Saturday, 14 September 2024

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు స్వస్తి..

                                     సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు స్వస్తి..

అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలకు స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయాలు తీసుకోనుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి అనగని సత్య ప్రసాద్ ప్రతిపాదనలు చేశారు.

                                సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు స్వస్తి..

అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలకు స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయాలు తీసుకోనుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా (Revenue Department Special CS Sisodia), మంత్రి అనగని సత్య ప్రసాద్ (Minister Anagani Satya Prasad) ప్రతిపాదనలు చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు నేపథ్యంలో తాము గమనించిన ఆఫీస్ సెటప్‌లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించి.. అమలుకు సర్క్యులర్ (Circular) జారీ చేశారు.

                    అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఆరేంజ్‌మెంట్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేననే భావన కలిగేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్‌కు ఉన్న ఎత్తైన పోడియం సీటింగ్ చుట్టూ వున్న రెడ్ క్లాత్ తొలగించాలని ఆర్‌పి సిసోడియా అదేశించారు. సబ్ రిజిస్ట్రార్ చైర్ కూడా ఫ్లోర్ హైట్‌లో ఉండాలని.. ఆయన చుట్టూ ఎలాంటి పార్టిషన్ ఉండకూడదని ఆదేశించారు. భూములు రిజిస్ట్రేషన్‌ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే సామాన్య ప్రజలకు ఆఫీస్‌లో అత్యధిక గౌరవం ఉండాలని, రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యే వరకు వచ్చినవారు నిలబడి వుండే విధానానికి స్వస్తి పలకాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అయితే వారికి టీ, మంచి నీరు ఆఫర్ చేసి గౌరవించాలని రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఆదేశిస్తూ.. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు.

                    కాగా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఇక నుంచి ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. సబ్‌రిజిస్ర్టార్లు కూర్చునే కుర్చీ ఎత్తు తగ్గించడమే కాకుండా, వారి ముందుండే పోడియంను ఎత్తేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సబ్‌రిజిస్ర్టార్‌ ముందు ఉండే పోడియం చెక్కతో ఉంటుంది. దాని చుట్టూ ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది. సబ్‌రిజిస్ర్టార్‌ కుర్చీ, ఆ వ్యక్తి ముందుండే టేబుల్‌ చుట్టుపక్కల ఉన్న ఫ్లోరింగ్‌ కంటే కొంచెం ఎత్తులో ఉంటాయి. రిజిస్ర్టేషన్‌ కోసం వచ్చిన ప్రజలు వారి కంటే ఎత్తులో ఉన్న సబ్‌రిజిస్ర్టార్‌ పోడియం ముందు నిలబడి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ విధానం అమర్యాదరకరంగా ఉందని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెంచేలా ఉందని రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా అభిప్రాయపడ్డారు.

             రిజిస్ర్టేషన్ల ద్వారా ప్రభుత్వానికి పన్నులు కడుతున్న ప్రజలకు, సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొంటూ శనివారం ఆయన ఒక మెమో జారీ చేశారు. తక్షణమే సబ్‌రిజిస్ర్టార్‌ ముందుండే చెక్క, ఎర్రని వస్త్రంతో ఉన్న పోడియంను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ తొలగించాలని ఆదేశించారు. సబ్‌రిజిస్ర్టార్‌ కుర్చీని కూడా ఎత్తులో కాకుండా సాధారణ ఫ్లోరింగ్‌ ఎత్తులోనే ఉండాలని పేర్కొన్నారు. సబ్‌రిజిస్ర్టార్‌ ముందు సరిపడా కుర్చీలు అందుబాటులో ఉంచడం ద్వారా రిజిస్ర్టేషన్‌కి వచ్చిన ప్రజలు కూర్చుని రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సబ్‌రిజిస్ర్టార్‌కి ప్రజలకు మధ్య టేబుల్‌తప్ప మరేమీ అడ్డంగా ఉండకూడదని చెప్పారు. ఇటీవల సిసోడియా, రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి సత్యప్రసాద్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించారు.

No comments:

Post a Comment