్పాడు. రికార్డు అసిస్టెంట్‌ ఆ రికార్డు తీసుకెళ్లి తహసీల్దార్‌కు ఇచ్చాడు. వెంటనే మల్లేష్‌ బయటకు వచ్చి ఏసీబీ అధికారులకు చెప్పడంతో వారు వచ్చి తహసీల్దార్‌ను పట్టుకున్నారు. రూ.2,000 తీసుకొని తహసీల్దార్‌తోపాటు రికార్డ్‌ అసిస్టెంట్‌, ధరణి ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు చెప్పారు.

వేలంలో రూ. 40 కోట్లు ప‌లికిన నెల్లూరు ఆవు.. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌!

 *వేలంలో రూ. 40 కోట్లు ప‌లికిన నెల్లూరు ఆవు.. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌!


*


*భార‌త‌దేశానికి చెందిన ఈ మేలుర‌క‌పు జాతి ఆవు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా మారింది. వ‌యాటినా-19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలవ‌బ‌డే నెల్లూరు జాతికి చెందిన ఆవు ఏకంగా 4.8 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లకు (సుమారు రూ. 40 కోట్లు) అమ్ముడుపోయింది. ఇక ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మేలుర‌క‌పు ఆవులను 1868లోనే బ్రెజిల్‌కు త‌ర‌లించ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ ర‌క‌పు జాతి ఆవులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందాయి*


*ఇక ఈ జాతికి చెందిన ఆవులు ఒక్క బ్రెజిల్ దేశంలోనే 16 మిలియ‌న్ల వ‌ర‌కు ఉన్న‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి. తెలుపు రంగులో ఉండి, చూడ‌టానికి బ‌లిష్టంగా క‌నిపించే ఈ మేలుర‌క‌పు ఆవులు వేడి ప్ర‌దేశాల‌లోనూ ఇమిడిపోగ‌ల‌వు. అంతేగాక వీటిలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి కూడా అధికంగానే ఉంటుం.

Tuesday, 26 March 2024

ఈనెల 30న నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం* *డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్*

నల్లగొండ: నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం ఈనెల 30న ఉదయం 11 గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుం.   


దని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు.

మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 28న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో సీఈసీ సమావేశానికి వెళ్లాల్సి ఉండడంతో సమావేశాన్ని 30కి వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ సిఇసి సభ్యుడైనందున ఈ సమావేశానికి వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.

30న రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ,నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం యధావిధిగా జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు పాల్గొంటారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.


ఈ సమావేశానికి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, ఏఐసీసీ, మెంబర్లు, డిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు, సభ్యులు, జిల్లా, బ్లాక్, మండల గ్రామ, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శిలు , జెడ్పిటిసిలు, ఎంపీపీలు,పిఎసిఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,తాజా మాజీ సర్పంచ్లంతా హాజరుకావాలని కోరారు.


ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కత్తుల కోటి, మాజీ కౌన్సిలర్లు మందడి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ ఇంతియాజ్ అలీ, నాయకులు జూలకంటి సైదిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా రాకేష్, గోలి రవి, పెరిక చిట్టి తదితరులు పాల్గొన్నారు.

Monday, 25 March 2024

బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థుల జాబితా!

 బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థుల జాబితా!



1)ఖమ్మం -                నామా నాగేశ్వర్ రావు(ఓసీ)

2) మహబూబాబాద్ (ఎస్టీ  )మాలోత్ కవిత

3) కరీంనగర్ -           బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)

4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్ 

5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)

6)చేవెళ్ల -                   కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)

7)వరంగల్ (ఎస్ .సి  )-డాక్టర్ కడియం కావ్య 

8 )నిజామాబాద్ -     బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)

9 )జహీరాబాద్ -      గాలి అనిల్ కుమార్ (బీసీ)

10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) - ఆత్రం సక్కు ( ఆదివాసీ)

11 )మల్కాజ్ గిరి - రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)

12)మెదక్ -            పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)

13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .

14) సికింద్రాబాద్ -  తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)

15) భువనగిరి -      క్యామ మల్లేశ్ (బీసీ)

16) నల్గొండ -         కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)

17) హైదరాబాద్ -   గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)

            ……. …….

Sunday, 24 March 2024

హోలీ రంగులతో క్యాన్సర్.. కంటి సమస్యలు గ్యారంటీ

 హోలీ రంగులతో క్యాన్సర్.. కంటి సమస్యలు గ్యారంటీ

: హోలీ పండుగ తర్వాత చాలా మంది చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతారు. దీనంతటికీ కారణం ఆ రంగుల్లో ఉండే రసాయనాలే.

తండాయి 


హోలీ పండుగ అందమైన పండుగ. కానీ ఈ వేడుకల్లో ఉపయోగించే రంగులతో అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఎన్‌సిబిఐ నివేదిక ప్రకారం, ఈ రోజుల్లో లెడ్ ఆక్సైడ్, క్రోమియం అయోడైడ్, కాపర్ సల్ఫేట్, మెర్క్యూరీ సల్ఫైట్, అల్యూమినియం బ్రోమైడ్ వంటి హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనాలు చర్మ సమస్యలు, కంటి లోపాలు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.



