Monday, 30 September 2024

ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించండి - ఆర్యవైశ్య ఐక్యవేదిక

 

ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించండి - ఆర్యవైశ్య ఐక్యవేదిక


నల్గొండ, (నీలగిరి శంఖారావం ప్రతినిధి) 30-09-2024:  ఆర్యవైశ్య ఐక్యవేదిక ఆద్వర్యం లో ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించాలని కోరుతూ నల్లగొండ జిల్లా కలెక్టర్ కు సోమవారం కలెక్టరేట్ లో వినతి ప్రత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రం లో ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించడం ద్వారా పేద ఆర్యవైశ్య కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా, పేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కార్పొరేషన్ పనిచేసేలా ఆర్ధిక వనరులు సమకూర్చాల్సిందిగా కోరారు. దీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల డిమాండ్ను గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయడాన్ని ఆర్యవైశ్యులంతా స్వాగతిస్తున్నామని, అయితే ఇదే క్రమంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానికి ఎలాంటి నిధులు కేటాయింపు చేయకపోవడం వల్ల నిరుపయోగంగా మారిన పరిస్థితి ఏర్పడిందని,  కేవలం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు మాత్రమే చేసి ఆ కార్పొరేషను నిధుల కేటాయింపు చేయక పోవడం వల్ల కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్యులకు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఆర్యవైశ్య కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదనీ పేర్కొన్నారు . కార్పొరేషన్ ఏర్పాటు అయితే తమకు కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని ఋణాలు, సబ్సిడీతో కూడిన ఋయాలు, నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఎంతో లబ్దిచేకూరుతుందని భావించిన పేద ఆర్యవైశ్యులకు నిధుల కేటాయింపు చేయకపోవడం తీవ్ర బాధను కలిగిస్తుందని, నిధుల కేటాయింపు లేని కారణంగా కార్పొరేషన్ ద్వారా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని కార్పొరేషన్ ఏర్పాటు, దానికి చైర్మన్ నియామకం చేసినప్పటికీ నిధుల కేటాయింపు లేకపోవడం పేద ఆర్యవైశ్యులకు తీరని అన్యాయం కలిగితుందని అన్నారు. అంతేకాకుండా ఎన్నో ఆశల తో కార్పొరేషన్ ద్వారా తమ కుటుంబాల ఆర్ధికస్థితి మారుతుందని భావించిన నిరుపేద ఆర్యవైశ్యులు, చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ కు కనీసం 100 కోట్ల రూపాయల నిధిని కేటా యించడంతో పాటు కార్పొరేషన్ తరపున పేద ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఋణాలు, సబ్సిడీ తో కూడిన ఋణాలు ఇవ్వడంతో పాటు వైద్య సహాయం కోసం పేద ఆర్యవైశ్యులకు ఆర్ధిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం స్పందించి 100 కోట్ల రూపాయల నిధిని ఆర్యవైశ్య కార్పొరేషన్కు కేటా యించి తెలంగాణ రాష్ట్రంలోని చిరు వ్యాపారాలు, పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి, సంక్షేమం, అభివృద్ధి కోసం కార్పొరేషన్ పనిచేసే విధంగా వెంటనే నిధుల కేటాయింపు చేయాలని  ప్రభుత్వాన్ని ప్రత్యే కంగా కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో నల్గొండ అశోక్ ,K రామకృష్ణ, దుండిగళ్ల ఓం ప్రసాద్, మిరియాల మహేష్,  నీలా చంద్రశేఖర్, రవి,  వెంకన్న తదితరులు ఉన్నారు


Saturday, 28 September 2024

HMDA |అయ్యగారికి సమర్పించుకోలేక చేతులెత్తేస్తున్న బిల్డర్లు!

                                                 HMDA | ఎస్‌ఎఫ్‌టీకి 200 ఇస్తేనే అనుమతి.. అయ్యగారికి సమర్పించుకోలేక చేతులెత్తేస్తున్న బిల్డర్లు! ‘మీ లేఅవుట్లకు అనమతులు కావాలా.. అయితే ఫలానా సార్‌ను కలిసి రండి. ఆయనే చూసుకుంటారు. ఫైలు ఇక్కడే ఇవ్వండి.. క్లియరెన్స్‌ మాత్రం అక్కడ చేసుకొని రండి’ ఇదీ ఇటీవల రాష్ట్రంలోని కొందరు రియల్టర్లు హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితి. 

HMDA | ఎస్‌ఎఫ్‌టీకి 200 ఇస్తేనే అనుమతి.. అయ్యగారికి సమర్పించుకోలేక చేతులెత్తేస్తున్న బిల్డర్లు!

ఆ సారే ప్రాపర్‌ చానల్‌.. ఆయనను కలవాల్సిందే

హెచ్‌ఎండీఏలో నిర్మాణాల ఫైళ్లు క్లియర్‌ చేసేది ఆయనే

ఎస్‌ఎఫ్‌టీకి కనిష్ఠంగా రూ.40.. గరిష్ఠంగా 200 వసూలు

           HMDA | హైదరాబాద్‌, : ‘మీ లేఅవుట్లకు అనమతులు కావాలా.. అయితే ఫలానా సార్‌ను కలిసి రండి. ఆయనే చూసుకుంటారు. ఫైలు ఇక్కడే ఇవ్వండి.. క్లియరెన్స్‌ మాత్రం అక్కడ చేసుకొని రండి’ ఇదీ ఇటీవల రాష్ట్రంలోని కొందరు రియల్టర్లు హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితి. డైరెక్ట్‌గా లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల కోసం ఎవరైనా వెళ్తే పనులు అవ్వడం లేదక్కడ..‘ త్రూ ప్రాపర్‌ చానల్‌’ అంటూ అక్కడి ఉన్నతాధికారులే ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి నంబర్‌, అడ్రస్‌ ఇచ్చి పంపుతున్నారు.

