రూ. 5.67 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. జనగామ జిల్లాలో ఘటన
క్రిమినల్ కేసు, రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు కలెక్టర్ ఆదేశం
మహబూబాబాద్ జిల్లాలో ఓ మిల్లుపై టాస్క్‌ఫోర్స్ దాడులు
రూ.9.56 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తింపు దేవరుప్పుల, గూడూరు, సెప్టెంబరు 24: కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న ధాన్యానికి తగినట్లు బియ్యం తిరిగి ఇవ్వని ఓ మిల్లర్‌పై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడమే కాదు.. ఆయన, ఆయన కుటుంబ ఆస్తులనూ జప్తు చేశారు. వాటిపై ఎటువంటి లావాదేవీలను అనుమతించవద్దని జిల్లా సబ్ రిజిస్ట్రార్‌లకు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ లేఖ రాశారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదుకు కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్‌పహాడ్ గ్రామంలోని శ్రీసాయిరాం మోడ్రన్ బిన్నీ రైస్ మిల్ యజమాని పల్లా చంద్ర శేఖర్ రెడ్డి 2022-23; 2023-24 సంవత్సరాల్లో 1987.560 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు. కేవలం 143.038 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి పంపిణీ చేశారు. దీంతో ఈనెల 12న కొడకండ్ల డిప్యూటీ తహసీల్దార్ దేవా (పౌర సరఫరాలు) రైస్ మిల్లును తనిఖీ చేశారు. జరిమానా, వడ్డీతో కలిపి కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన రూ.5.67 కోట్ల విలువైన 1774 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు లేవని గుర్తించారు. వాటిని పక్కదారి పట్టించి ఉంటారని నివేదించారు. ఈ నేపథ్యంలోనే, రైస్ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా రైస్ మిల్లర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను గుర్తించి రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రారంభించాలని దేవరుప్పల తహసీల్దారుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దేవరుప్పుల పోలీసులకు జిల్లా పౌర సరఫరాల డీఎం అతిరామ్ ఫిర్యాదు చేశారు. ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆస్తులపై ఎటువంటి లావాదేవీలను అనుమతించవద్దని జిల్లా సబ్ రిజిస్ట్రార్‌లకు లేఖ రాశారు.
అప్పరాజుపల్లి రైస్ మిల్లుపై టాస్క్‌ఫోర్స్ దాడులు
మహబూబాబాద్ జిల్లా అప్పరాజుపల్లి రాజరాజేశ్వర రైస్‌మిల్లుపై పౌర సరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సివిల్ సప్లై ఓఎ్‌సడీ ప్రభాకర్, డీఎ్‌సవో ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగాయి. 2022-23 రబీ సీజన్‌లో అప్పరాజుపల్లిలోని రాజరాజేశ్వర రైస్ మిల్లుకు 19,456 క్వింటాళ్ల ధాన్యం అప్పగించారు. మిల్లు బాధ్యులు ఒక్క గింజ కూడా కస్టమ్ మిల్లింగ్ కింద పౌర సరఫరాల శాఖకు అప్పగించలేదు. అలాగే, 2023-24 ఖరీఫ్ సీజన్‌లో మరో 32,240 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇచ్చారు. ఇందులో 21,900 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో లేదని గుర్తించారు. 2022-23 రబీ సీజన్‌లో ఇచ్చిన ధాన్యం విలువ రూ.4.15 కోట్లు; 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.5.41 కోట్లు.. మొత్తం రూ.9.56 కోట్లు ఉంటుందని తేల్చారు. మిల్లు యజమాని భూక్య నవీన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పారు.
30న బీజేపీ రైతు దీక్ష: ఏలేటి
హైదరాబాద్, సెప్టెంబర్24 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రైతు హామీల సాధన పేరిట ఈనెల 30వ తేదీన రైతుదీక్ష నిర్వహించనున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌లో 30న ఉదయం 11 గంటల నుంచి 24 గంటల పాటు దీక్ష కొనసాగుతుందని చెప్పారు. రైతులకు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో నిర్వహించనున్న ఈ దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నాయకులంతా పాల్గొంటారని పేర్కొన్నారు.
No comments:
Post a Comment