Monday, 30 September 2024

ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించండి - ఆర్యవైశ్య ఐక్యవేదిక

 

ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించండి - ఆర్యవైశ్య ఐక్యవేదిక


నల్గొండ, (నీలగిరి శంఖారావం ప్రతినిధి) 30-09-2024:  ఆర్యవైశ్య ఐక్యవేదిక ఆద్వర్యం లో ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించాలని కోరుతూ నల్లగొండ జిల్లా కలెక్టర్ కు సోమవారం కలెక్టరేట్ లో వినతి ప్రత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రం లో ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించడం ద్వారా పేద ఆర్యవైశ్య కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా, పేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కార్పొరేషన్ పనిచేసేలా ఆర్ధిక వనరులు సమకూర్చాల్సిందిగా కోరారు. దీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల డిమాండ్ను గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయడాన్ని ఆర్యవైశ్యులంతా స్వాగతిస్తున్నామని, అయితే ఇదే క్రమంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానికి ఎలాంటి నిధులు కేటాయింపు చేయకపోవడం వల్ల నిరుపయోగంగా మారిన పరిస్థితి ఏర్పడిందని,  కేవలం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు మాత్రమే చేసి ఆ కార్పొరేషను నిధుల కేటాయింపు చేయక పోవడం వల్ల కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్యులకు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఆర్యవైశ్య కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదనీ పేర్కొన్నారు . కార్పొరేషన్ ఏర్పాటు అయితే తమకు కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని ఋణాలు, సబ్సిడీతో కూడిన ఋయాలు, నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఎంతో లబ్దిచేకూరుతుందని భావించిన పేద ఆర్యవైశ్యులకు నిధుల కేటాయింపు చేయకపోవడం తీవ్ర బాధను కలిగిస్తుందని, నిధుల కేటాయింపు లేని కారణంగా కార్పొరేషన్ ద్వారా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని కార్పొరేషన్ ఏర్పాటు, దానికి చైర్మన్ నియామకం చేసినప్పటికీ నిధుల కేటాయింపు లేకపోవడం పేద ఆర్యవైశ్యులకు తీరని అన్యాయం కలిగితుందని అన్నారు. అంతేకాకుండా ఎన్నో ఆశల తో కార్పొరేషన్ ద్వారా తమ కుటుంబాల ఆర్ధికస్థితి మారుతుందని భావించిన నిరుపేద ఆర్యవైశ్యులు, చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ కు కనీసం 100 కోట్ల రూపాయల నిధిని కేటా యించడంతో పాటు కార్పొరేషన్ తరపున పేద ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఋణాలు, సబ్సిడీ తో కూడిన ఋణాలు ఇవ్వడంతో పాటు వైద్య సహాయం కోసం పేద ఆర్యవైశ్యులకు ఆర్ధిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం స్పందించి 100 కోట్ల రూపాయల నిధిని ఆర్యవైశ్య కార్పొరేషన్కు కేటా యించి తెలంగాణ రాష్ట్రంలోని చిరు వ్యాపారాలు, పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి, సంక్షేమం, అభివృద్ధి కోసం కార్పొరేషన్ పనిచేసే విధంగా వెంటనే నిధుల కేటాయింపు చేయాలని  ప్రభుత్వాన్ని ప్రత్యే కంగా కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో నల్గొండ అశోక్ ,K రామకృష్ణ, దుండిగళ్ల ఓం ప్రసాద్, మిరియాల మహేష్,  నీలా చంద్రశేఖర్, రవి,  వెంకన్న తదితరులు ఉన్నారు


No comments:

Post a Comment