                ఆ సార్‌ అన్నీ పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి ఉండే కండీషన్లు చెప్తారు. ఆ కండీషన్లు ఓకే అయితే.. ఫైలు తీసుకోవాలని హెచ్‌ఎండీఏ/జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు ఇస్తారు. గడిచిన పది నెలలుగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల పరిధిలో ఇదే వ్యవహారం నడుస్తున్నది. దీనిని ఎవరూ ప్రశ్నించే సాహసమే చేయడంలేదు.

చదరపు అడుగుకు రూ.40 వసూలు..

ఏదైనా అపార్ట్‌మెంట్‌ లేదా కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు అనుమతులు రావాలంటే ఆ ప్రైవేటు రియల్టర్‌ (సార్‌)కు మొక్కు చెల్లించుకోవాలి. ఆ వ్యక్తి రాష్ట్రంలోని ముఖ్యనేతకు దగ్గరి బంధువు అని తెలిసింది. ఆ ముఖ్యనేతకు రియల్‌ఎస్టేట్‌లో కూడా భాగస్వామిగా ఉన్న ఆయనే ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్నది నిర్ణయించి, ఎక్కడ ఇవ్వాలో కూడా చెప్తారట. అంతా పూర్తయ్యాక ఆటోమెటిగ్గా అధికారుల నుంచి ‘మీ ఫైల్‌పై సంతకాలు పూర్తయ్యాయి’ అంటూ ఫోన్లు వస్తాయి. భవనం, అది ఉన్న లొకేషన్‌ ఆధారంగా కనిష్ఠంగా చదరపు అడుగుకు రూ.40 వసూలు చేస్తున్నట్టు బిల్డర్లు చెప్తున్నారు. 50వేల చదరపు అడుగుల భవనానికి అయితే ఒక ధర.. లక్ష చదరపు అడుగులు దాటితే మరో ధర అడుగుతున్నారు.

            అయిదు లక్షల చదరపు అడుగుల భవనాలకైతే ఏకంగా ల్యాండ్‌షేర్‌ లేదా తమ వారికి కొంతభాగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.40 నుంచి మొదలయ్యే బేరం రూ.100 వరకు వెళ్తున్నది. ఇది కేవలం కొత్తగా నిర్మించే భవనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఫ్లాట్‌ (అపార్ట్‌మెంట్లు)కు ఒక ధర, విల్లా ప్రాజెక్టులకు మరో ధర పెట్టారు. విల్లా ప్రాజెక్టులు అయితే చదరపు అడుగుకు కనీసం రూ.60 నుంచి మొదలవుతుంది. అదే లేఅవుట్‌ అయితే ధర మారుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయిస్తున్నారు. కనీసం రూ.200 తగ్గకుండా చదరపు గజానికి వసూళ్లు చేస్తున్నారు.

కంగుతింటున్న రియల్టర్లు

కొత్త సర్కారు వచ్చిన తర్వాత రియల్‌ఎస్టేట్‌ రంగం పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్నవారిని ప్రోత్సహించాల్సిందిపోయి వసూళ్ల దందా మొదలుపెట్టడం ఏమిటని రియల్టర్లు వాపోతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంలో కీలక పాత్ర పోషించిన మరో ముఖ్యమైన నాయకుడు కూడా ఇప్పు డు అనుమతుల ప్రక్రియలో క్రియాశీలకంగా ఉన్నారు.

ఆయనతోపాటు మరో యువ కిషో రం కూడా వసూళ్ల పనిలో నిమగ్నమయ్యాడని వినికిడి. వీరి నుంచి ఫోన్‌ వచ్చిన తర్వాతనే ఫైళ్లు కదులుతున్నాయని వినికిడి. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా ఇలాంటి పోకడలు చూడలేదని, ఇప్పుడేమో ముక్కుపట్టి వసూళ్లు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ వసూళ్లను భరించలేక చాలా మంది బిల్డర్లు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు.

తెలంగాణలో త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ.. భారీ ఉద్యమంతో ప్రజల ముందుకు..!


 తెలంగాణలో త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ.. భారీ ఉద్యమంతో ప్రజల ముందుకు..!

             : తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే.. రాజకీయ పార్టీల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి. సంచలన ఆరోపణలు, సవాళ్లతో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుబోసుకోనున్నట్టు తెలుస్తోంది. అది కూడా బీసీ నినాదంతో రానుంది. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేసిన ప్రకటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ప్రధానాంశాలు:

తెలంగాలో త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ

బీసీ నినాదంతో పురుడుపోసుకోనున్న కొత్త పార్టీ

రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య సంచలన ప్రకటన

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఎంఐఎం, టీజేఎస్, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు ఉండగా.. ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలానే ఉన్నాయి. కాగా.. ఇప్పుడు మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకునే అవకాశం ఉంది. అది కూడా బీసీ నినాదంతో రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు.. రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశాయి. త్వరలో.. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

          బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని.. తప్పకుండా పార్టీ పెడతామని ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ పార్టీ పెట్టాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో పరిశీలనలో ఉందని.. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆదివారం (సెప్టెంబర్ 22న) రోజున.. అఖిలపక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించగా.. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు, పలువురు బీసీ కులసంఘాల నాయకులు హాజరయ్యారు.