హోలీ రంగులతో సమస్యలు

హోలీ రంగులలో ఉపయోగించే సీసం, క్రోమియం వంటి కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలు. ఈ రంగులకు ఎక్కువసేపు గురికావడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ రసాయన రంగులు చర్మం చికాకు, ఎరుపు, దురద కలిగించవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ.


హోలీ వేడుకల సమయంలో రసాయన రంగుల సూక్ష్మ కణాలు గాలిలో కలిసిపోతాయి. ఇది దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఆస్తమా వంటి వ్యాధులు పెరుగుతాయి.


రసాయన రంగులు కళ్లలోకి రాగానే కంటి చికాకు, ఎరుపు, నీరు కారడం, తాత్కాలిక అంధత్వాన్ని కలిగిస్తాయి. కళ్లలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.



అనేక రసాయన పెయింట్లలో సీసం, పాదరసం, క్రోమియం, అమ్మోనియా వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మం ద్వారా గ్రహించబడతాయి. తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి.


హార్మోన్ల మార్పుల కారణంగా గర్భిణీ స్త్రీలలో కంటి చికాకు సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే గర్భం వారి కళ్ళను మరింత సున్నితంగా చేస్తుంది. రంగులతో సమస్య ఎక్కువ అవుతుంది.


జుట్టును ఇలా కాపాడుకోండి

ఈ రంగులు జుట్టుకు కూడా హానీ కలిగిస్తాయి. అందుకే ముందుగా కొబ్బరి లేదా ఆలివ్ నూనె రాయండి. ఈ నూనె జుట్టుకు రక్షణ పొరలా పనిచేస్తుంది.


హోలీ ఆడిన వెంటనే మీ తలపై షాంపూ పెట్టుకోవడం మానుకోండి. బదులుగా గుడ్డు పచ్చసొన లేదా పెరుగును జుట్టుకు అప్లై చేయాలి. షాంపూ చేయడానికి ముందు కనీసం 45 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల జుట్టులోని హోలీ రంగు తొలగిపోయి నష్టం తగ్గుతుంది.


రంగుల పొడులతో హోలీ ఆడే ముందు ఆవాల నూనెను తలకు పట్టించి కాసేపు మసాజ్ చేయాలి. హోలీ ఆడిన తర్వాత తలకు షాంపూ రాసుకోవాలి. ఆ తర్వాత తలను బాగా ఆరబెట్టి మళ్లీ ఆవాల నూనె రాసుకుని గంటసేపు నానబెట్టాలి. ఇది తల నుండి మిగిలిన హోలీ రంగులను తొలగించి, నష్టాన్ని నివారిస్తుంది.



కొబ్బరి పాలు జుట్టుకు హానిని తగ్గించడంలో సహాయపడే అద్భుతమైన పదార్థం. కొబ్బరి పాలు జుట్టు నుండి హోలీ రంగును తొలగించడంలో సహాయపడతాయి. కొబ్బరి పాలను మీ తలకు పట్టించి, గంటసేపు నాననివ్వండి. తర్వాత షాంపూతో కడగాలి.


పెరుగులో మెంతిపొడి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత జుట్టుకు పట్టించి బాగా నానబెట్టాలి. తర్వాత జుట్టును బాగా కడగాలి. ఇది హోలీ రంగుల వల్ల జుట్టు పాడవకుండా చేస్తుంది. జుట్టుకు మంచి పోషణ కూడా లభిస్తుంది.

కిలో నూనె రూ.30కే.. వాళ్లకు మాత్రమే!

 కిలో నూనె రూ.30కే.. వాళ్లకు మాత్రమే!

                                :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులపాలిట కల్పతరువు ఇప్ప చెట్టు. ఇప్పచెట్టుతో ఆదివాసి గిరిజనులకు విడదీయలేని సంబంధం ఉంది. ఎంతో పవిత్రంగా భావించే ఈ చెట్టుకు గిరిజనులు వివిధ సందర్భాల్లో పూజలు కూడా చేస్తారు. ఇదే ఇప్పచెట్టు వేసవిలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులకు ఉపాధిని కూడా ఇస్తుంది. వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో విరివిగా లభించే ఇప్పపువ్వును సేకరించి గిరిజనులు ఉపాధిని పొందుతారు. మరోవైపు ఎన్నోపోషక గుణాలు కలిగి ఉన్న ఈ ఇప్పపువ్వుతో గిరిజనులు వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేసుకుంటారు. ఇందులో ఇప్ప లడ్డూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రక్త హీనత వంటి సమస్యలకు చక్కటి పరష్కారంగా ఈ ఇప్ప లడ్డూలను పేర్కొంటారు. అయితే తాజాగా ఇదే ఇప్ప పువ్వుల నుండి వచ్చ ఇప్ప పరకతో నూనె ను కూడా తయారు చేస్తున్నారు. కట్టెగానుగ పద్దతిలో ఈ నూనెను తయారు చేస్తున్నారు. దీన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ అని కూడా పిలుస్తారు.

                కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండల కేంద్రంలో గిరిజన మహిళలు మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నూనె తయారీ కేంద్రాన్ని నెలకొల్పి ఉపాధిని పొందుతున్నారు. సిర్పూర్(యు) మండలం లోని నెట్నూరు(కె) గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజన మహిళలు జాయింట్ లైవ్ లి వుడ్ గ్రూపుగా ఏర్పడి సిర్పూర్(యు)లోని మండల మహిళా సమాఖ్య భవనంలో ఈ నూనె తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. వారే స్వయంగా దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు.............

ఇప్ప పరకతో ఇప్ప నూనె తీయడంతోపాటు పల్లీలు, నువ్వుల నూనె కూడా తయారు చేస్తారు. ఉట్నూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్థిక మద్దతు కూడా వీరికి లభించింది. ఇక్కడ ఇప్ప పరకతో తయారు చేసిన నూనె 200 గ్రాములకు 150 రూపాయల ధర పలుకుతుండగా, కిలో నూనె ధర 800 రూపాయల వరకు పలుకుతోంది. అయితే తాము తయారు చేసిన నూనెలను విక్రయించడమే కాకుండా ఎవరైనా తమ సొంత నూనె గింజలను తీసుకుని వస్తే 30 రూపాయలకు కిలో చొప్పున నూనె తీసి ఇస్తారు. పది కిలోల ఇప్ప పరకతో నాలుగు కిలోల ఇప్ప నూనె తయారవుతోంది.

ఈ నూనె ను స్థానికంగానే కాకుండా గిరిజన వేడుకలు, సభలు, సమావేశాలు జరిగే ప్రదేశాల్లో, ఇంకా అధికారిక కార్యక్రమాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. కాగా ఆన్ లైన్ మార్కెట్ లో ఇదే ఇప్ప నూనె ధర ఇక్కడికంటే ఎక్కువగానే ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ నూనె తయారీ కేంద్రం తమ ఆర్థిక అభివృద్దికి ఎంతో తోడ్పడుతోందని మండల సమాఖ్య అధ్యక్షురాలు మడావి వనజ NS99


న్యూస్తో తెలిపారు. ప్రభుత్వం తమకు మరింత చేయూతను అందిస్తే మరింత నాణ్యమైన నూనె తక్కువ ధరకే తాము అందిస్తామని 

Saturday, 23 March 2024

16ఏళ్ల స్టూడెంట్ పై క్లాస్ లోనే మ్యాథ్స్ టీచర్ లైంగిక దాడి .. ఆ విధంగా బయటపడ్డ నిజం

                     అగ్రరాజ్యమైన అమెరికా(America)లో జరిగిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్‌లోని మిస్సౌరీలో ఈ షాకింగ్ కేసు పోలీసులతో పాటు అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక హైస్కూల్ మహిళా ఉపాధ్యాయురాలు(Teacher) తన విద్యార్థుల్లో ఒకరితో పాఠశాల ఆవరణలో లైంగిక సంబంధం పెట్టుకుంది. అదే సమయంలో ఎవరైనా వస్తే తనకు చెప్పమని మరికొందరు స్టూడెంట్స్ ని కాపలా పెట్టింది.


స్కూల్ లో టీచర్ అరాచకం..


ఈ సంఘటన జనవరి 5న పులాస్కీ కౌంటీలోని లాకీ హైస్కూల్‌లో జరిగింది. హేలీ క్లిఫ్టన్-కార్మాక్ అనే 26 ఏళ్ల మ్యాథ్స్ టీచర్ ను గురువారం టెక్సాస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల ప్రాణాలకు హాని కలిగించడం, చట్టబద్ధమైన అత్యాచారం, విద్యార్థితో లైంగిక సంబంధాలు మరియు పిల్లల వేధింపుల ఆరోపణలు తలెత్తడంతో టీచర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ప్రకటనలు


Optical Illusion: మీరు స్ట్రాంగా లేక వీకా .. ఈ ఫోటో మీ క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది

16ఏళ్ల స్టూడెంట్ తో టీచర్ శృంగారం..


16 ఏళ్ల బాలుడితో మ్యాథ్స్ టీచర్ స్కూల్లోనే శృంగారం..!


ఈ బంధంపై ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. క్లిఫ్టన్-కార్మాక్‌తో శారీరక సంబంధం కారణంగా 16 ఏళ్ల యువకుడు తన వీపు వెనుక గీతలు ఉన్న ఫోటోలను ఇతర విద్యార్థులకు చూపించాడని విద్యార్థి పేర్కొన్నాడు.


భారతీయులు బ్రౌజ్ చేసిన టాప్ 10 వెబ్‌సైట్లు ఇవే!

