Friday, 6 September 2024

తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల పాటు మోస్త‌రు వ‌ర్షాలు..!

 

 తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల పాటు మోస్త‌రు వ‌ర్షాలు..!

 

TG Rains | గ‌త వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. మ‌రో రెండు పాటు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది.

ఈ నెల 7, 8వ తేదీల్లో య‌తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇక గంట‌కు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంది.

క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మ‌ల్, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, వికారాబాద్, సంగారెడ్డి, మెద‌క్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నారాయణ‌పేట‌, గ‌ద్వాల్, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌న్నారు.


No comments:

Post a Comment