TG ACB : పెట్రోల్ బంక్ ఎన్‌వోసీ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు
- TG ACB : జనగామ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇదివరకే మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ ఏఈ ఏసీబీకి చిక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా.. పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఆర్‌అండ్‌బీ ఈఈ లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు.
ఏసీబీకి పట్టుబడిన అధికారులు
హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ.. జనగామ జిల్లా లింగాల ఘనపూర్‌లో కొత్తగా పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం గత సంవత్సరం జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో లింగాల ఘనపూర్‌కు చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్ చిర్ర సత్యనారాయణ రెడ్డి.. తన భార్య పేరున పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు దరఖాస్తు పెట్టుకున్నారు. సంబంధిత అధికారులు డ్రా పద్ధతిన ఆమెకు బంక్ అలాట్ చేశారు.
ఈఈకి రూ.12 వేలు.. ఏటీవోకు రూ.2 వేలు..
బంక్ అలాట్‌మెంట్ అనంతరం సంబంధిత లబ్ధిదారులకు సంస్థకు ఛలానా కట్టడంతో పాటు.. వివిధ శాఖల నుంచి క్లియరెన్స్, ఎన్‌వోసీలు తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు సంస్థ నుంచి ఎన్‌వోసీ కోసం వరంగల్ పోలీస్ కమిషనర్‌కు లెటర్ ఇవ్వగా.. అక్కడి నుంచి రిమార్క్స్ ఏమైనా ఉంటే చెప్పాలని సీపీ.. జనగామ ఆర్ అండ్ బీ ఈఈతో పాటు వరంగల్ వెస్ట్ జోన్ ఏసీపీ, జనగామ డీపీవోకు లెటర్ రాశారు. ఆర్ అండ్ బీ ఈఈ చిలకపాటి హుస్సేన్ ఎన్వోసీ ఇవ్వాల్సి ఉండగా.. అందుకు ఆయన రూ.12 వేల లంచం డిమాండ్ చేశాడు.
.అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ రవీందర్‌కు రూ.2 వేలు ఇవ్వాల్సిందిగా సూచించాడు. కానీ ఎక్స్ సర్వీస్‌మెన్‌గా పని చేసిన సత్యనారాయణ రెడ్డికి లంచం ఇచ్చేందుకు మనసు ఒప్పలేదు. దీంతో నేరుగా వరంగల్ నగరంలోని ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను సంప్రదించాడు. జరిగిన విషయాన్ని మొత్తం ఆయనకు వివరించాడు. అవినీతి అధికారుల ఆట కట్టించేందుకు డీఎస్పీ సాంబయ్య సూచన మేరకు.. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఈఈ హుస్సేన్ అడిగిన రూ.12 వేలు, ఏటీవోకు రూ.2 వేలు ఇచ్చేందుకు.. డబ్బులు తీసుకుని జనగామ కలెక్టరేట్‌లోని వారి ఆఫీస్‌కు వెళ్లాడు. వారు అడిగినంత వారి చేతుల్లో పెట్టాడు. అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్న ఏసీపీ డీఎస్పీ సాంబయ్య టీమ్.. వెంటనే రంగంలోకి దిగింది. లంచం తీసుకున్న హుస్సేన్ తోపాటు ఏటీవోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు అధికారులను శనివారం వరంగల్ లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య వివరించారు. లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వ అధికారుల్లో మార్పు రావడం లేదని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి
- TG ACB : జనగామ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇదివరకే మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ ఏఈ ఏసీబీకి చిక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా.. పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఆర్‌అండ్‌బీ ఈఈ లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు.
No comments:
Post a Comment