Tuesday, 30 April 2024

ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్

                                                     ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను మంగళవారం విడుదల చేసారు. 1న తాండూరు లో ఆయన ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. మే 2న కర్ణాటక గుల్బర్గా పార్లమెంట్ లో ప్రచారం చేస్తున్నారు. 3న మెదక్ పార్లమెంట్ పరిధిలో, 4న మహారాష్ట్ర సోలాపూర్ పార్లమెంట్ లో ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు.

    ఇప్పటి వరకు బీజేపీ ప్రచారానికి దూరంగా ఉన్న రాజాసింగ్.. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన లకు సైతం దూరంగా ఉన్నారు. తాజాగా ప్రచారంలో పాల్గొంటుండటంతో రాజాసింగ్ అలకవీడారా? లేక తప్పని పరిస్థితుల్లో దిగి వచ్చారా? అనే చర్చ జరుగుతోంది.




బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్..


 బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. 




కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ బూత్ కమిటీ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ- తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉంటూ వస్తోన్న హైదరాబాద్‌ భవిష్యుత్తు గురించి ప్రస్తావించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని బాంబు పేల్చారు. దీనికి కాంగ్రెస్ కూడా వత్తాసు పలుకుతోందని అన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన జూన్ 2వ తేదీ నాటితో ఉమ్మడి రాజధాని హోదా ముగిసిపోతుందని, ఆ వెెంటనే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని చెప్పారు. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం చేస్తా - హీరోయిన్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. 10 సంవత్సరాల వరకే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తరువాత అవసరమైతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే పక్కా సమాచారం ఉందని అన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ, గల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలంటూ కొందరు తనను ప్రశ్నిస్తోన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు ఎందుకు వేయాలనడానికి నాలుగు కారణాలు ఉన్నాయంటూ కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా బదలాయించడాన్ని అడ్డుకోవడానికి లోక్‌సభలో గులాబీ జెండా ఎగరాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ సీఎంకు సుదీర్ఘ లేఖ రాసిన ప్రధాని మోదీ, లేఖలో ఏముంది అంటే? నదుల అనుసంధానం ద్వారా గోదావరి నదీ జలాలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించుకు వెళ్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారని, తెలంగాణ అవసరాలు తీరకుండా ఇక్కడి నీళ్లను తీసుకెళ్లడాన్ని అడ్డుకునే సత్తా గులాబీ జెండాకు మాత్రమే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 

కాంగ్రెస్ కండువా కప్పుకొన్న గుత్తా: తెలంగాణలో అనూహ్య పరిణామం..!!

 కాంగ్రెస్ కండువా కప్పుకొన్న గుత్తా: తెలంగాణలో అనూహ్య పరిణామం..!!




                    : లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. అధికారాన్ని కోల్పోయాక పలువురు సీనియర్లు బీఆర్ఎస్‌ను వీడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం దీనికి మినహాయింపు కాదు. ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడారు. బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు కూతురు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కేశవరావు కూడా కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఆయన ధృవీకరించారు కూడా. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం చేస్తా - హీరోయిన్ బీఆర్ఎస్‌కే చెందిన మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం, కూతురు కడియం కావ్యతో సహా కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ లోక్‌సభ టికెట్‌ను కేటాయించిన తరువాత కూడా ఆమె దాన్ని వదులుకుని మరీ పార్టీని వీడారు. అదే వరంగల్ లోక్‌సభలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న వారిలో మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావు సహా పలువురు నాయకులు ఉన్నారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో- బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఉదయం ఆయన హైదరాబాద్‌లో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

మోడీ కాపీ కొట్టారు: కేసీఆర్ భవిష్యత్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు


 మోడీ కాపీ కొట్టారు: కేసీఆర్ భవిష్యత్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 

By Rajashekhar

 రంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఎం కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చేవెళ్ల లోక్‌సభ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా మంగళవారం రాత్రి బడంగ్‌పేట, బాలాపూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా తట్టుకుని నిలబడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చారని కొనియాడారు. బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని.. ఇక తిరిగి రాదని, తూకానికి వేయాల్సిందేనని రేవంత్ ఎద్దేవా చేశారు. డిసెంబర్‌లో జరిగిన సెమీఫైనల్స్‌లో బీఆర్ఎస్‌ను ఓడించి ఫైనల్స్‌కు వచ్చామని, ఫైనల్స్‌లో బీజేపీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. ఇండియా కూటమిలో కేసీఆర్‌ను చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు పిఠాపురంపై తాజా నివేదిక..మారిపోయిన సీన్..ఆ పార్టీదే లీడ్ కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. 12 ఎంపీ సీట్లు గెలిస్తే నామా నాగేశ్వరరావు కేంద్రమంత్రి అవుతారని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరి చెవిలో పువ్వు పెడతారు? ఇండియా కూటమి నేతలు.. కారును దగ్గరకు కూడా రానీయరని రేవంత్ తేల్చి చెప్పారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిచి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయబోతన్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ జీవితంలో సీఎం పదవి అనేది ఇక లేదు. సబితా ఇంద్రా రెడ్డి ఉదయం కారు గుర్తు అంటున్నారు.. సాయంత్రం కమలం గుర్తు అంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను ప్రధాని మోడీ రద్దు చేస్తే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని రేవంత్ నిలదీశారు. విశ్వేశ్వర్ రెడ్డి రాజ్యసభకు వెళితే మంచిదని హితవు పలికారు. 

             జహీరాబాద్‌లో కేసీఆర్ ప్రసంగాన్ని మోడీ కాపీ కొట్టారు తప్ప.. కొత్తదనం ఏమీ లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనను తిడితే మోడీకి ఏం వస్తుందని ప్రశ్నించారు. తెలంగాణకు మోడీ ఏమిస్తారో ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. మోడీని గద్దె దించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నిష్క్రమించబోరని అన్నారు.

