HMDA | ఎస్‌ఎఫ్‌టీకి 200 ఇస్తేనే అనుమతి.. అయ్యగారికి సమర్పించుకోలేక చేతులెత్తేస్తున్న బిల్డర్లు! ‘మీ లేఅవుట్లకు అనమతులు కావాలా.. అయితే ఫలానా సార్‌ను కలిసి రండి. ఆయనే చూసుకుంటారు. ఫైలు ఇక్కడే ఇవ్వండి.. క్లియరెన్స్ మాత్రం అక్కడ చేసుకొని రండి’ ఇదీ ఇటీవల రాష్ట్రంలోని కొందరు రియల్టర్లు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితి.
HMDA | ఎస్‌ఎఫ్‌టీకి 200 ఇస్తేనే అనుమతి.. అయ్యగారికి సమర్పించుకోలేక చేతులెత్తేస్తున్న బిల్డర్లు!
ఆ సారే ప్రాపర్ చానల్.. ఆయనను కలవాల్సిందే
హెచ్‌ఎండీఏలో నిర్మాణాల ఫైళ్లు క్లియర్ చేసేది ఆయనే
ఎస్‌ఎఫ్‌టీకి కనిష్ఠంగా రూ.40.. గరిష్ఠంగా 200 వసూలు
HMDA | హైదరాబాద్, : ‘మీ లేఅవుట్లకు అనమతులు కావాలా.. అయితే ఫలానా సార్‌ను కలిసి రండి. ఆయనే చూసుకుంటారు. ఫైలు ఇక్కడే ఇవ్వండి.. క్లియరెన్స్ మాత్రం అక్కడ చేసుకొని రండి’ ఇదీ ఇటీవల రాష్ట్రంలోని కొందరు రియల్టర్లు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితి. డైరెక్ట్‌గా లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల కోసం ఎవరైనా వెళ్తే పనులు అవ్వడం లేదక్కడ..‘ త్రూ ప్రాపర్ చానల్’ అంటూ అక్కడి ఉన్నతాధికారులే ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి నంబర్, అడ్రస్ ఇచ్చి పంపుతున్నారు.
ఆ సార్ అన్నీ పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి ఉండే కండీషన్లు చెప్తారు. ఆ కండీషన్లు ఓకే అయితే.. ఫైలు తీసుకోవాలని హెచ్‌ఎండీఏ/జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు ఇస్తారు. గడిచిన పది నెలలుగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల పరిధిలో ఇదే వ్యవహారం నడుస్తున్నది. దీనిని ఎవరూ ప్రశ్నించే సాహసమే చేయడంలేదు.
చదరపు అడుగుకు రూ.40 వసూలు..
ఏదైనా అపార్ట్‌మెంట్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌కు అనుమతులు రావాలంటే ఆ ప్రైవేటు రియల్టర్ (సార్)కు మొక్కు చెల్లించుకోవాలి. ఆ వ్యక్తి రాష్ట్రంలోని ముఖ్యనేతకు దగ్గరి బంధువు అని తెలిసింది. ఆ ముఖ్యనేతకు రియల్‌ఎస్టేట్‌లో కూడా భాగస్వామిగా ఉన్న ఆయనే ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్నది నిర్ణయించి, ఎక్కడ ఇవ్వాలో కూడా చెప్తారట. అంతా పూర్తయ్యాక ఆటోమెటిగ్గా అధికారుల నుంచి ‘మీ ఫైల్‌పై సంతకాలు పూర్తయ్యాయి’ అంటూ ఫోన్లు వస్తాయి. భవనం, అది ఉన్న లొకేషన్ ఆధారంగా కనిష్ఠంగా చదరపు అడుగుకు రూ.40 వసూలు చేస్తున్నట్టు బిల్డర్లు చెప్తున్నారు. 50వేల చదరపు అడుగుల భవనానికి అయితే ఒక ధర.. లక్ష చదరపు అడుగులు దాటితే మరో ధర అడుగుతున్నారు.
అయిదు లక్షల చదరపు అడుగుల భవనాలకైతే ఏకంగా ల్యాండ్‌షేర్ లేదా తమ వారికి కొంతభాగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.40 నుంచి మొదలయ్యే బేరం రూ.100 వరకు వెళ్తున్నది. ఇది కేవలం కొత్తగా నిర్మించే భవనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఫ్లాట్ (అపార్ట్‌మెంట్లు)కు ఒక ధర, విల్లా ప్రాజెక్టులకు మరో ధర పెట్టారు. విల్లా ప్రాజెక్టులు అయితే చదరపు అడుగుకు కనీసం రూ.60 నుంచి మొదలవుతుంది. అదే లేఅవుట్ అయితే ధర మారుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయిస్తున్నారు. కనీసం రూ.200 తగ్గకుండా చదరపు గజానికి వసూళ్లు చేస్తున్నారు.
కంగుతింటున్న రియల్టర్లు
కొత్త సర్కారు వచ్చిన తర్వాత రియల్‌ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్నవారిని ప్రోత్సహించాల్సిందిపోయి వసూళ్ల దందా మొదలుపెట్టడం ఏమిటని రియల్టర్లు వాపోతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంలో కీలక పాత్ర పోషించిన మరో ముఖ్యమైన నాయకుడు కూడా ఇప్పు డు అనుమతుల ప్రక్రియలో క్రియాశీలకంగా ఉన్నారు.
ఆయనతోపాటు మరో యువ కిషో రం కూడా వసూళ్ల పనిలో నిమగ్నమయ్యాడని వినికిడి. వీరి నుంచి ఫోన్ వచ్చిన తర్వాతనే ఫైళ్లు కదులుతున్నాయని వినికిడి. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా ఇలాంటి పోకడలు చూడలేదని, ఇప్పుడేమో ముక్కుపట్టి వసూళ్లు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ వసూళ్లను భరించలేక చాలా మంది బిల్డర్లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు.
No comments:
Post a Comment