ఈ సమావేశంలో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య.. గతంలో 10 మంది బీసీ నాయకులు పార్టీ పెట్టినా విజయవంతం కాలేకపోయారని.. ఈసారి తాము మాత్రం సరైన సమయం చూసి పెడతామని ప్రకటించారు. మరోవైపు.. కాంగెస్ ప్రభుత్వం.. తెలంగాణలో సమగ్ర కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. గతంలో బీసీల పోరాటాన్ని వక్రీకరించారన్నారు. ఈసారి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకోకపోతే.. అసలు రిజర్వషన్లే లేకుండా చేస్తారని హెచ్చరించారు.

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం.. దమ్ముంటే ఆపు: కేటీఆర్


కులగణన విషయంలో ప్రభుత్వం జీవో ఇస్తే.. మళ్లీ హైకోర్టుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే.. ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని.. ముందుచూపుతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లోని స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో దాఖలైన అన్ని కేసుల్లో బీసీలకు వ్యతిరేకమైన తీర్పే వచ్చిందని గుర్తు చేసిన కృష్ణయ్య.. తెలంగాణలోనూ అలాంటి ప్రమాదం ఉందని తెలిపారు. అవసరమైతే.. రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.


తెలంగాణలో మరో భారీ ఉద్యమం వస్తే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కావని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. త్వరలో నిర్వహించబోయే సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమమే రాబోతుందని కృష్ణయ్య చెప్పుకొచ్చారు. ఆ ఉద్యమ సెగ కేంద్ర ప్రభుత్వానికి కూడా తాకబోతుందని ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

తీన్మార్ మల్లన్నపై రెడ్డి జాగృతి ఫిర్యాదు.. ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం..!

 తీన్మార్ మల్లన్నపై రెడ్డి జాగృతి ఫిర్యాదు.. ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం..!


Authored Byరామ్ ప్రసాద్ | 

          కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణలోని రెడ్డి జాగృతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. రెడ్డిలను కించపరుస్తూ.. అవహేళన చేస్తూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారని గుర్తు చేసిన రెడ్డి జాగృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే తీన్మార్ మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని.. డిమాండ్ చేశారు. ఒక రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ.. ఒక వర్గాన్ని అవహేళన చేయటం సరికాదన్నారు. తీన్మార్ మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు.

తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు

కాంగ్రెస్ ఎమెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై రెడ్డి జాగృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెడ్డిలపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రెడ్డి జాగృతి పోలీసులకు కంఫ్లైంట్ చేయటం గమనార్హం. అయితే.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. ఒకవేళ తాను మళ్లీ ఎన్నికల్లో నిలబడితే దయచేసి.. తనకు రెడ్డివాళ్లు, ఓసీలు తనకు ఓటు వేయకండి అంటూ కామెంట్ చేశారు. కేవలం బీసీల ఓట్లే తనకు సరిపోతాయని.. అవి సరిపోగా ఇంకా కొన్ని ఓట్లు కూడా మిగులుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. తన యూట్యూబ్ ఛానెల్లో రెడ్డిలు, ఓసీలకు సంబంధించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది.


తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న రెడ్డి జాగృతి.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. ఫిర్యాదులో తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై రెడ్డి జాగృతి కీలక విషయాలను ప్రస్తావించింది. గతకొన్ని రోజులుగా.. తన య్యూట్యూబ్ ఛానెల్‌లో రెడ్డి జాతిని కించపరుస్తూ నానా దుర్భాషలాడుతున్నాడంటూ కీలక విషయాలు ప్రస్తావించింది. రాజ్యంగబద్దమైన పదవిని స్వీకరిస్తూ.. సమాజంలో ఉన్న అన్ని కులాలను, మతాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న.. ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్లను కించపర్చటం గమనార్హమన్నారు.



ఓసీలను కించపరుస్తూ.. అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్నకు అసలు.. ఎమ్మెల్సీగా ఉండే అర్హత లేదని.. వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని రెడ్డి జాగృతి డిమాండ్ చేశారు. అదే విధంగా.. ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్లకు బహిరంగ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో.. ఓసీలలో ఉన్న పేదవాళ్ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న నడిపిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌ను కూడా తెలంగాణలో బ్యాన్ చేయాలంటూ రెడ్డి జాగృతి డిమాండ్ చేసింది. వెంటనే తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైడ్రా మాదిరిగా పాలకుర్తిలో పైడ్రా.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వార్నింగ్


మరి.. రెడ్డి జాగృతి ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందించనున్నారు అన్నది చూడాలి. పోలీసులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో ఉన్న మెజార్టీ శాతం ఉన్న రెడ్డి నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా.. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల విషయంలో అవసరమైతే ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేస్తా.. కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేసేందుకు సిద్ధం అంటూ పలు సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

కమిషనర్‌ రంగనాథ్‌పై కేసు నమోదు.. హైడ్రా అంటే బూచీ కాదు భరోసా అంటున్న ఎండీ దాన కిషోర్‌..

