ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్సో జెండర్లు – సీఎం రేవంత్
హైదరాబాద్లో ట్రాఫిక్ ను స్ట్రీమ్ ను చేయడానికి ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్లిష్టమైన హైదరాబాద్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ నిర్ణయంతో ట్రాన్స్జెండర్ల గౌరవం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ట్రాన్స్‌జెండర్లు 3,000 మందికి పైగా ఉంటే, నగరంలోనే 1000 మంది ఉన్నట్టు అంచనా. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రాణించే ప్రతిభా సామర్థ్యం ఉన్న వీరికి ఆదరణ కరవవుతోంది. దీంతో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. వీరిలో ఆసక్తి ఉన్న వారికి రాష్ట్ర పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. విద్యార్హతలను బట్టి ఉపాధి అంశాల్లో శిక్షణనిస్తున్నాయి. వీరిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ట్రాఫిక్ విభాగంలో నియమించేందుకు సిద్ధమైంది.
No comments:
Post a Comment