భారతీయులు బ్రౌజ్ చేసిన టాప్ 10 వెబ్‌సైట్లు ఇవే!మరిన్ని వార్తలు…

ప్రిన్సిపల్ కు కోర్టు నివేదిక..


మ్యాథ్స్ టీచర్ విద్యార్ధితో అత్యంత చనువుగా ఉన్నట్లుగా కొన్ని సాక్ష్యాలతో పాటు పత్రాలను కోర్టు హైస్కూల్ ప్రిన్సిపాల్, లాకీ స్కూల్ సూపరింటెండెంట్ పంపించింది. విద్యార్థులతో టీచర్ అసాధారణ ప్రవర్తన గురించి తెలుసుకున్నట్లుగా వియన్ న్యూస్ నివేదించింది.


ప్రకటనలు


నిజ నిరూపణకు టైమ్ పట్టింది..


డిసెంబరులో అధికారులు సెర్చ్ వారెంట్ పొందిన తరువాత టీచర్ ఫోన్‌ను పరిశీలించారు. వారెంట్ అందించిన పోలీసు అధికారి ప్రకారం ఆ సమయంలో అతను ఎటువంటి సమస్య లేకుండా తన ఫోన్‌ను ఇచ్చాడు. ఆ సమయంలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రమేయం ఉందని ఆ మహిళ ఖండించింది.


టీచర్ ఫోన్ లో సాక్షాలు..


అయితే ఆ తర్వాత సదరు మహిళ తన లాయర్ సలహా మేరకు పోలీసులకు పాస్‌వర్డ్ ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసు అధికారులు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సిస్టమ్‌తో ఫోన్‌ను పరిశీలించారు. క్లిఫ్టన్-కార్మాక్ టీచర్ తో పాటు విద్యార్థికి మధ్య వారి సంబంధాన్ని చర్చిస్తూ సంభాషణలను కనుగొన్నారు. అవుట్‌లెట్‌కి ఒక ప్రకటనలో పాఠశాల జిల్లా, “డిసెంబర్ 8, 2023 నాటికి ఉద్యోగి జిల్లాలో లేరు. ఆమె తిరిగి వస్తుందని కూడా తెలియదంటున్నారు.


ప్రకటనలు


పరారీలో ..


తన కుటుంబాన్ని కలవడానికి టెక్సాస్‌కు బయలుదేరే కొద్దిసేపటి ముందు మహిళ తన కుటుంబాన్ని సందర్శించిందని విద్యార్థి తండ్రి తెలిపారు. కోర్టు పత్రాల ప్రకారం ఆమె ఒక సాక్షితో లైంగిక సంబంధాన్ని ధృవీకరించింది. పాఠశాలలో శారీరక కలయికలో ఉన్నప్పుడు టీచర్ ఇతర పిల్లలను “నిఘా"గా ఉపయోగించిందని పేర్కొన్నారు.


అసలు కథ ఇది..


అవసరమైతే తన కుమారుడి కోసం అబద్ధాలు చెప్పేందుకు సిద్ధమని తండ్రి చెప్పినట్లు సమాచారం. తండ్రి జనవరి 3 , 8 న తన కొడుకు నిర్బంధించబడ్డాడని అయితే ఈవిషయంలో మొదట డిగ్రీ పిల్లలను అపాయంలోకి నెట్టడంతో అభియోగానికి అతను నిర్దోషిగా పరిగణించబడినట్లుగా నేరాన్ని అంగీకరించారు.

సామాజిక సేవకురాలు, పరోపకారి - ఓ అవినీతి అధికారిణి కథ ఇదే!



 

సామాజిక సేవకురాలు, పరోపకారి - ఓ అవినీతి అధికారిణి కథ ఇదే!

Mahabubabad News: సామాజిక సేవకురాలిగా పేరొందిన ఆ ప్రభుత్వాధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఆ జిల్లాలో సంచలనంగా మారింది.

అనతి కాలంలోనే..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా అంటే తెలియని వారుండరు. తన వృత్తి ధర్మాన్ని బాధ్యతగా నిర్వహిస్తూనే.. సాధారణ జీవితం గడుపుతూ.. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ తనకు తోచిన సాయం చేసేవారు. సెలవు రోజుల్లో పొలం పనుల్లో నిమగ్నమవుతూనే ఇటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ములుగు జిల్లా రామచంద్రపురంలో జన్మించిన తస్లీమా మహమ్మద్ కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశారు. గ్రూప్ - 2 పరీక్షలు రాసి సబ్ రిజిస్ట్రార్ గా ఎంపికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో ఎక్కువ కాలం పని చేసి సామాజిక కార్యక్రమాల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. తండ్రి పేరుతో ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుపేదలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. కరోనా సమయంలో ప్రస్తుత మంత్రి సీతక్కతో కలిసి ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. మనుషులే కాదు మూగజీవాల పట్ల కూడా తన ప్రేమను చాటుకునేవారు.