 


 కమిషనర్‌ రంగనాథ్‌పై కేసు నమోదు.. హైడ్రా అంటే బూచీ కాదు భరోసా అంటున్న ఎండీ దాన కిషోర్‌..

Hydra On Musi Residents Relocation:  మూసి నిర్వాసితులకు సరైన ఉపాధి కల్పనలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు దాన కిషోర్  నిన్న శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసిన తప్ప నిరుపేదల ఇళ్లను కాదని చెప్పారు.

Hydra On Musi Residents Relocation: మూసి బఫర్ జోన్ లో నివసిస్తున్న వారిని బలవంతంగా తరలించలేదని, వారు ఇష్టప్రకారమే వెళ్తున్నారని ఎండి దానికిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బఫర్ జోన్ లో నివసిస్తున్న వారిని తరలిస్తున్నామని చెప్పారు. మూసి నిర్వాసితులకు సరైన ఉపాధి కల్పనలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు దాన కిషోర్  నిన్న శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసిన తప్ప నిరుపేదల ఇళ్లను కాదని చెప్పారు. అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా హైడ్రా పైవస్తున్న తీవ్ర నిరసనలు వ్యతిరేకలను ఆయన దుష్ప్రచారం చేయవద్దని చెప్పారు.

సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి చాలా భావోద్వేగానికి గురవుతారు.  అటువంటి వారికి సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ లు కూడా ఇప్పిస్తున్నామన్నారు. అయితే నిబంధనల ప్రకారం సొంతభవనాలు కలిగిన వారికి చెల్లింపులు చేస్తామని చెప్పారు. మూసి నిర్వాసితులను కన్నబిడ్డల్లా చూసుకుంటాం, వారికి అండదండగా ఉంటాం. కానీ హైడ్రా అంటేనే బూచీ అన్నట్టుగా సామాజిక మాధ్యమంలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని దానికిషోర్ చెప్పారు.

ముఖ్యంగా మూసి నిర్వసితులకి  రూ.30 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తున్నామని అంతేకాదు అదనంగా ఇల్లు నిర్మించడానికి కూడా రూ.700 కోట్ల వరకు ప్రభుత్వం మంజూరు చేస్తుంది అన్నారు. మూసి నిర్వాసితులకు ఉపాధి వారి పిల్లల చదువుల అంశాలను పరిగణలోకి తీసుకున్నాం.  పట్టా భూములకు చట్ట ప్రకారం చెల్లింపులు చేస్తాం. మరో రెండు నెలల్లో మూసి అభివృద్ధి పనులు చేపడుతాం టెండర్లను కూడా ఆహ్వానిస్తామని దానికిషోర్ అన్నారు.

                ముఖ్యంగా మూసి అభివృద్ధికి పదివేల కోట్లు 10000 కోట్లు  మంజూరు చేశారని అన్నారు. మూసిని పర్యాటక కేంద్రంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్షాళన చేపట్టారని పేర్కొన్నారు. ఈ మూసి నది అభివృద్ధితో నగరం రూపురేఖలే మారిపోతాయి అని పేదల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయన్నారు.ఇక ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మున్సిపాలిటీలో నిర్మాణ అనుమతుల మంజూరుకు తీసుకురానున్నట్లు దానాకిషోర్ చెప్పారు. ముఖ్యంగా విద్యావంతులు కూడా ఎఫ్.టి.ఎల్. బఫర్ జోన్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు దుర్గం చెరువులో కొంత సం సందిగ్ధత  ఉందన్నారు.

                అయితే సంబంధించిన అన్ని మ్యాప్లను జిహెచ్ఎంసి, హైడ్రా, హెచ్ఎండిఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచానున్నారు, యాప్ ద్వారా వివరాలన్నీ ప్రజల ముందు పెట్టనున్నారు. దీంతో ఎఫ్డిఎల్ బఫర్ జోన్ వివరాలు ప్రజలు ఈజీగా తెలుసుకునే అవకాశం ఉందని దానికిషోర్ అన్నారు.

ఇదిలా ఉండగా బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యను హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య నాకు బాధాకరంగా అనిపించింది అన్నారు. తప్పుడు ప్రచారంతో భయాందోళన చెంది ఆత్మహత్యకు గురై పాల్పడ్డారని పేర్కొన్నారు .సున్నం చెరువులో వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారని ఆయన ట్యాంకర్ల వ్యాపారంతో రోజుకు లక్ష సంపాదిస్తున్నాడు, పేదలను అడ్డుగా పెట్టుకుని స్వప్రయోజనాల కోసం అలా చేస్తున్నారని హైడ్రా కమిషనర్ చెప్పారు .ఇది ఇలా ఉండగా హైడ్రా తన ఇల్లు కులుస్తుందని బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే ఆమె కుటుంబం ఎన్ హెచ్ ఆర్ సి ని ఆశ్రయించగా రంగనాథ్ పై 16063/IN/224 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడైంది.అయితే మున్సిపాలిటీ పంచాయతీ నుంచి పక్కకు అనుమతులు పొందిన భవనాలను కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. 

TG ACB : పెట్రోల్ బంక్ ఎన్‌వోసీ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

 

TG ACB : పెట్రోల్ బంక్ ఎన్‌వోసీ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

    • TG ACB : జనగామ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇదివరకే మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ ఏఈ ఏసీబీకి చిక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా.. పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఆర్‌అండ్‌బీ ఈఈ లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు.       