Monday, 29 April 2024

Sunday, 28 April 2024

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు*







 ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు


ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ 2000 సంవత్సరములో తిరుపతిలో ప్రారంభింపబడి ఇంతింతై వటుదింతైనట్టు ఎంతో ఎదుగుతూ ఇవాళ 50 దేశాలలో ప్రబలిపోయి ఉన్నది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎదుగుదలకు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ అధ్యక్షులుగా ఎనలేని సేవలు అందిస్తూ వారి జీవితాన్ని త్యాగం చేయడం జరిగినది. హైదరాబాదులోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ  నాయకులలో ఉత్సాహాన్ని ప్రోత్సహాన్ని నింపడానికి మరియు ప్రస్తుతము జరుగుతున్న గ్లోబల్ కన్వెన్షన్ 2024 గురించి తెలపడానికి ఈరోజు టంగుటూరి రామకృష్ణ  గారు హైదరాబాద్ విచ్చేసినారు.  


వారు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ విభాగము నుండి సేవా కార్యక్రమములో భాగముగా ఈరోజు గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ వద్ద ఒక వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. అన్నార్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈరోజు భోజన కార్యక్రమం ద్వారా మా సేవలను వినియోగించుకున్నారు. ఈనాటి భోజన వసతిని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారులు శ్రీ కౌటికె విఠల్  గారు వారి భుజస్కందాలపై వేసుకొని మొత్తం గా వారే స్పాన్సర్ చేయడం జరిగినది. 


ఈ కార్యక్రమానికి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసిన అన్నార్తులకు స్వయంగా వడ్డించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు శ్రీ రాజశేఖర్ గారు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్ శ్రీ ఊరబాబు రావు గారు, జాతీయ న్యాయ సలహాదారులు అడ్వకేట్ శ్రీ రవి గుప్తా గారు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ  సీనియర్ సిటిజర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సింగిరికొండ నరసింహ గారు మరి ఇతర ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొని సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగినది.

మరో లంచగొండి అధికారి ఏసీబీకి చిక్కాడు.. మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి

               


తాజాగా.. హైదరాబాద్‌లో మరో అవినీతి అధికారి ACB అధికారులకు పట్టుబడ్డాడు. కమర్షియల్ బిల్డింగ్‌ను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేసిన నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక డిప్యూటీ ఇంజినీరు యాత పవన్‌కుమార్‌ను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన ఆఫీసులో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకొని రిమాండుకు తరలించారు. రామంతాపూర్‌కు చెందిన బిల్డర్‌ గోపగాని రమణమూర్తి ఉప్పల్‌ భగాయత్‌లోని శాంతినగర్‌లో కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఆ భవనానికి NOC కోసం అప్లై చేసుకోగా.. పవన్‌కుమార్‌ రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.



అంత డబ్బు అడిగేసరికి బాధితుడు రమణమూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. తెలిసినవారు ఇచ్చిన సలహాతో.. ఏసీబీని ఆశ్రయించాడు. రమణమూర్తి శుక్రవారం బుద్ధభవన్‌లోని ఆఫీసులో పవన్‌కు రూ.4 లక్షలు ఇస్తుండగా అధికారులు కాపు కాసి పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకొని.. నాంపల్లిలోని ACB కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి లంచగొండి అధికారికి రిమాండ్ విధించింది. ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేయాలని ACB అధికారులు తెలిపారు. లంచం తీసుకోవడం మాత్రమే కాదు.. ఇవ్వడం కూడా నేరం. అందుకే లంచాలు ఇచ్చి.. పనులు చేయించుకోవాలని చూడకండి. మీకు ఇబ్బంది ఉంటే ఏసీబీ వద్దకు వెళ్లండి.

త్వరలో ప్రతి అభ్యర్థలకు కొత్త రేషన్ కార్డ్ లభిస్తుంది.

 చాలా మంది దరఖాస్తు చేస్తున్నారు. ఈ అభ్యర్థనల దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే తేదీలను ప్రకటించారు మరియు ఎలా దరఖాస్తు చెయ్యాలి అని దానిపై మార్గదర్శనలు జారీచేసింది. సమాచారం ఉప్ డేట్ చేసిన తరువాత, త్వరలో ప్రతి అభ్యర్థలకు కొత్త రేషన్ కార్డ్ లభిస్తుంది.


రేషన్ కార్డులు మరియు ఆధార్ కార్డులను ఉప్ డేట్ చెయ్యడానికి ప్రభుత్వం గడువు పొదగించనప్పటికి, చాలా మంది ఉప్ డేట్ చెయ్యడానికి విఫలం అయ్యారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనేక పథకాలు అమల కానున్నాయ్ కాబట్టి ప్రజలందరూ తమ్మ ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ లోని సమాచారాలను ఉప్ డేట్ చేయాలని సూచించారు, వీటిని చెయ్యడంలో విఫలమైన వ్యక్తులు పర్భుత్వమ్ నుండి వచ్చే ప్రయోజనలు కోల్పోతారు.

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభధ్రుల నియోజకవర్గం ఎన్నికల షెడ్యూల్


  వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభధ్రుల  నియోజకవర్గం ఎన్నికల షెడ్యూల్ ను  కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినందున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన  కోరారు.

     శుక్రవారం ఆమె  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో  జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు

      కేంద్ర ఎన్నికల సంఘం  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు  విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మే 2న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని, ఆ రోజు నుండి మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ, మే 10న నామినేషన్ల పరిశీలన, మే 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. మే 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పట్టబధ్రుల  ఎమ్మెల్సీ నియోజకవర్గం పోలింగ్ ఉంటుందని, జూన్ 5న కౌంటింగ్ ఉంటుందని, జూన్ 8వ తేదీ నాటికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆమె వెల్లడించారు.