కొద్ది రోజుల క్రితమే బదిలీ

ములుగు సబ్ రిజిస్ట్రార్ గా సేవలందించిన తస్లీమా మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా కొద్దిరోజుల క్రితం బదిలీ అయ్యారు. ఇక్కడ కూడా తనదైన రీతిలో సమాజ సేవ చేస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు. అనేక మందికి తానున్నానంటూ అండగా నిలిచారు. అయితే, ఇదంతా నాణేనికి ఓ కోణం మాత్రమే. మరో కోణంలో ఆమె అవినీతి అపప్రదను మూటకట్టుకున్నారు. ఇంతటి పేరున్న ఆమెకు ముడుపులు ముట్టచెప్పనిదే ఫైల్ కదిలేది కాదనే ఆరోపణలు సైతం లేకపోలేదు. తాజాగా, స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం నగదు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

ఇదీ జరిగింది

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీశ్ ఇటీవల 128 గజాల స్థలం కొనుగోలు చేశారు. అయితే, రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను సంప్రదించగా.. ఆమె గజానికి రూ.200 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని గజానికి రూ.150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లాన్ తో.. బాధితుడు తస్లీమాకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం రూ.19,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అలాగే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బంది వద్ద ఉన్న రూ.1.78 లక్షలను సైతం ఏసీబీ అధికారులు సీజ్ చేసి సదరు డాక్యుమెంట్ రైటర్ ను అరెస్ట్ చేశారు. దీంతో సామాజిక సేవకురాలిగా పేరొందిన ఓ అధికారిణి.. ఇలా అవినీతి కేసులో పట్టుబడడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు..చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

                        ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు..చేసిన సందర్భంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త


                    ఎన్నో సంవత్సరాల చిరకాల వాంఛ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు.. చేసిన సందర్భంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆర్యవైశ్యులలో కూడా పేద ఆర్యవైశ్యులు ఉంటారు అని గుర్తించి ఆర్యవైశ్య కార్పొరేషన్ కి కేబినెట్ ఆమోదం తెలిపిన  సందర్భంగా.. ఈరోజు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక  కృతజ్ఞతలు..తెలిపిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..

నేటి నుంచి తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవాలు, ఏడాదిలో రెండు రోజులే అనుమతి

 

నేటి నుంచి తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవాలు, ఏడాదిలో రెండు రోజులే అనుమతి

 ఏడాదికి రెండు రోజులు పాటు అనుమితించే ప్రత్యేకత గల తుంబుర తీర్థం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి తిరుమల పుణ్యక్షేత్రం దట్టమైన శేషాచలం అడవుల్లో నెలకొని ఉంది. ఈ శేషాచలంలో పలు తీర్ధాలు ఉన్నాయి. అయితే కొన్నింటికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఏడాదికి రెండు రోజులు పాటు అనుమితించే ప్రత్యేకత గల తుంబుర తీర్థం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున సుమారు 14 కిలో మీటర్ల దూరంలో ఈ తుంబుర తీర్థం ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే పాపవినాశనం వరకు వాహనాలలో వెళ్లి అక్కడ నుండి నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి గడియలలో మాత్రమే అనుమతిస్తారు. ఈ ఏడాది మార్చి 24న, 25న అనుమతిస్తారు. మార్చి 24వ తేదీ ఉదయం 5 నుండి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు, మార్చి 25వ తేదీ ఉద‌యం 5 నుండి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే భక్తులను అనుమతిస్తారు. ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు.

Tumburu Theertham in Tirumala: నేటి నుంచి తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవాలు, ఏడాదిలో రెండు రోజులే అనుమతి

స్థల పురాణం
నారద మహర్షి స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో తుంబురుడు వెనక్కి తగ్గి ఆ తీర్థంలోనే కూర్చుండి పోతారు. అప్పుడు వేంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్లి తుంబురుడిని బుజ్జగిస్తారు. దీంతో ఆ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. అంతేకాకుండా పూర్వం తుంబురుడు అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పాలని మహర్షులను ప్రార్ధించాడట. తిరుమలలోని ఈ తీర్థంలో స్నానమాచరించమని వాళ్లు సెలవివ్వడంతో, అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడని చెబుతారు. తుంబురుడు మోక్షాన్ని పొందిన తీర్థం కనుక, ఈ తీర్థానికి తుంబుర తీర్థం అనే పేరు వచ్చిందని మరో కధ చెబుతున్నారు. మరోవైపు తరిగొండ వెంగమాంబ స్వామి వారిని పూజించేందుకు ప్రస్తుత అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం నుంచి గృహ ద్వారా రాత్రి సమయంలో వచ్చి తుంబురు తీర్థంలోని సాక్షాత్కరించిన శ్రీవారిని పూజించేదని ప్రసిద్ధి. ఇలా వివిధ కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