      ఏసీబీకి పట్టుబడిన అధికారులు

      హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ.. జనగామ జిల్లా లింగాల ఘనపూర్‌లో కొత్తగా పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం గత సంవత్సరం జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో లింగాల ఘనపూర్‌కు చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్ చిర్ర సత్యనారాయణ రెడ్డి.. తన భార్య పేరున పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు దరఖాస్తు పెట్టుకున్నారు. సంబంధిత అధికారులు డ్రా పద్ధతిన ఆమెకు బంక్ అలాట్ చేశారు.     

      ఈఈకి రూ.12 వేలు.. ఏటీవోకు రూ.2 వేలు..

      బంక్ అలాట్‌మెంట్ అనంతరం సంబంధిత లబ్ధిదారులకు సంస్థకు ఛలానా కట్టడంతో పాటు.. వివిధ శాఖల నుంచి క్లియరెన్స్, ఎన్‌వోసీలు తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు సంస్థ నుంచి ఎన్‌వోసీ కోసం వరంగల్ పోలీస్ కమిషనర్‌కు లెటర్ ఇవ్వగా.. అక్కడి నుంచి రిమార్క్స్ ఏమైనా ఉంటే చెప్పాలని సీపీ.. జనగామ ఆర్ అండ్ బీ ఈఈతో పాటు వరంగల్ వెస్ట్ జోన్ ఏసీపీ, జనగామ డీపీవోకు లెటర్ రాశారు. ఆర్ అండ్ బీ ఈఈ చిలకపాటి హుస్సేన్ ఎన్వోసీ ఇవ్వాల్సి ఉండగా.. అందుకు ఆయన రూ.12 వేల లంచం డిమాండ్ చేశాడు.

                     .అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ రవీందర్‌కు రూ.2 వేలు ఇవ్వాల్సిందిగా సూచించాడు. కానీ ఎక్స్ సర్వీస్‌మెన్‌గా పని చేసిన సత్యనారాయణ రెడ్డికి లంచం ఇచ్చేందుకు మనసు ఒప్పలేదు. దీంతో నేరుగా వరంగల్ నగరంలోని ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను సంప్రదించాడు. జరిగిన విషయాన్ని మొత్తం ఆయనకు వివరించాడు. అవినీతి అధికారుల ఆట కట్టించేందుకు డీఎస్పీ సాంబయ్య సూచన మేరకు.. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఈఈ హుస్సేన్ అడిగిన రూ.12 వేలు, ఏటీవోకు రూ.2 వేలు ఇచ్చేందుకు.. డబ్బులు తీసుకుని జనగామ కలెక్టరేట్‌లోని వారి ఆఫీస్‌కు వెళ్లాడు. వారు అడిగినంత వారి చేతుల్లో పెట్టాడు.                     అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్న ఏసీపీ డీఎస్పీ సాంబయ్య టీమ్.. వెంటనే రంగంలోకి దిగింది. లంచం తీసుకున్న హుస్సేన్ తోపాటు ఏటీవోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు అధికారులను శనివారం వరంగల్ లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య వివరించారు. లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వ అధికారుల్లో మార్పు రావడం లేదని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి

RTI ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్లు ను నియ‌మించాల‌ని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేసిన ఫోరం ఫర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్


 RTI ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్లు ను నియ‌మించాల‌ని ముఖ్యమంత్రికి  బహిరంగ లేఖ విడుదల చేసిన ఫోరం ఫర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ 

లేఖ యధాతధంగా చదవండి.

గౌ// ముఖ్య‌మంత్రి గారిని కోరుతుంది.


 హైద‌రాబాదు

L. No. FGG/CM/REP/ /2024 28-9-2024



గౌ// ముఖ్య‌మంత్రి గారు

తెలంగాణ ప్ర‌భుత్వం

హైద‌రాబాదు


అయ్యా !


స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం సెక్ష‌న్ 15 (1) ప్ర‌కారం ప్ర‌తి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన స‌మాచార క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్ల నియామ‌కం జ‌ర‌పాలి. ప్ర‌భుత్వ యంత్రాంగం స‌మాచారం ఇవ్వ‌ని ప‌క్షంలో క‌మీష‌న్ వారు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన అప్పీళ్ళ‌ను విచారించి కోరిన స‌మాచారం ఇప్పిస్తుంది.

ప్ర‌ధాన స‌మాచార క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్లు ప్ర‌జా జీవ‌నంలో సుప్ర‌సిద్ధులై ఉండాలి. వారికి విశాల‌మైన విష‌య‌ప‌రిజ్క్షానం, చ‌ట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ‌, మేనేజ్‌మెంట్‌, జ‌ర్న‌లిజం, ప్ర‌సార మాధ్య‌మాలు, కార్య‌నిర్వ‌హ‌ణ‌, ప‌రిపాల‌న‌లో అనుభ‌వ‌ముండాల‌ని సెక్ష‌న్ 15 (5) నిర్థేశిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ గారు తేది 24-8-2020 న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌గా మిగిలిన ఐదుగురు క‌మీష‌న‌ర్లు తేది 24-2-2023 నాడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డంతో గ‌త 18 నెల‌ల నుంచి క‌మీష‌న్ ప‌నిచేయ‌డం లేదు.