      ఈ ఎన్నికలకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుందని, 12 జిల్లాలలో పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు ఉంటారని, 37 మంది ఏఆర్వోలు పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్వోలుగా వ్యవహరిస్తారని తెలిపారు. పట్టబద్రులఎమ్మెల్సీ ఎన్నికల   సందర్బంగా 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 1400 పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదించడం జరిగిందని  ఆ వివరాలు రావలసి ఉందని ఆమె వివరించారు. మొత్తం 4,91,396 మంది ఓటర్లు ఉన్నారని, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలకు సంబంధించి ఇదివరకే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.
      ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి,వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్, పోలీస్ పరిశీలకులు అమోఘజీవన్ గాంకర్ ,రెవెన్యూ  అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు

ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ మాధవీలత... సంచలన పోస్టులు పెట్టిన రేణుదేశాయ్..

 

 ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ మాధవీలత... సంచలన పోస్టులు పెట్టిన రేణుదేశాయ్..

BJP Madhavi Latha: బీజీపీ మాధవీలతను సపోర్ట్ చేస్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన పోస్తు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత ఒక ఎన్నికల బరిలో ఒక స్ట్రాంగ్ మహిళా నేతను చూశానంటూ ఆమె ఎక్స్ లో పోస్టు చేశారు. 

Actress Renu Desai: ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ మాధవీలత... సంచలన పోస్టులు పెట్టిన రేణుదేశాయ్..

Janasena Pawan Kalyan Ex wife Actress Renu Desai Supports BJP Madhavi Latha:  బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు దేశంలో రోజురోజుకు పాపులారీటీ పెరుగుతుంది. ఇప్పటికే ఆమె తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పాతబస్తీలో ధీటైన ప్రసంగాలు చేస్తూ.. ఓవైసీ సోదరులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఓల్డ్ సిటీకి ఓవైసీ సోదరులు చేసింది గుడ్డు సున్నా అంటూ ఆమె ఎద్దెవా చేస్తున్నారు. అంతేకాకుండా.. ఆమె తన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటూ, తన ఫాలోయింగ్ పెంచకుంటున్నారు.ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్కూలో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఏకంగా దేశ ప్రధాని మోదీ కళ్లలో కూడా పడ్డారు. ఆ షో పట్ల పీఎం మోదీ కూడా ఇంప్రెస్ అయ్యారు. అంతేకాకుండా.. శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న మాధవీలత.. మసీదు వైపు చూస్తు విల్లువేసిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీనిపై రాజాసింగ్ కూడా ఆమెకు ఫెవర్ గా మాట్లాడారు.

        గాలిలో బాణం వేస్తే మసీదువైపు వేసిందని ఎలా అంటారని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇలా ఆమె తనపట్ల గతంలో వ్యతిరేకంగా మాట్లాడిన రాజాసింగ్ ను కూడా తనకు ఫెవర్ గా మాట్లాడేలా చేసుకున్నారు. ఓల్డ్ సిటీ అంతా తిరుగుతూ కులమతాలకు అతీతంగా ప్రజలతో మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలిస్తే చేయాలనుకుంటున్న మంచి పనులు గురించి వివరిస్తున్నారు. అదే విధంగా.. తాజాగా, ఆమెకు హైదబాద్ లో క్రమంగా మద్దతు పెరుగుతుందని రాజకీయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

                ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మాధవీలతను సపోర్టు చేస్తు ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. చాలా రోజులుకు హైదరాబాద్ ఎన్నికల బరిలో బలమైన మహిళను చూశానన్నారు. మాధవీలత ప్రచారం, ఆమె స్పీచ్ లు, ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యమేస్తుందన్నారు. అదే విధంగా.. తన మాటలను రాజకీయం చేయోద్దని, తన మనస్సుకు అన్పించిందని చెప్పానని, దీని కోసం ఎవరిదగ్గర ప్యాకేజీ లాంటివి తీసుకోలేందంటూ రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చుకున్నారు.

                ఇక మరోవైపు రేణు దేశాయ్ మాధవీలతను సపోర్ట్ చేస్తు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికలలో బరిలో ఉన్న మాధవీలతకు ఇది మరింత బుస్ట్ కల్గించేదిగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఓవైసీ సోదరులు మాత్రం.. మునుపటిలో జోష్ గా ప్రచారంలో పాల్గొంటున్నట్లు కన్పించడంలేదు. అంతేకాకుండా.. తమను అరెస్టు చేస్తారని, జైలులో చంపేందుకు కుట్రలు చేస్తున్నారని పిరికి వాళ్ల మాదిరిగా మాట్లాడుతున్నారు. దీనికి భిన్నంగా మాధవీలత శివంగిలా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Saturday, 27 April 2024

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ తేదీల్లో మార్పు..

 ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ తేదీల్లో మార్పు.. 



        : ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఇంతకు ముందు మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మే 27న ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉంది. దీంతో పరీక్ష తేదీల్లో మార్పు చేశారు. అడ్వాన్స్ సప్లమెంటరీలో పరీక్షలు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు ఒకే రోజు నిర్వహించనున్నారు. ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థలకు మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వారికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయిర్ వారికి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు అధికారం దక్కేదెవరికి - సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా..!! సప్లిమెంటరీ, ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 24న ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ లో గతం కంటే ఉత్తీర్ణత శాతం తగ్గింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి జిల్ల తొలి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో మలుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 30 పదో తరగతి ఫలితాలు ప్రకటించనున్నారు.

తిరునగర్ భార్గవ్ Congress పార్టీలో చేరడం జరిగింది

 మిర్యాలగూడ మున్సిపల్ చెర్మన్ తిరునగర్ భార్గవ్



మరియు వారితో పాటు 13మంది కౌన్సిలర్లు కాంగ్రేస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి దీపదాస్ మున్సి గారి ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీలో చేరడం జరిగింది

Friday, 26 April 2024

వేములవాడ రాజన్న ఆలయంలో 14మంది ఉద్యోగులపై చర్యలు.. కారణమిదే..!