అడ్వెంచర్ ట్రిప్ 
తిరుమల నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అధిక రద్దీ కారణంగా ప్రైవేటు వాహనాలను రెండు రోజులు పాటు నిలిపివేస్తారు. పాపవినాశనం నుండి 6 కిలో మీటర్లు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. దట్టమైన అడవి, ఎతైన కొండలు... ఆకాశాన్ని తాకాయేమో అనేలా పెద్ద పెద్ద చెట్లు.. పక్షుల కిలకిల రాగాలు... పౌర్ణమి చంద్రుడి వెలుగుల్లో బండ రాళ్ళ మీదుగా ప్రయాణించి తీర్ధం చేరుకోవచ్చు. రెండుగా చీలిన కొండ తుంబురు తీర్థానికి దారిని ఇస్తుండగా మధ్యలో ప్రవహించే జలపాతం భక్తులను పరవశింప చేస్తోంది. తీర్ధం ప్రారంభం నుంచి కొండకోనల్లో నుంచి జాలువారిన నీటిలో మునిగిపోయే లోతులో చిన్నపాటి మార్గంలో వెళ్లి.. ఈ పుణ్య తీర్ధం లో స్నానమాచరించడం ద్వారా సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. తిరిగి అదే మార్గంలో మరో ఆరు కిలో మీటర్లు నడిచి పాపవినాశనం చేరుకోవచ్చు. ఇక్కడికి రెండు రోజులు పాటు సుమారు లక్ష మందికి పైగా భక్తులు వస్తుంటారు. వీరికి కావాల్సిన  వైద్య, ఆహార, భోజన సదుపాయాలు టీటీడీ ఏర్పాటు చేస్తుంది. చిన్న పిల్లలు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు మినహా అందరూ చూడాల్సిన ప్రాంతం.




తస్లీమా ఏసీబీ ట్రాప్ లో తెర వెనక భారీ కుట్ర !

 తస్లీమా ఏసీబీ ట్రాప్ లో తెర వెనక భారీ కుట్ర !


తస్లిమా మహమ్మద్ మీద గిట్టనివాళ్ళ కుట్ర పూరిత చర్య భాగంగానే లంచంని అంటగట్టే ప్రయత్నం. తన పదమూడేళ్ళ సర్వీసులో ఏ ఒక్క సందర్భంలో లంచం అనే మాటే లేకుండా తన జీతంలో సగం సోషల్ సర్వీసులకు ఖర్చు పెడుతూ.. ప్రతి ఆదివారం మరియు శెలవు దినాల్లో ఫార్మింగ్ కార్యక్రమాలతో రైతులకు అండగా వుంటూ వృత్తి ధర్మం నిజాయితీగ నిర్వర్తిస్తుంటే, మహబూబాబాద్ లో అవినీతికి అడ్డుకట్ట వేస్తుందని గిట్టని వాళ్ళు చేసిన కుట్ర పూరితమైన చర్య.
తస్లిమా మహమ్మద్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మనవి.. తనమీద వస్తున్న అనవసరమైన ట్రోల్ల్స్ ని నమ్మకండి..
**అసలు కుట్ర వెనుకాల నిజాలేంటో త్వరలో తెలుసుకుంటారు**
ములుగులో దాదాపు 13 సంవత్సరాల పాటు పని చేసి ఎలాంటి అవినీతి మరక లేకుండా పని చేసి అక్కడి ప్రజల మన్ననలు పొందుతూ , నిత్యం అక్కడి ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవ చేస్తూ ఉండేది . గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాబాద్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది . మహాబాద్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే అక్కడి ఏజెంట్ల వసూళ్లను కట్టడి చేసి ఏజెంట్ల వ్యవస్థ లేకుండా ప్రయత్నం చేయడంతో మహాబాద్ లో అందరి దృష్టి ఆమె మీద పడింది. గతంలో జిల్లాగా ఏర్పడిన మహాబాద్ లో భూముల రేట్లు అమాంతం పెరగడంతో అక్కడ ఏజంట్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది … అక్కడ కాంగ్రెస్ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత మహాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ పలు మార్లు తస్లీమా గారికి ఫోన్ చేసి కలవండి అని అడగటం జరిగింది అని తెలుస్తుంది… కొన్ని లాండ్స్ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది … అందుకే ఎమ్మెల్యే మురళి నాయక్ పక్కా ప్లాన్ తో తస్లీమా ని ఇరికించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది, ఏసీబీ ఆఫీసర్ రిలీజ్ చేసిన వీడియో లో డబ్బులు తీసుకుంది అసిస్టెంట్ వెంకటేష్ అని ఉంది తప్ప ఎక్కడ కూడా తస్లిమా దొరికింది అని చెప్పలేదు , కేవలం కొందరి రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు తస్లీమా ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి తస్లీమా ఇంట్లో కూడా 6 గంటల పాటు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని తెలియడంతో కొంత ఆశ్చ్యర్యానికి గురి అయినట్లు తెలుస్తుంది , సోదాలలో దాదాపు లక్ష రూపాయల వరకు , 4 తులాల బంగారం మరియు తన పిల్లల పేర్ల మీద తీసుకున్న రెండు ప్లాట్లు మాత్రమే ఉన్నాయని తెలిసింది. దాంతో అర్ధరాత్రి వరకు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు షాక్ అయ్యి వెనుదిరిగినట్లు తెలిసింది
Todas las r