స‌మాచార హ‌క్కు చ‌ట్టం యొక్క ప్రాముఖ్య‌త‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్ల నియామ‌కం చేయాల‌ని మా సంస్థ హైకోర్టులో పిల్ వేడం జ‌రిగింది (పిల్ నం. 18/2023) . తేది 5-7-2023 నాడు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ గారు అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తూ ప్ర‌ధాన క‌మీష‌న‌ర్‌, క‌మీష‌న‌ర్ల నియామ‌కం గురించి ద‌ర‌ఖాస్తులు కోరినామ‌ని తొంద‌ర‌లోనే నియామ‌కం జ‌రుగుతుంద‌ని హైకోర్టుకు తెలుప‌డం జ‌రిగింది. కాని ఇంత‌వ‌ర‌కు ఏమీ చ‌ర్య‌లు తీసుకోలేదు.

క‌మీష‌న‌ర్లు లేక‌పోవ‌డంతో సుమారు 15 వేల అప్పీళ్ళు క‌మీష‌న్ కార్యాల‌యంలో పెండింగులో ఉన్నాయి. అదీకాక క‌మీష‌న‌ర్లు లేనందున ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లో అధికారులు స‌మాచార‌ము కొర‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోడం లేదు.

స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం నిర్థేశించిన విధంగా స‌మాజంలో మంచి పేరున్న నిష్ణాతుల‌ను, అనుభ‌వ‌జ్క్షుల‌ను ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్లుగా తొంద‌ర‌లోనే నియ‌మించాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ గౌ// ముఖ్య‌మంత్రి గారిని కోరుతుంది.


        భ‌వ‌దీయుడు

    యం. ప‌ద్మ‌నాభ‌రెడ్డి

    అధ్యక్షులు

    ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌

నవంబరు నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు!

నవంబరు నుంచి

కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు!

భూముల మార్కెట్‌ విలువలు పెంచాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో నవంబరు 1 నుంచి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి రానున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిఈజీఐఎస్‌ నివేదిక, అధికారుల ప్రతిపాదనలు పరిశీలించి తుది నిర్ణయం

  • అక్టోబరు నుంచి కొత్త ఆర్వోఆర్‌ చట్టం

  • ధరణి సమస్యలకు పూర్తి పరిష్కారం

  • పరీక్షతో గ్రామ రెవెన్యూ ఉద్యోగుల ఎంపిక

  • పాతవారూ పరీక్ష రాయాల్సిందే

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్‌, : భూముల మార్కెట్‌ విలువలు పెంచాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో నవంబరు 1 నుంచి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి రానున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. పెంచనున్న మార్కెట్‌ విలువలపై విమర్శలు తలెత్తకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. విలువల పెంపు శాస్ర్తీయంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.


కాంట్రాక్టు ఏజెన్సీ అయిన సెంటర్‌ ఫర్‌ ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌ (సీఈజీఐఎస్‌) ఇచ్చే నివేదికపైనే ఆధారపడకుండా, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల నుంచి కూడా ప్రతిపాదనలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నామన్నారు. అక్టోబరు 15 లోపల నివేదిక ఇస్తుందని, ఆ వెంటనే మార్కెట్‌ విలువల సవరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్‌ ధర రిజిస్ట్రేషన్‌ శాఖ విలువ ప్రకారం నగరాల్లో సగటున రూ.3200గా ఉంటే దీన్ని 30 శాతం(రూ.960) మించకుండా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సాగు భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న విలువను సవరించి గజం ధర రూ.1,000 ఉంటే దాన్ని రూ.2 వేలకు పెంచాలనే ప్రతిపాదనలున్నాయి.


  • వచ్చే నెల నుంచి అమల్లోకి..

వచ్చే నెల నుంచి కొత్త రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్వోఆర్‌-2024) చట్టం అమల్లోకి రానుందని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఆర్వోఆర్‌ ముసాయిదాపై వివిధ వర్గాల నుంచి సేకరించిన సలహాలు, సూచనలు, కలెక్టర్లు పంపిన నివేదికలపై ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం తేవడమా లేక ఆర్డినెన్స్‌ ద్వారా తీసుకురావడమా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత నెలలో కర్ణాటక పర్యటనకు వెళ్లి వచ్చిన ధరణి కమిటీ సభ్యులు.. ప్రతిపాదించిన అంశాలనూ చట్టంలో పొందుపరిచే విషయాన్ని పరిశీలిసున్నామన్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ధరణితో పాటు చాలావరకు భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.


ధరణిలో 3.10 లక్షల పెండింగ్‌ దరఖాస్తుల్లో ఇప్పటికీ 1.10లక్షలు అపరిష్కృతంగా ఉన్నాయని.. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేస్తామని చెప్పారు. వీఆర్‌వో, వీఆర్‌ఏ నియామకాలకు సంబంధించి... అభ్యర్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు పరీక్ష పెట్టి ఎంపిక చేస్తామని వివరించారు. అభ్యర్థులకు డిగ్రీ విద్యా అర్హతగా నిర్ణయించామన్నారు. పాత వారిని తిరిగి రెవెన్యూ సర్వీసులోకి తీసుకోవాలన్నా పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇటీవల జరిగిన బదిలీల్లో కొంతమంది అధికారులు వసూళ్లకు పాల్పడటంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని బదిలీలు చేసినా.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిన వారిని ఈడ్చి కొడతానని ఘాటుగా వ్యాఖ్యానించారు. బదిలీల్లో ఎవరు వసూళ్లకు పాల్పడ్డారో ఆ వివరాలు తన దగ్గర ఉన్నాయని, వారిని ఉపేక్షించేది లేదన్నారు.