 


వేములవాడ రాజన్న ఆలయంలో 14 మంది ఉద్యోగులపై చర్యలు.. కారణమిదే..!

వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన 14 మంది ఉద్యోగులకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం కలకలం .                         వేములవాడ   రాజన్న ఆలయంలో 13...

వేములవాడ రాజన్న ఆలయంలో 14మంది ఉద్యోగులపై చర్యలు.. కారణమిదే..!
వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన 14 మంది ఉద్యోగులకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం కలకలం రేపింది.


వేములవాడ రాజన్న ఆలయంలో 14 మంది ఉద్యోగులపై చర్యలు.. కారణమిదే..!


 వేములవాడ, : తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏ చిన్న ఇష్యూ జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అది పెను సంచలనమే. అలాంటిది గురువారం ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 14 మందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు ఏ.ఈ.వోలు, నలుగురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, మరో ఇద్దరు పొరుగు సేవల సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. మొత్తం 14 మందిపై చర్యలు తీసుకున్నారంటూ వినబడిన మరొకరి ప్రస్తావన రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా ప్రసాదాల తయారీ పర్యవేక్షకుడికి దేవాలయ ఖాతాలో డబ్బులు జమ చెయ్యాలని ఆదేశించడంతో అవినీతి అధికారుల సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజన్న ఆలయ అధికారులు, సిబ్బందిపై చర్యలు ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆందోళనలో మరికొందరు

గుడిని మింగే వాళ్ళు ఉంటే, గుడితో పాటు లింగాన్ని మింగే మహానుభావులు ఆలయ ఉద్యోగులుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో 14 మంది ఆలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం పట్ల మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఎంతోమందిపై నిఘా కొనసాగడం, చాలా మంది ఉద్యోగులు, సిబ్బందిపై నిత్యం అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతుండటంతో ఇందులో తమ పేర్లు ఉంటాయేమోనని, ఎప్పుడూ ఏమి జరుగుతుందోనని కొంతమంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకునే పరిస్తితి ఇప్పుడు ఆలయ అధికారులు, సిబ్బందిలో నెలకొంది.

ప్రభుత్వం మారడమే ప్రధాన కారణమా....?

వాస్తవానికి ఈ 14 మంది ఉద్యోగులకు సంబంధించి 2021లోనే విజిలెన్స్ విచారణ పూర్తయింది. కానీ నివేదిక ఫైల్ అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ వద్ద పెండింగ్ లో ఉండటం, సదరు ఉద్యోగులకు అప్పటి బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఫైల్ ముందుకు కదలలేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే వీరిపై చర్యలు తీసుకోవడం వీలు పడలేదనే వాదనలు లేకపోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిందో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో సీఎం రేవంత్ రాజన్న దేవాలయ అభివృద్ధిపై దృష్టి సారించారో ఇక అప్పటి నుండి ఆలయానికి మంచి రోజులు వచ్చాయనే అందరూ భావించారు.

అదే సమయంలో గత ప్రభుత్వంలో ఏళ్ల తరబడి కమిషనర్ గా ఉన్న అనిల్ కుమార్ ను ఇతర శాఖకు బదిలీ చేసి హనుమంతరావును నూతన కమిషనర్ గా నియమించారు. దీంతో ఆప్పటి పెండింగ్ ఫైల్ లు అన్ని ఇప్పుడు ముందుకు వస్తున్నాయని ఈ క్రమంలోనే రాజన్న ఆలయ ఫైల్ ముందుకు రాగా దీనిపై చర్చించి, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు కమిషనర్ హనుమంతరావు వేములవాడ పర్యటనకు వచ్చిన రెండు రోజుల్లోనే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం పై వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

14వ వ్యక్తి ఎవరూ...?

మరోవైపు 13మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్న మరుక్షణమే ఇక్కడ మరో కొత్త చర్చ మొదలైంది. ఆనాడు విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికలో మొత్తం 14మంది పేర్లు ఉండగా, ఇప్పుడు చర్యలు తీసుకున్న వారిలో 14 మంది పేర్లు మాత్రమే ఉన్నాయని, చర్యలు తీసుకోని మిగతా ఆ ఒక్కరు ఎవరు అంటూ చర్చ మొదలైంది. అయితే మిగిలిన ఆ ఒక్క వ్యక్తి ఆలయ ఈ.ఓ కృష్ణ ప్రసాద్ అంటూ ఆలయ ఉద్యోగుల్లో బహిరంగంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

స్పందించని ఈవో

అయితే ఇదే విషయంపై ఆలయ ఈ.వో కృష్ణ ప్రసాద్ ను వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా ఆయన ససేమిరా స్పందించేందుకు సుముఖత చూపలేదు. తర్వాత పూర్తి వివరాలు చెపుతాను అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దాంతో బయట వినిపిస్తున్న ఆ 14వ అధికారి ఈ.వోనే అనే వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏదిఏమైనాప్పటికీ ఆలయ అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం మంచి పరిణామమే అయినప్పటికీ భుజాలు తడుపుకుంటున్న గుమ్మడికాయ దొంగలపై కూడా చర్యలు తీసుకోవాలని రాజన్న భక్తులు, జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

తెలంగాణలో టాప్-10 రిచ్చెస్ట్ MP అభ్యర్థులు.. కళ్లు బైర్లు కమ్మేలా ఆస్తులు, ఎన్ని వందల కోట్లో తెలుసా?






 

తెలంగాణలో టాప్-10 రిచ్చెస్ట్ MP అభ్యర్థులు.. కళ్లు బైర్లు కమ్మేలా ఆస్తులు, ఎన్ని వందల కోట్లో తెలుసా?