కొండగట్టు ఆలయ ఈవో వెంకటేష్ సస్పెన్షన్


 

కొండగట్టు ఆలయ ఈవో వెంకటేష్ సస్పెన్షన్

కొండగట్టు ఆలయ ఈవో టీ. వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఎం. హనుమంతరావు ఉత్తర్వులు వెలువరించారు.కొండగట్టు ఆలయ ఈవో టీ. వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఎం. హనుమంతరావు ఉత్తర్వులు వెలువరించారు. ఇటీవల టెంపుల్‌కు చెందిన టెండర్ల విషయంతో పాటు దుకాణాల లీజు డబ్బులకు సంబంధించి ఆర్థిక పరమైన అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఈఓ పర్యవేక్షణ లోపం ఉండటంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ విషయంలో ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఆధ్వర్యంలో ఈ నెల 21న విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అయితే సస్పెన్షన్ గురైన ఈవో వెంకటేష్ కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఉండాల్సిందిగా సూచించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కరీంనగర్ హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ సస్పెన్షన్ ఒక ఈవో తోనే ఆగుతుందా లేక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపరిండెంట్ స్థాయి అధికారులు విచారణ ఎదుర్కోక తప్పదా అని ఆలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Friday, 22 March 2024

చెక్‌‘పోస్టులు’ ఉంచుతారా.. ఎత్తేస్తారా? ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ


  

చెక్‌‘పోస్టులు’ ఉంచుతారా.. ఎత్తేస్తారా? ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

రాష్ట్రప్రభుత్వం చెక్‌పోస్టులు ఉంచుతుందా? ఎత్తేస్తుందా? అనేది ప్రస్తుతం స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీలో హాట్ టాపిక్‌గా మారింది.

రాష్ట్రప్రభుత్వం చెక్‌పోస్టులు ఉంచుతుందా? ఎత్తేస్తుందా? అనేది ప్రస్తుతం స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీలో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రం ఆదేశాలు ఇచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా చెక్ పోస్టులపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది సంస్థ ఉద్యోగుల్లోనూ చర్చనీయాంశమైంది. ఒకవేళ ప్రభుత్వం చెక్ పోస్టులను రద్దు చేస్తే మాత్రం వారిని ఆర్టీఓ పరిధిలోకి తీసుకురానుంది. వారితో ఎన్‌ఫోర్స్‌మెంట్ మొబైల్ టీంలుగా చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, మాదక ద్రవ్యాలు రాకుండా, పీడీఎస్‌ బియ్యం తదితర సరఫరా కాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. రాష్ట్ర సరిహద్దుల్లో 14 చెక్ పోస్టులున్నాయి. కామారెడ్డిలో ఒకటి ఇంట్రా స్టేట్ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. సాలూరా(నిజామాబాద్), ఆదిలాబాద్, జహీరాబాద్(సంగారెడ్డి), మద్నూరు(కామారెడ్డి), బైంసా(నిర్మల్),వాంకిడి(కొమ్రంభీం ఆసిపాబాద్), అలంపూర్(జోగులాంబ), కృష్ణుడు(నారాయణపేట), విష్ణుపురం, నాగార్జునసాగర్(నల్లగొండ), కోదాడ(సూర్యాపేట), కల్లూరు(ఖమ్మం), అశ్వరావుపేట, పాల్వంచ(భద్రాద్రికొత్తగూడెం)లో ఉన్నాయి.

వీటి ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా వచ్చేవాటికి చెక్ పెడుతున్నారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేయడంతో పాటు జాతీయ రహదారిపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చెక్ పోస్టుల్లో మూడు షిప్టుల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఐదురోజుల క్రితం జీఓ ఎంఎస్ నెం.24ను జారీ చేసింది. ఈ జీవోతో ఏపీలో చెక్ పోస్టులను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తెలంగాణలో కూడా రద్దుచేస్తారా? అనేది చర్చనీయాంశమైంది. సంబంధిత ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వం తీసుకునే పాలసీలు తమకు తెలియదంటున్నారు. ప్రభుత్వం నుంచి జీవో వచ్చినప్పుడే తాము చెప్పగలమంటూ అభిప్రాయపడుతున్నారు.

చెక్ పోస్టులు ఎత్తేస్తే పోస్టింగ్ ఎక్కడ?

రాష్ట్రప్రభుత్వం ఒకవేళ చెక్ పోస్టులు ఎత్తేస్తే అక్కడ పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని ఎక్కడ పోస్టింగ్ ఇస్తారనే చర్చకూడా కొనసాగుతోంది. సిబ్బంది తక్కువ ఉన్న జిల్లాల్లో డిప్యూటేషన్ చేయనున్నట్లు సమాచారం. మిగతా సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్ మొబైల్ టీంలు చేసే ఆలోచన కూడా అధికారులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ టీంలతో ఆయా జిల్లాల్లో వాహనాల తనిఖీ చేయించనున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే చెక్ పోస్టుల కొనసాగింపు ఆధారపడింది.

