Monday, 9 September 2024

Hyderabad: హైదరాబాద్‌లో స్థలాలు, ఇళ్లు కొంటున్నారా.? ఇవిగో హైడ్రా కీలక సూచనలు

 

Hyderabad: హైదరాబాద్‌లో స్థలాలు, ఇళ్లు కొంటున్నారా.? ఇవిగో హైడ్రా కీలక సూచనలు

హైడ్రా కూల్చివేతలపై వివరణ ఇస్తూ కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, ఇళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని ఆయన తెలిపారు.

హైడ్రా కూల్చివేతలపై వివరణ ఇస్తూ కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, ఇళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని ఆయన తెలిపారు. కొనేముందు ఒకట్రెండు సార్లు డాక్యుమెంట్లు పరీశిలన చేయాలని సూచించారు. ఎలాంటి అనుమానాలున్నా వెంటనే HMDAను సంప్రదించాలన్నారు. ప్రస్తుతం తాము ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణ దశలో ఉన్నవాటిని మాత్రం కూల్చివేస్తున్నామని.. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూడా కూల్చబోమని ఆయన స్పష్టం చేశారు. దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించనుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. బోరబండ సున్నం చెరువు, మల్లంపేట్ కత్వ చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు విరుచుకుపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలను నేలమట్టం చేశారు. మరోవైపు అక్రమాల కూల్చివేతలు జరుగుతుండగా… పలుచోట్ల ఆందోళనలు మిన్నంటాయి. తమకు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఆవేదన చెందుతున్నారు.

No comments:

Post a Comment