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమై okన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈసారి ప్రధాన పార్టీల నుంచి చాలా మంది ధనవంతులు పోటీ చేస్తున్నారు. కళ్లు బైర్లు కమ్మేలా వారి ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. కొందరి ఆస్తులు వేలు, వందల కోట్లుగా ఉండగా.. తెలంగాణలో టాప్-10 రిచ్చెస్ట్ ఎంపీ అభ్యర్థులు ఎవరో ఓసారి చూద్దాం.తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజైన గురువారం అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిపి మెుత్తం 348 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవగా.. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు చేశారు. నేడు నామినేషన్ల పరిశీలన.. ఈనెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి 23 మంది నామినేషన్లు దాఖలు చేసారు.             నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్‌లో తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడించారు. అభ్యర్థుల్లో కొందరు అత్యంత ధనవంతులు ఉండగా.. మరికొందరు తమ చేతిలో చిల్లగవ్వ కూడా లేదని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు. వారి ఆస్తి విలువ వందల కోట్లలో ఉంది. అత్యధికంగా చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రూ.4,568 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్‌కు చెందిన 17 మంది అభ్యర్థుల్లో 12 మంది ఆస్తులు రూ.10 కోట్లకు పైగా ఉన్నాయి. బీజేపీలో 13 మంది, బీఆర్ఎస్‌లో 10 మంది ఆస్తుల విలువ రూ.పది కోట్లు దాటాయి.                               టాప్ -10 ధనవంతుల జాబితా (కోట్లలో)

కొండా విశ్వేశ్వర్ రెడ్డి (BJP) - రూ.4,568 కోట్లు
రంజిత్ రెడ్డి (CON) - రూ.435 కోట్లు
కాసాని జ్ఞానేశ్వర్ (BRS)- రూ. 228 కోట్లు
మాధవీలత (BJP) - రూ. 221 కోట్లు
నామా నాగేశ్వర్ రావు (BRS) - రూ. 155 కోట్లు
బీబీ పాటిల్ (BJP) - రూ. 151 కోట్లు
క్యామ మల్లేష్ ( BRS) - రూ. 145 కోట్లు
ధర్మపురి అర్వింద్ (BJP) - రూ. 109 కోట్లు
కంచర్ల కృష్ణారెడ్డి (BRS) - రూ. 83 కోట్లు
గాలి అనిల్ కుమార్ (BRS) - రూ. 82 కోట్లు
ప్రధాన పార్టీల్లో అత్యంత తక్కువ ఆస్తులున్న అభ్యర్థిగా నాగర్‌కర్నూల్‌కు చెందిన భరత్‌ప్రసాద్‌ ఉన్నారు. ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ రూ.33.85 లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్య (రూ.1.55 కోట్లు), నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ (రూ.1.41కోట్లు) ఆయా పార్టీల్లో తక్కువ ఆస్తులున్న అభ్యర్థులుగా నిలిచారు. సిట్టింగ్ ఎంపీలలో రంజిత్ రెడ్డి (CON) - రూ.435 కోట్లు ఆస్తులు వెల్లడించగా.. బండి సంజయ్ (BJP) రూ.1.12 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు


వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 1000 మందికి ఉచిత భోజనాలు   మే 28న మధ్యాహ్నం ఒంటి గంటకు ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ అడ్వైజర్ మరియు నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విటల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ గా కౌటికె విటల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, కార్యక్రమము కొంపెల్లిలోని శ్రీ వెన్ సాయి ప్రాజెక్ట్స్ దగ్గర నిర్వహించబడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు


 నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది! బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో లెక్క తేలింది! రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌

Wednesday, 24 April 2024

రెండు ఎంపీ సీట్లు గెలిచినా పదవికి రాజీనామా: మంత్రి కోమటిరెడ్డి

 

