Sunday, 1 September 2024

రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్-10 కుబేరులు వీరే

                                             రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్-10 కుబేరులు వీరే

 

            భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అత్యధిక జనాభా ఉండటం దేశానికి వరంగా పరిణమించింది. దీంతో కొత్త కొత్త ఆలోచనలతో, సరికొత్త అంకురాలతో యువత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఘనవిజయాలను అందుకుంటోంది. అందులోను ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో భాగ్యవంతుల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే కుబేరులకు భాగ్యనగరం అడ్డాగా మారుతోంది. ఈ విషయంలో బెంగళూరును కూడా వెనక్కి నెట్టింది.

                    మనదేశంలో ఎక్కువమంది బిలియనీర్లు నివసిస్తున్న నగరాల్లో హైదరాబాద్ మూడోస్థానం దక్కించుకుంది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ఈ జాబితాను వెల్లడించింది. నగరాల పరంగా ముంబయి నగరం అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, రాష్ట్రాల పరంగా కుబేరులు ఎక్కువగా ఉన్న తెలంగాణకు ఐదోస్థానం దక్కింది. దివీస్ ల్యాబరేటరీ వ్యవస్థాపకులు మురళి దివి హైదరాబాద్ నగరంలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.76.100 కోట్లుగా ఉంది. హైదరాబాద్ లో 104 మంది బిలియనీర్లు ఉన్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2024 జాబితాలో రాఘవ కన్ స్ట్రక్షన్ కు చెందిన హర్షరెడ్డి పొంగులేటి (30) అతి పిన్న వయస్కుడైన కుబేరుడిగా చోటు సంపాదించుకున్నారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ నికర ఆదాయం రూ. 1300 కోట్లు.

హైడ్రా వెనక కోబ్రా.! దివీస్ లేబొరేటరీస్ - మురళి దివి - రూ.76,100 కోట్లు మేఘా ఇంజనీరింగ్ - పి.పిచ్చిరెడ్డి - రూ.54,800 కోట్లు మేఘా ఇంజనీరింగ్ - పి.వి.కృష్ణారెడ్డి - రూ.52,700 కోట్లు హెటెరో లాబ్స్ - బి.పార్థసారధి రెడ్డి - రూ.29,900 కోట్లు అపర్ణ కన్ స్ట్రక్షన్స్ - ఎస్.సుబ్రమణ్యంరెడ్డి - రూ.22,100 కోట్లు అపర్ణ కన్ స్ట్రక్షన్స్ - సి.వెంకటేశ్వరరెడ్డి - రూ.21,900 కోట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ - ఎం.సత్యనారాయణరెడ్డి - రూ.18,500 కోట్లు మైహోం ఇండస్ట్రీస్ - జూపల్లి రామేశ్వరరావు - రూ.18,400 కోట్లు డాక్టర్ రెడ్డీస్ - కె.సతీష్ రెడ్డి - రూ.18,100 కోట్లు బయోలాజికల్ ఇ - మహిమ దాట్ల - రూ.13,600 కోట్లు

హైడ్రా వెనక కోబ్రా.! 

దివీస్ లేబొరేటరీస్ - మురళి దివి - రూ.76,100 కోట్లు

 మేఘా ఇంజనీరింగ్ - పి.పిచ్చిరెడ్డి - రూ.54,800 కోట్లు

 మేఘా ఇంజనీరింగ్ - పి.వి.కృష్ణారెడ్డి - రూ.52,700 కోట్లు 

హెటెరో లాబ్స్ - బి.పార్థసారధి రెడ్డి - రూ.29,900 కోట్లు

 అపర్ణ కన్ స్ట్రక్షన్స్ - ఎస్.సుబ్రమణ్యంరెడ్డి - రూ.22,100 కోట్లు

 అపర్ణ కన్ స్ట్రక్షన్స్ - సి.వెంకటేశ్వరరెడ్డి - రూ.21,900 కోట్లు 

ఎంఎస్ఎన్ ల్యాబ్స్ - ఎం.సత్యనారాయణరెడ్డి - రూ.18,500 కోట్లు 

మైహోం ఇండస్ట్రీస్ - జూపల్లి రామేశ్వరరావు - రూ.18,400 కోట్లు

 డాక్టర్ రెడ్డీస్ - కె.సతీష్ రెడ్డి - రూ.18,100 కోట్లు 

బయోలాజికల్ ఇ - మహిమ దాట్ల - రూ.13,600 కోట్లు





No comments:

Post a Comment