Friday, 27 September 2024

హైడ్రా భయం తో మహిళ ఆత్మహత్య..క్లారిటీ ఇచ్చిన రంగనాధ్

 హైడ్రా భయం తో మహిళ ఆత్మహత్య..క్లారిటీ ఇచ్చిన రంగనాధ్


కూకట్ పల్లి పరిధిలో హైడ్రా భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం ఫై హైడ్రా కమిషనర్ రంగనాధ్ క్లారిటీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగా ఇళ్లు కూల్చివేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించడం తో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఉరేసుకుని చనిపోయారు. కాగా ప్రతి రూపాయి పోగేసి కట్టిన 3 ఇళ్లను ముగ్గురు కూతుళ్లకి కట్నంగా ఇచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు కూల్చేస్తామని చెప్పడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.



కాగా మహిళ ఆత్మహత్యకు, హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘మూసీ పరివాహక ప్రాంతంలో శనివారం భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీకి సంబంధించి ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. మేం ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు’ అని తెలిపారు.


: ఆపరేషన్‌ హైడ్రా – మూసీ.. టెన్షన్‌.. టెన్షన్‌.. మహిళ ఆత్మహత్యపై స్పందించిన రంగనాధ్..


 : ఆపరేషన్‌ హైడ్రా – మూసీ.. టెన్షన్‌.. టెన్షన్‌.. మహిళ ఆత్మహత్యపై స్పందించిన రంగనాధ్..

హైదరాబాద్‌లో హైడ్రా హడల్‌.. సిటీ జనాల్లో వీకెండ్‌ దడ.. మూసీ పరివాహకంలో టెన్షన్‌.. టెన్షన్‌.. ఆపరేషన్‌ హైడ్రా.. ఆపరేషన్‌ మూసీ.. హైదరాబాద్‌ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. హైడ్రా వారాంతపు దాడులు.. మూసీ పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్‌లు భయపెడుతున్నాయి. శనివారం, ఆదివారం వస్తుందంటేనే హైదరాబాద్‌ ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు.. హైడ్రా బుల్డోజర్లు వచ్చి పడతాయోనని టెన్షన్‌ పడిపోతున్నారు.


Hyderabad: ఆపరేషన్‌ హైడ్రా - మూసీ.. టెన్షన్‌.. టెన్షన్‌.. మహిళ ఆత్మహత్యపై స్పందించిన రంగనాధ్.

ఒకవైపు హైడ్రా హడల్‌.. మరోవైపు మూసీ సుందరీకరణ గుబులు.. వెరసీ.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేని పరిస్థితులు.. అటు.. మూసీ రివర్‌ బెడ్‌ పరిధిలోని ఇళ్లకు రెడ్‌ మార్క్‌లు.. ఇటు.. చెరువులు, నాలాల పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు.. ఇంకేముంది.. హైదరాబాద్‌లోని పలు ఆయా ప్రాంతాలవారు వణికిపోతున్నారు. బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కొనుగోలు చేసినవారు హైరానా పడుతున్నారు. హైడ్రా బుల్డోజర్‌ ఎప్పుడు తమపైకి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. తమ ఇళ్లు బఫర్‌జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయా.. తమ పరిస్థితి ఏమిటని గుబులు చెందుతున్నారు. దాంతో.. హైదరాబాద్‌లో హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు, బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. మూసీ పరివాహకంలో అధికారుల చేస్తున్న సర్వేలను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది.. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా లేదా కూల్చివేతలపై భయపడవద్దని సూచించారు.



మహిళ ఆత్మహత్య.. రంగనాథ్ ఏమన్నారంటే..

మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలోనూ హైడ్రా హడల్‌ కొనసాగుతోంది. ఇప్పటికే.. కూకట్‌పల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు ప్రకంపనలు రేపాయి. ఇళ్లు కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. అనుమానాలు ఉన్న ప్రాంతాలవారు టెన్షన్‌తో సతమతం అవుతున్నారు. హైడ్రా ఆందోళనల నేపథ్యంలోనే.. కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలోని యాదవబస్తీలో బుచ్చమ్మ అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. కూతురికి ఇచ్చిన ఇంటిని కూల్చివేస్తామని హైడ్రా అధికారులు చెప్పడంతో.. మనస్తాపం చెందిన బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హైడ్రా కూల్చివేతల భయంతోనే తమ తల్లి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు మృతురాలి కుమార్తె.


రూపాయి.. రూపాయి.. కూడబెట్టుకున్న డబ్బులతో ఇల్లు కట్టి కూతుళ్లకు ఇచ్చిందన్నారు స్థానికులు. ఇప్పుడు సడెన్‌గా ఆ ఇంటిని కూల్చివేయనున్నట్లు అధికారులు తెలియజేయగా.. ఎప్పుడు హైడ్రా యంత్రాంగం వచ్చి ఇంటిపై పడుతుందోననే టెన్షన్‌తో ప్రాణాలు తీసుకున్నట్లు చెప్పారు.