రెండు ఎంపీ సీట్లు గెలిచినా పదవికి రాజీనామా: మంత్రి కోమటిరెడ్డి

– పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా
– మాట నిలబెట్టుకుంటే డొక్కుకారును అమ్మి షెడ్లో కూర్చుంటావా కేసీఆర్ 
–  మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు
– ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మనుగడ  ప్రశ్నార్ధకం 
– కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను పూర్తి చేయిస్తా
– మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి
– ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ విఫలం
– ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ కు  మద్దతు
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి 
– సీపీఐ(ఎం),సీపీఐ మద్దతు కోరిన రఘువీర్ రెడ్డి
– ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.              నల్గొండ :రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రెండు ఎంపీ సీట్లు గెలిచినా  తన మంత్రి పదవికి రాజీనామా చేస్తా. కేసీఆర్ జగన్ తో గుమ్మక్కై ప్రాజెక్టులను ఎండబెట్టిండు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా మాట నిలబెట్టుకుంటే డొక్కు కారును అమ్మి షెడ్డు  లో  కూర్చుంటావా కెసిఆర్ అని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా  బుధవారం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వీటి కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం గడియారం చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..
10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసం కాలేశ్వరం కట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను ఎండ పెట్టాడని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటివారు  నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను కట్టి లెఫ్ట్ కెనాల్ ద్వారా నీరు అందించి ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి తో కుమ్మ కైనా కెసిఆర్ ప్రాజెక్టులను ఎండబెట్టడని మండిపడ్డారు. 10 సంవత్సరాలు  మంత్రిగా  పనిచేసిన పైసా పని చేయని పనికిమాలిన వాని గురించి మాట్లాడానని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. టీ న్యూస్ ఛానల్ లో ఎవరు  చూడాలని, టీవీ9 కి వచ్చి నాలుగు గంటలసేపు కెసిఆర్ మాట్లాడాడని ఎద్దేవ చేశారు. బిడ్డ కడిగిన ముత్యంలా బయటికి వస్తుందంటున్న కేసీఆర్, అసలు ఆడవాళ్లు మద్యాన్ని అమ్ముతారా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం దొంగ దీక్ష చేసిన కేసీఆర్ రాష్ట్రంలో రెండు సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇల్లు అయినా ఇచ్చారని  ప్రశ్నించారు. మూడు నెలల్లో రేవంత్ రెడ్డి 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశారని  పేర్కొన్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, మహిళలకు 2500 రూపాయలను ఇవ్వబోతున్నామని తెలిపారు. సీఎంతో పాటు మంత్రులమంతా టీం గా పనిచేస్తున్నామని, ఆయన ఎవరో చెప్పినట్టు.. ఈయన ఎవరో చెప్పినట్టు  ప్రభుత్వం పడిపోదు అన్నారు. పదేండ్లు  అధికారంలో ఉంటామని, సీఎం రేవంత్ రెడ్డి నే  ఉంటారని అన్నారు. 6 గ్యారంటీలలో 5 అమలు చేశామని మరొకటి కూడా  అమలు చేస్తామని అన్నారు. ఎక్కడ పేదవారు బాధపడ్డ తప్పక పోయి పని చేస్తానని రెండేళ్లలో ప్రతి ఊరును బంగారం లాగా చేస్తామని అన్నారు. ఇక్కడ పోటీ ఎవరూ లేరని, పోటీలో ఉన్నది స్వర్గంలో ఉన్న రావి నారాయణరెడ్డిని అని అన్నారు. గతంలో ఆయన గెలిచినట్లు అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అనంతరం రాష్ట్ర పౌరసరఫరాలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందని అన్నారు. వెంకట్ రెడ్డి కి సీఎం అర్హత ఉందంటూ భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి  కోమటిరెడ్డి కేంద్రం  నుంచి రూ.700 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం, రూ.280 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం, రూ.400 కోట్లతో నల్గొండ మున్సిపాలిటిని       అభివృద్ధి చేస్తున్నాడన్నారు. నల్గొండ లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ దక్కదని ఉత్తమ్ జోస్యం చెప్పారు. మోడీ నాయకత్వంలో ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్దకేమన్నారు. కెసిఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బీసీ, డిండి, బీ వెల్లెంలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తా మని చెప్పారు. 60 వేల ఎకరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల తర్వాత అవసరమైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. మిల్లర్లు తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..
ఇండియా కూటమిలో భాగంగా బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్ కు  ఇక్కడ కూడా మద్దతు ఇస్తున్నాం అన్నారు. దేశంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం లో  బీజేపీ పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలలో మార్పులు చేస్తుందని, ఉపాధి హామీ నిధులను తగ్గించిందని ఆరోపించారు ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని స్వయంగా ఒక మతాన్ని బలపరుస్తూ మరొక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విధానాలన్నింటిపై ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నామినేషన్ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి సీపీఐ(ఎం), సీపీఐ మద్దతును కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు  బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి సలీం, దండం పెళ్లి సత్తయ్య, తుమ్మల పద్మ, నెమ్మది వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, సీపీఐ(ఎం) నాయకురాలు మల్లు లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి పాల్గొన్నారు.

విద్యుత్ శాఖ అధికారి ఇంటిపై లంచం కేసులో ఏసీబీ సోదాలు


 

విద్యుత్ శాఖ అధికారి ఇంటిపై లంచం కేసులో ఏసీబీ సోదాలు

లంచం కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో తనిఖీలు.               :లంచం కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. 2023 సంవత్సరంలో కీసర విద్యుత్ ఏఈ గా పనిచేస్తున్న సమయంలో అనిల్ కుమార్ ఓ విషయమై 12 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు వల పన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు అప్పట్లో కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు బుధవారం అల్వాల్ లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో రూ. 34 లక్షల నగదు, 223 గ్రాముల బంగారంతో పాటుగా కోటి రూపాయల 76 లక్షల పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇంకా పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుందని ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు.

Tuesday, 23 April 2024

YLNS వాసవి నిత్యాన్నదాన సత్రము,వృధ్ధాశ్రమ ట్రస్ట ను ప్రారంభించిన శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి

 *YLNS వాసవి నిత్యాన్నదాన సత్రము,వృధ్ధాశ్రమ ట్రస్ట్





సురేంద్రపురి యాదగిరిగుట్ట నూతన భవన ప్రారంభోత్సవము మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం తేదీ 21-04-2024 ఆదివారం రోజున శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారి కరకములచే ప్రారంభించడం జరిగింది మరియు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమమును శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వాముల వారు ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి  వారి కరకములచే ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రములో అన్ని రాష్టాల నుండి వేలాది మంది ఆర్య వైశ్యులు పాల్గొన్నారు .ఈ ట్రస్ట్ లో అధునాతనమైన సౌకర్యాలతో 100 గదుల నిర్మాణం,ప్రతి రోజు నిత్యాన్న దాన కార్యక్రమం భోజనశాల కాన్ఫరెన్స్ హాల్, విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయిత రాములు అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి చీల విజయ్ కుమార్ కోశాధికారి మరియు పాలక వర్గం,ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారుఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు*

Monday, 22 April 2024

జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పగడాల మోహన్ కృష్ణను సస్పెండ్

 కారేపల్లి : కారేపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పగడాల మోహన్ కృష్ణను సస్పెండ్


చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ తన్నీరు శ్రీకాంత్ రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే సంతలో అవకతవకలు జరుగుతున్నట్లుగా డిప్యూటీ కమిషనర్ కు కొందరు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు డిసి శ్రీకాంత్ రావు ఆదివారం కారేపల్లి సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో డీసీ స్వయంగా పలు అవకతవకలను గుర్తించారు. 60 మేకల లోడుతో సంత నుండి బయటికి వచ్చిన వాహనాన్ని డీసీ స్వయంగా తనిఖీ చేశారు. 20 మేకలకు రుసుం చెల్లించి మిగతా వాటికి చెల్లించకుండా వెళ్తున్న విషయాన్ని గుర్తించారు.