కేంద్ర ఆదేశాలు రాష్ట్ర సర్కార్ పాటించేనా?

కేంద్ర ప్రభుత్వం చెక్ పోస్టులు ఎత్తేయాలని గతంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకొని ఎత్తేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అమలు చేయలేదు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా వచ్చే ప్రతి వస్తువును అడ్డుకున్నారు. ధాన్యం, మద్యం ఇలా ఏదీ రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకట్టవేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకున్నారు. చెక్ పోస్టులతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. తాజాగా ఐదురోజుల క్రితం ఏపీ ప్రభుత్వం సైతం తొలగించడంతో తెలంగాణలో మూడు నెలల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తుందా? లేదా? అనేది ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. అది ప్రభుత్వ పాలసీ కావడంతో ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

అంతా.... మీ ఇష్టమేనా....?


 

అంతా.... మీ ఇష్టమేనా....?

సూర్యాపేట జిల్లా శ్రీ చైతన్య స్కూల్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.                    

సూర్యాపేట జిల్లా శ్రీ చైతన్య స్కూల్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అక్కడ విద్యార్థులకు ఏర్పాటు చేసిన మౌలిక వసతులపై ఆరా తీశారు. మూడవ అంతస్తులు పెట్టిన పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించి, ఈ అంతస్తులొ పరీక్ష కేంద్రాలను పెట్టడం ఏంటి...?, అంతా మీ ఇష్టమేనా...?, ఇలా ఉంటే విద్యార్థులు అసౌకర్యానికి గురికారా...? అని కేంద్ర అదికారుల పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి మూడంతస్తుల ఎక్కి రావడం వలన విద్యార్థులు అలసట పాలవుతారని ఇలాంటి పొరపాట్లు మరల చేయవద్దని ఇన్చార్జి డీఈఓ శైలజను ఆదేశించారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పరీక్ష కేంద్రానికి పంపాలని,సెల్ ఫోన్లు ఎవరు తీసుకొని రావద్దని కలెక్టర్ సూచించారు. గురువారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 179 మందికి గాను 179 మంది హాజరయ్యారని చీఫ్ సూపర్డెంట్ తబిత కలెక్టర్‌కి తెలిపారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఇంచార్జి ఎంఈఓ శైలజ, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Thursday, 21 March 2024

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తాసిల్దార్ కే శ్రీనివాసరావు

 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తాసిల్దార్ కే శ్రీనివాసరావు         


 
విజయనగరం టౌన్ : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజయనగరం మండల‌ డిప్యూటీ తహశీల్దారు కొట్నాన శ్రీనివాసరావు.స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేసిన డీటీ శ్రీనివాస్

ఏసీబీ ని ఆశ్రయించిన రైతు..
తహశీల్దారు కార్యాలయంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

హెచ్‌ఎండీఏ ఏపీవో సస్పెన్షన్‌


 

హెచ్‌ఎండీఏ ఏపీవో సస్పెన్షన్‌

 

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారిని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారిని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గండిపేట మండలం పుప్పాల గ్రామ రెవెన్యూ సర్వే నంబర్‌ 314, 317, 330, 332 పరిధిలో ఉన్న స్థలాలు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన 100 అడుగుల రోడ్డులో తమ భూ ములు పోయాయని కొందరు టీడీఆర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.                                        ఇందులో శ్రావణ్‌ కుమార్‌ 10-11-2023న 11698 చదరపు గజాల స్థలానికి, వెంకటరమణ 22046 చదరపు అడుగుల స్థలం ఉందని హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై హెచ్‌ఎండీఏ శంకర్‌పల్లి జోన్‌ ప్లానింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారి బీవీ కృష్ణకుమార్‌ రెండు దరఖాస్తులపై పూర్తి స్థాయిలో విచారణ చేయలేదు.

ఆయా స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్‌ నంబర్లు, వాటి యజమానులు ఎవరు అన్న విషయాలను పరిశీలించకుండానే వారికి టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) కింద పరిహారాన్ని ఇవ్వాలని సిఫారసు చేశారు. దీంతో ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీవీ కృష్ణ కుమార్‌ను కమిషనర్‌ సస్పెండ్‌ చేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉదంతంపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు హెచ్‌ఎండీఏ ఎస్టేట్‌ ఆఫీసర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు.

మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఆగ్రహం
హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్న అవకతవకలపై హెచ్‌ఎండీఏ మె ట్రోపాలిటన్‌ కమిషనర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక ప్రభుత్వ అధికారిగా సమర్థంగా విధులు నిర్వహించడంతోపాటు ప్రజాధనాన్ని వృథా కాకుండా కాపాడాల్సిన అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనడానికి ఇది నిదర్శనమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు సమాచారం.