టంగుటూరి రామకృష్ణ, పసుమర్తి మల్లిఖార్జున్, ఘంటసాల సుభాస్ పై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, FIR నమోదు
హైద్రాబాద్: నీలగిరి శంఖారావం
మేము అదిలాబాద్ కు చెందిన మధ్య తరగతికి చెందిన ఆర్య వైశ్యులం. గతకొన్ని రోజుల ముందు MADRAS కు చెందిన టంగుటూరి రామకృష్ణ ఆధ్వర్యం లో నడిపించబడుతున్న ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (World Arya Vysya Mahasabha (WAM) నుండి పసుమర్తి మల్లికార్జున కలిసి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ మీటింగ్ ను అభూదాబి లో పెద్దయెత్తున నిర్వహిస్తున్నట్లు గా నిర్వహిస్తున్నట్లు మోసపూరితమైన ప్రకటనలు చేసి, మీరు WAM సభ్యత్వం తీసుకుంటే మీరు మీటింగ్ కు రావడానికి అర్హులు అని మమ్మల్ని నమ్మించి. మా దగ్గరనుండి WAM సభ్యత్వ రుసుం పేరిట రు. 2,500/- వాటితో పాటు అభూదాభి మీటింగ్ కొరకు రు. 87,000/- మరియు 5,000/- కాన్ఫరెన్స్ పేరిట మా దగ్గరనుండి వసూలు చేయడం జరిగిందని ఈ మొత్తాన్ని గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లించామని, ఈ మొత్తాన్ని లోటస్ హాలిడేస్ కాచిగూడ వారి పేరిట వసూలు చేశారని నిన్నటి రోజున అభుదాభి వెళ్ళుటకు అందరం కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నామని, ఇక్కడకు వచ్చిన తరువాత టంగుటూరి రామకృష్ణ , పసుమర్తి మల్లికార్జున మరియు వారి నాయకత్వం మొహం చాటేసి విజిట్ వీజాలు విమాన టికెట్స్ ఇవ్వకుండా మోసం చేయడం జరిగిందిని అదిలాబాద్ కు చెందిన పల్దే ప్రసాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ లో లోటస్ హాలిడే సంస్థ ప్రతినిధి ఘంటసాల సుభాస్ ఘంటసాల వామ్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ మరియు కార్యదర్శి పసుమర్తి మల్లిఖార్జున్ పై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు fir నమోదు చేశారు.
ఈ విధంగా అదిలాబాద్, శ్రీశైలం, గుంటూరు నుండి దాదాపు 20 మంది వరకు మోసపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై wam వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే వారు అందుబాటు లో లేరు.
కేసు వివరాలు:
*క్రైమ్ నెంబర్. 337/2024, U/s 316 (2) 318 (4), 351 (2) BNS, కాచిగూడ పోలీస్ స్టేషన్, హైదారాబాద్*
*316 (2)* నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడే వ్యక్తికి ఐదు సంవత్సరాల వరకు పొడిగించబడే వివరణతో కూడిన జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.
*318 (4)* మోసం చేయడం ద్వారా ఒకరిని మోసం చేసి, ఆపై నిజాయితీ లేకుండా వారిని వేరొకరికి ఆస్తిని ఇవ్వడానికి, పూర్తిగా లేదా పాక్షికంగా విలువైన భద్రతను సృష్టించడానికి, మార్చడానికి లేదా నాశనం చేయడానికి వారిని ఒప్పించే వ్యక్తి విలువైన భద్రతగా, ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది.
*351 (2)* నేరపూరిత బెదిరింపు నేరానికి పాల్పడే వ్యక్తికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.
No comments:
Post a Comment