ఆ వ్యాపారితో 4 500 రూపాయలు కట్టించి రసీదు ఇప్పించారు. రుసుము వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణతో పాటు, విచారణకు వచ్చిన అధికారులతో కూడా దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించారనే కారణాలతో జూనియర్ అసిస్టెంట్ పడాల మోహన్ కృష్ణను సస్పెండ్ చేస్తూ డీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను ఈవో శేషయ్య ద్వారా సోమవారం మోహన్ కృష్ణకు స్వయంగా అందజేయడానికి ఉన్నతాధికారులు పంపగా సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకోవడానికి మోహన్ కృష్ణ నిరాకరించారని ఈవో శేషయ్య తెలిపారు. నిరాకరించారు కాబట్టి సస్పెన్షన్ ఉత్తర్వులు రిజిస్టర్ పోస్టు ద్వారా మోహన్ కృష్ణకు పంపుతామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత తెలిపారు.

అధికార పార్టీ నాయకురాలి భర్త కావడంతో చర్చనీయాంశమైంది..

సస్పెన్షన్ కు గురైన పగడాల మోహన్ కృష్ణ భార్య అధికార కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకురాలుగా, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అనుచరురాలిగా ఉండడంతో ఈ సస్పెన్షన్ వ్యవహారం కారేపల్లి మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిన్న చిన్న కారణాలతో మోహన్ కృష్ణను సస్పెండ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఏదైనా దాగి ఉందనే విషయాలు కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాయకురాలు రాష్ట్ర స్థాయి నామినేట్ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో భర్త సస్పెండ్ గురి కావడం, సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా నిరాకరించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

Friday, 19 April 2024

వాళ్ళ టార్చర్ ‘మామూలు’గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..

 

వాళ్ళ టార్చర్ ‘మామూలు’గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..

ఏసీబీ అధికారులు ఎంతమంది అవినీతి అధికారంలో ఉన్న పట్టుకుంటున్నా.. మరింత మందిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నా.. కొందరిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. పని చేయాలంటే పైసలు ఇవ్వాల్సిందే..! ఫైలు కదలాలంటే జేబు నింపాల్సిందే..! అలా చేయకపోతే.. కార్యాలయం చుట్టూ తిరిగి కాళ్లు అరిగిపోవాలే తప్ప.. పని పూర్తి కాదు.     ఏసీబీ అధికారులు ఎంతమంది అవినీతి అధికారంలో ఉన్న పట్టుకుంటున్నా.. మరింత మందిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నా.. కొందరిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. పని చేయాలంటే పైసలు ఇవ్వాల్సిందే..! ఫైలు కదలాలంటే జేబు నింపాల్సిందే..! అలా చేయకపోతే.. కార్యాలయం చుట్టూ తిరిగి కాళ్లు అరిగిపోవాలే తప్ప.. పని పూర్తి కాదు. అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంటారే తప్ప.. మామూలు ఇవ్వనిదే కొంతమంది సంతకం పెట్టేందుకు ఇష్టపడరు. లంచం కోసం దరఖాస్తుదారులకు వాళ్ల టార్చర్ మామూలుగా ఉండదు మరి..!

         

మన బ్రతుకులు మారాలంటే బిఆర్‌ఎస్‌ రావాలి* * ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు పేర్కొన్నారు..*



*రేవంత్ రెడ్డి జూటకోర్..*


*నిజామాబాద్‌ సెగ్మెంట్‌తో సహా 10సీట్లు గెలుస్తున్నాం*


*కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అబద్ధపు మాటలు చెప్పి ఓట్ల దండుకునేలా చూస్తున్నారు..*


*ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారు..*


*కమలం పువ్వు చెవిలో... కాంగ్రెస్ చెయ్యి నెత్తిన.. ప్రజలను నిండాముంచాలని చూస్తున్నారు..*



*ఎంపి ఎలక్షన్‌లో గెలిస్తేనే కేసిఆర్‌కి బలం*


*కేంద్రంలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉంది

బిజేపిని కొట్టేది బిఆర్‌ఎస్‌ ఒక్కటే*


*మన బ్రతుకులు మారాలంటే బిఆర్‌ఎస్‌ రావాలి*


* ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు పేర్కొన్నారు..*








*నిజామాబాద్ జిల్లా పాత కలెక్టరేట్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ....* బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను ప్రజలు గమనిస్తున్నారు.. బిజెపి అభ్యర్థి ఇంతకుముందు జిల్లాకు ఎంపీగా ఉన్నాడు. ప్రజలకు హామీ ఇచ్చాడు పసుపు బోర్డు తెస్తానని..ఇప్పటికి నెరవేర్చలేదు.. ప్రజలు గమనిస్తున్నారు.. ప్రొద్దున లేస్తే పాకిస్తాన్, ఇండియా, హిందూ, ముస్లిం, రోహిన్యా, బంగ్లాదేశ్, వాక్యానించడమే తప్ప ప్రజలకు చేసింది శూన్యం... రామ నామం పేరు చెప్పుకొని.. రాజకీయం చేయడం.. తప్ప ప్రజలకు మేలుచేసింది శూన్యం.. మనమందరం రాముని కొలుస్తాం... రాజ్యం కోసం రాముడు ఏం చేశాడో తెలుసుకొని.. రాముని యొక్క ఆచరణలు అవలంబించాలి.. రాముడు గురించి తెలుసా.. బిజెపి నాయకులకు.. రాముడు మంచి తండ్రి. ఒక అన్న, ఒక భర్త, ఒక పరిపాలకుడు, మహా పురుషుడు రాముడు యొక్క లక్షణాలు... కానీ మోడీ ప్రభుత్వం.. ధనవంతులకు ఇంకా ధనవంతుల్నిగా మారుస్తుంది పేదవాడు పేదవాడిగానే మిగులుతున్నాడు.. 15 లక్షలు ఇస్తానన్నాడు ఒక్కొక్కరికి ఎక్కడ.. నల్లధనాన్ని వెలికి తీస్తానన్నాడు ఎక్కడ... 


