టీయూడబ్ల్యూజేతోనే
చిన్న పత్రికల మనుగడ
తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు
హైదరాబాద్ :
టీయూడబ్ల్యూజే- ఐజేయూతోనే చిన్న పత్రికల మనుగడ సాధ్యమని తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు అన్నారు. నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం కోసం పరితపిస్తూ అవిశ్రాంతంగా కృషి చేస్తూ చిన్న పత్రికల మనుగడకు కొండంత అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంఘంతోనే తమకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం ఉందన్నారు. బుధవారం సాయంత్రం నల్గొండ జిల్లాకు చెందిన 10 మంది సీనియర్ చిన్న పత్రికల సంపాదకులు , 143, ఇతర సంఘాలకు రాజీనామా చేసి, బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో యూసుఫ్ బాబు సమక్షంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూకి అనుబంధ సంఘమైన తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ లోకానికి మార్గదర్శకులు, ఐజేయూ జాతీయ అధ్యక్షులు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి మన సమస్యలపై పూర్తి అవగాహన ఉండటం,చిన్న పత్రికల పక్షపాతిగా ఉన్న మన సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ సహకారం ఉన్నందువల్ల మన పత్రికలు మరింత పురోగతి సాధిస్తాయన్నారు. ఇటీవల జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ జర్నలిస్ట్స్ అటాక్స్ కమిటీ సభ్యులుగా ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మన సంఘం రాష్ట్ర నాయకులు దాస్ మాతంగిని నియమించడం
అభినందనీయమన్నారు. జాతీయ, రాష్ట్ర కమిటీలకు కృతజ్ఞతలు తెలుపుతూ అసోసియేషన్ పక్షాన మాతంగి దాస్ ని శాలువాలతో ఘనంగా
సన్మానించారు. ఇదే ఉత్సాహం, సమిష్టి కృషితో మన సమస్యలు పరిష్కరించుకొనే దిశగా సాగుదామన్నారు. కలసి ఉంటే కలదు సుఖమన్న చందంగా మనందరం ఒకే గొడుగు కిందికి రావడం శుభపరిణామమన్నారు. సంఘంలో చేరిన ప్రజా సౌమ్యం సంపాదకులు వెన్నమళ్ల రమేష్ బాబు, వార్తా ప్రవాహం ఎడిటర్ వేమిరెడ్డి సుభాష్ రెడ్డి, వేముల ఎక్స్ ప్రెస్ ఎడిటర్
వేముల వెంకన్న, పురపాలక దీపిక ఎడిటర్ సంద్యాల విద్యాసాగర్, కీర్తీ వాయిస్ ఎడిటర్ మధు, అన్వేషి
సంపాదకులు అన్నెబోయిన మట్టయ్య, స్టూడెంట్ లైఫ్ ఎడిటర్ బి. బుచ్చయ్య, గిరిజన సంస్కృతి ఎడిటర్ ధర్మానాయక్ తదితరులు సంఘం తీర్థం పుచ్చుకున్నారు.అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి అజం ఖాన్,రాష్ట్ర నాయకులు మాతంగి దాస్ , వెంకటయ్య, కలకొండ రామకృష్ణ, అహ్మద్ అలీ, మక్సూద్ , యాదయ్య , చంద్ర శేఖర్, కొమరాజు
శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే చిన్న మధ్యతరహా పత్రికల ప్రధాన సమస్యలైన ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడిటేశన్ కార్డులు, అప్ గ్రేడింగ్, యాడ్ లు, బిల్లులు తదితర అంశాలపై చర్చించి తగు కార్యాచరణతో ముందుకు సాగుటకు నిర్ణయించనైనది.
No comments:
Post a Comment