Friday, 27 September 2024

హైడ్రా భయం తో మహిళ ఆత్మహత్య..క్లారిటీ ఇచ్చిన రంగనాధ్

 హైడ్రా భయం తో మహిళ ఆత్మహత్య..క్లారిటీ ఇచ్చిన రంగనాధ్


కూకట్ పల్లి పరిధిలో హైడ్రా భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం ఫై హైడ్రా కమిషనర్ రంగనాధ్ క్లారిటీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగా ఇళ్లు కూల్చివేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించడం తో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఉరేసుకుని చనిపోయారు. కాగా ప్రతి రూపాయి పోగేసి కట్టిన 3 ఇళ్లను ముగ్గురు కూతుళ్లకి కట్నంగా ఇచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు కూల్చేస్తామని చెప్పడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.



కాగా మహిళ ఆత్మహత్యకు, హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘మూసీ పరివాహక ప్రాంతంలో శనివారం భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీకి సంబంధించి ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. మేం ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు’ అని తెలిపారు.


No comments:

Post a Comment