దేశంలో ఎక్కడా లేదు.. ఒకే కుటుంబంలో ఇద్దరు ఎంపీలు ఉండటం... జిల్లా ప్రజలకు చేసింది శూన్యం... ఐదు సంవత్సరాలు సమయాన్ని వృధా చేసిన ఎంపి అరవింద్ మరియు అతని తండ్రి... ఇలాంటి వ్యక్తులకు.. ఎంపీ ఎలక్షన్లో.. మోడీని అడ్డం పెట్టుకొని.. ఓట్లు దండుకోవడానికి ప్రచారం చేస్తున్నాడు.. దేశంలో ఎక్కడ లేదు ఎంపీ గానీ గ్రామాల్లోకి వస్తే తరమింది... కానీ మన ఎంపీ ని గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టారు... కారణం అబద్దం మాటలు చెప్పడం.. గ్రామాలకు చేసింది శూన్యం.. అందుకని ప్రజలు తిరగబడ్డారు..కావున ప్రజలారా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పాలి అని తెలిపారు.


కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి... పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగస్తుల.. ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నుకొని.. జిల్లాకు ఉద్యోగస్తులకు చేసింది ఏంది.. నిజాంబాద్ జిల్లాలో ఏ ఒక్కనాడు అయినా మన గ్రామాలకు మంచి చెడుకు వచ్చాడా.. ఐదేళ్లు ఎమ్మెల్సీగా ఉండి చేయలేదు ఇప్పుడు ఎంపీగా ఏం చేస్తాడో చెప్పాలి... రేవంత్ రెడ్డి జూట కోర్... 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం... పూటకు ఒక మాట.. మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ..ప్రభుత్వం ఏర్పడంగనే రుణమాఫీ చేస్తానన్నావు.. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 135 రోజులు గడుస్తున్న రుణమాఫీ లేదు... మళ్లీ ఆగస్టు 15.. చేస్తానని మల్లోసారి అబద్ధం ప్రచార మోసపూరిత మాటలు.. చెప్తున్నాడు.. ఈ యొక్క మోసపూరిత మాటలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు...కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అబద్ధపు మాటలు చెప్పి ఓట్ల దండుకునేలా చూస్తున్నారు వారి మోసపూరిత మాటలు నమ్మకండని బీఅర్ ఎస్ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.


ప్రజలు 40 సంవత్సరాలు నుండి నన్ను ఆదరిస్తున్నారు కాబట్టే రాజకీయంలో రాణిస్తున్నాను.. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో నిజామాబాద్ ప్రజలు ఆదరిస్తారని. టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశిస్తున్నారు అని తెలిపారు.

ఈసారి ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే.. నిజామాబాద్ రూపు రేఖల్ని మార్చేస్తా.. పార్లమెంట్లో కొట్లాడి.. నిజామాబాద్ జిల్లాకు నిధులు తీసుకువస్తా... ఏదైతే ఆర్మూర్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కోట్లాడి ఆర్మూర్ కు లిఫ్ట్ ఇరిగేషన్.. బైపాస్ రోడ్లు.. హైవే బ్రిడ్జిలు.. తీసుకొచ్చిన ఘనత నాకు ఉందని ఆయన గుర్తు చేశారు. అదే పోరాటం అదే స్ఫూర్తి నాలో ఇంకా ఉందని ఆయన గుర్తు చేశారు.

కావున వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి సేవకుడిగా పని చేస్తా నిజామాబాద్ జిల్లాలో ఏవైతే పెండింగ్ లో ఉన్న పనులన్నీ తొందరగా కంప్లీట్ చేస్తాను అని ఆయన పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్,శ్రీనివాస్ గౌడ్,మహముద్, ప్రశాంత్ రెడ్డి, గౌరవ రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి గారు గౌరవ బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు,కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ విట్టల్ రావు,  బోధన్ మాజీ శాసన సభ్యులు శ్రీ షకీల్ ఆమెర్ గారి సతీమణి అయేష సుల్తానా గారు, జగిత్యాల జడ్పీ చైర్మన్ శ్రీమతి దావ వసంత, ప్రభాకర్ రెడ్డి NUDA అలీం,LMB రాజేశ్వర్,లోక బాపు రెడ్డి, జిల్లా యువ నాయకులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి జడ్పిటిసిలు, ఎంపీపీలు, పిఎసిఎస్ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, మండలల అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఉపసర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల యువజన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్.





 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్.

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్

 

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్

 

ACB | ఓ భూమిని ఎల్‌ఆర్‌ఎస్‌(LRS) చేయడం కోసం టీపీఎస్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ.15 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు(ACB) వలపన్ని పట్టుకున.

హైదరాబాద్‌ : ఓ భూమిని ఎల్‌ఆర్‌ఎస్‌(LRS) చేయడం కోసం టీపీఎస్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ.15 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు(ACB) వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్‌ కార్యాలయంలో(Palvancha Municipality) గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాల్వంచ మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌(టీపీఎస్‌)గా(Town planning supervisor) పని చేస్తున్న వెంకటరమణి, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ ఓ భూమి విషయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ చేయడం కోసం ప్లాట్‌కు రూ.10 వేల చొప్పున మూడు ప్లాట్లకు రూ.30 వేలు డిమాండ్‌ చేశారు. తాను రూ.30 వేలు ఇవ్వలేనని, ప్లాట్‌కు రూ.5 వేల చొప్పున.. రూ.15 వేలు ఇస్తామని పాల్వంచకు చెందిన భూ యజమాని కాంపెల్లి కనకేష్‌ సదరు ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

తర్వాత ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించిన కనకేష్‌.. వారి సూచన మేరకు గురువారం టీపీఎస్‌కు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి రూ.15 వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ వెల్లడించారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.