Sunday, 1 September 2024

ట్రైన్ పట్టాలు తప్పించే ప్రయత్నం

 ఆగస్టు 17న కాన్పూర్‌లోని గోవింద్‌పురి స్టేషన్‌కు సమీపంలో ఒక బ్లాక్ ని పట్టాలపై ఉంచి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని 20 కోచ్‌లు పట్టాలు తప్పించడానికి  చేసిన ప్రయత్నానికి సంబంధించి విచారణ ఇంకా జరుగుతూ వుండగానే, 

గత వారం ఉత్తరప్రదేశ్ లో సంసాబాద్ వద్ద ఒక చెట్టు దుంగను పట్టాలపై అడ్డంగా పెట్టి


ట్రైన్ పట్టాలు తప్పించే ప్రయత్నం పై విచారణ జరిగి ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయగా,

గత నెల ఆగస్టు20న యుపి లో అలిఘర్ వద్ద రైల్ పట్టాలు తప్పించే ఉద్దేశ్యంతో మోటార్ సైకిల్ వీల్ ని పట్టాలపై ఉంచినందుకు అఫ్సన్ అనే వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అదే నెల 23 తేదీ రాత్రి రాజస్థాన్‌లోని పాలి జిల్లా  జోధ్‌పూర్ వెళ్తున్న వందే భారత్ రైలు పాలీ జిల్లా సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉద్దేశపూర్వకంగా ఉంచిన ఒక పెద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, సిమెంట్ దిమ్మె వందే భారత్ రైలు ముందు భాగానికి నష్టం కలిగించింది, ఆ సమయంలో ట్రైన్ లో సుమారు 375 మంది ప్రయాణికులు ఉన్నారు.

దానిపై కూడా విచారణ జరుగుతూ ఉండగా,

తాజాగా రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని కోటా-బినా రైల్వే లైన్‌లోని ఛబ్రా ప్రాంతంలోని చచౌడా గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు పాత బైక్ ను ఆగస్టు 29 రాత్రి పట్టాలపై ఉంచారు.                                 అయితే, అదృష్టవశాత్తూ ఈ ట్రాక్ మీద ప్రయాణీకుల ట్రైన్ కంటే ముందుగా గూడ్స్ రైలును వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు పైలట్ వినోద్ మీనా అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అదే ఆ గూడ్స్ రైలు బదులు ఏ ఎక్స్ ప్రెస్  ట్రైన్ ఆ ట్రాక్ మీద ఆ సమయంలో వచ్చి ఉంటే చాలా ఘోర ప్రమాదం జరిగి భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేది.

                            పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరి ఇస్లామిక్ టెర్రరిస్ట్ జిహాదీలను ప్రేరేపిస్తూ, భారత్ లో పెద్ద ఎత్తున రైళ్లు పట్టాలు తప్పించాలి అని ఒక వీడియోలో పిలుపు ఇస్తూ, అవి ఎక్కడ ఎక్కువగా హాని కలిగిస్తాయో వివిధ వ్యూహాలతో ప్రయోగాలు చేయండి అని మూడు వారాల క్రితం ఆ మూడు నిమిషాల వీడియో విడుదల చేశాడు. అదే సమయంలో హిందూ నాయకులు మరియు పోలీసులకు వ్యతిరేకంగా "ఇష్తిషాది జంగ్" లేదా "ఫిదాయీన్ యుద్ధం" ప్రారంభించాలని కూడా ఘోరీ ముజాహిదీన్‌లను ఆ వీడియోలో కోరాడు.

ఈ వీడియో తర్వాత ఇటీవలి కాలంలో జరిగిన రైలు పట్టాలు తప్పిన సంఘటనలను భారత అధికారులు ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. 

2020లో టెర్రరిస్టుగా గుర్తించబడిన ఈ ఫర్హతుల్లా ఘోరీ భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు. వాటిల్లో ముఖ్యంగా, 2001 అక్షరధామ్ దేవాలయం దాడిలో 30 మంది మృతి చెందగా, 80 మంది గాయపడ్డారు. 2004లో హైదరాబాద్‌లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడి, 2023 రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుకు ఘోరీని ప్రధాన సూత్రధారిగా ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ఈ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందినవాడు.

అలాగే, ఈ నెల ప్రారంభంలో,  రైల్వే ట్రాక్‌లపై సైకిళ్లు, సబ్బులు, రాళ్లు మరియు మరికొన్ని వస్తువులను ఉంచుతూ ఏం జరుగుతుందో చూపిస్తూ కంటెంట్ క్రియేషన్ పేరుతో వీడియో లు తీస్తూ యూ ట్యూబ్ లో ఉంచినందుకు గుల్జార్ షేక్ అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

రైల్వే లో ' ట్రాక్ మెన్ ' లేదా 'కీ మెన్' ఉద్యోగం అని ఉంది. వీరు పట్టాలు వెంబడి కాలి నడకన తిరుగుతూ ఇన్ని వేల కి.మీలు ఉన్న రైల్వే లైన్ ని చెక్ చేస్తూ చిన్న చిన్న రిపేర్లు చేస్తూ మైంటైన్ చేస్తూ ఉంటారు. పెద్ద తేడాలు ఏమైనా ఉంటే పై అధికారులకు తెలియ చేస్తారు. వీరు రాత్రి, పగలు, ఎండ వానా అనే తేడా లేకుండా షిఫ్ట్స్ లో పని చేస్తారు.

అయితే, వీరు ట్రాక్స్ లో సాధారణంగా ఏర్పడే లోపాలను గుర్తిస్తారు, సరి చేస్తారు కానీ, విద్రోహ పూర్వకంగా కొందరు చేస్తున్న ప్రయత్నాలను రైల్వే శాఖకు పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. ఇన్ని వేల కి.మీ ట్రాక్ కి 24/7  కాపలా ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి దాదాపు అసాధ్యం.

అందుకే ట్రాక్ దగ్గరలో ఉన్న ప్రజలే అప్రమత్తంగా ఉండి రైల్వే అధికారులకు సమాచారం ఇస్తూ ఉండాలి.

....చాడా శాస్త్రి.....

No comments:

Post a Comment