హైడ్రా కు భయపడి మహిళ కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకుందన్న వార్తపై స్పందించిన హైడ్రా చీఫ్ రంగనాథ్.. అక్కడ HYDRAA ఎవరికి నోటీసులు ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. హైడ్రాపై భయం సృష్టించేలా మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేయడం ఆపాలన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి కూల్చివేత హైడ్రా కారణంగా జరుగుతోందని అవాస్తవాలు వ్యాపిస్తున్నాయన్నారు. హైడ్రా ముసీ నది కూల్చివేతల కోసం ఏ సర్వేలో భాగంగా లేదన్నారు. రేపు ముసీ నదిలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరగబోతున్నాయనే తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయని.. కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్ హైడ్రాపై కుట్రతోనూ, తప్పుడు దుష్ప్రచారంతోనూ అసత్యాలను వ్యాపింపజేస్తున్నాయన్నారు. ప్రజలు హైడ్రా లేదా కూల్చివేతలపై భయపడవద్దని.. ఎవరికీ నోటీసులు ఇవ్వలేదంటూ కమిషనర్ తెలిపారు.


అత్తాపూర్‌‌లో ర్యాలీ..

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ మూసీ ప్రాంత వాసులు రోడ్డెక్కారు. సర్వేను వ్యతిరేకిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది ప్రజలు పాల్గొన్నారు. హైడ్రా హడల్‌తో దినదినం భయంతో బ్రతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలు చేసిననాటి నుంచి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందన్నారు. వృద్దాప్యంలో ఉన్న తమను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం టెన్షన్‌కు గురిచేస్తుందని.. ఈ వయస్సులో తమకెందుకు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారని ప్రశ్నించారు.


మొత్తంగా… హైడ్రా వీకెండ్‌ దాడులు.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్‌ మార్క్‌లు దడపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా.. శనివారం, ఆదివారం వస్తుందంటేనే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ, రేపట్లో హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ వాలిపోతాయో.. ఏ రేంజ్‌లో కూల్చివేతలు ఉంటాయోనని ఆయా ప్రాంతాల ప్రజలు టెన్షన్‌ పడుతున్నారు.

Wednesday, 25 September 2024

మహబూబాబాద్‌ జిల్లాలో ఓ మిల్లుపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

    కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం తిరిగివ్వకపోవడమే కారణం

రూ. 5.67 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి.. జనగామ జిల్లాలో ఘటన

క్రిమినల్‌ కేసు, రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు కలెక్టర్‌ ఆదేశం

మహబూబాబాద్‌ జిల్లాలో ఓ మిల్లుపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు


రూ.9.56 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తింపు                     దేవరుప్పుల, గూడూరు, సెప్టెంబరు 24: కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం తీసుకున్న ధాన్యానికి తగినట్లు బియ్యం తిరిగి ఇవ్వని ఓ మిల్లర్‌పై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడమే కాదు.. ఆయన, ఆయన కుటుంబ ఆస్తులనూ జప్తు చేశారు. వాటిపై ఎటువంటి లావాదేవీలను అనుమతించవద్దని జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌లకు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ లేఖ రాశారు. కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించిన రైస్‌ మిల్లు యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదుకు కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్‌పహాడ్‌ గ్రామంలోని శ్రీసాయిరాం మోడ్రన్‌ బిన్నీ రైస్‌ మిల్‌ యజమాని పల్లా చంద్ర శేఖర్‌ రెడ్డి 2022-23; 2023-24 సంవత్సరాల్లో 1987.560 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు. కేవలం 143.038 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి పంపిణీ చేశారు. దీంతో ఈనెల 12న కొడకండ్ల డిప్యూటీ తహసీల్దార్‌ దేవా (పౌర సరఫరాలు) రైస్‌ మిల్లును తనిఖీ చేశారు. జరిమానా, వడ్డీతో కలిపి కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ఇచ్చిన రూ.5.67 కోట్ల విలువైన 1774 మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు లేవని గుర్తించారు. వాటిని పక్కదారి పట్టించి ఉంటారని నివేదించారు. ఈ నేపథ్యంలోనే, రైస్‌ మిల్లు యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడమే కాకుండా రైస్‌ మిల్లర్‌, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను గుర్తించి రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రారంభించాలని దేవరుప్పల తహసీల్దారుకు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దేవరుప్పుల పోలీసులకు జిల్లా పౌర సరఫరాల డీఎం అతిరామ్‌ ఫిర్యాదు చేశారు. ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆస్తులపై ఎటువంటి లావాదేవీలను అనుమతించవద్దని జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌లకు లేఖ రాశారు.


అప్పరాజుపల్లి రైస్‌ మిల్లుపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

మహబూబాబాద్‌ జిల్లా అప్పరాజుపల్లి రాజరాజేశ్వర రైస్‌మిల్లుపై పౌర సరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. సివిల్‌ సప్లై ఓఎ్‌సడీ ప్రభాకర్‌, డీఎ్‌సవో ప్రేమ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగాయి. 2022-23 రబీ సీజన్‌లో అప్పరాజుపల్లిలోని రాజరాజేశ్వర రైస్‌ మిల్లుకు 19,456 క్వింటాళ్ల ధాన్యం అప్పగించారు. మిల్లు బాధ్యులు ఒక్క గింజ కూడా కస్టమ్‌ మిల్లింగ్‌ కింద పౌర సరఫరాల శాఖకు అప్పగించలేదు. అలాగే, 2023-24 ఖరీఫ్‌ సీజన్‌లో మరో 32,240 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్‌ కోసం ఇచ్చారు. ఇందులో 21,900 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో లేదని గుర్తించారు. 2022-23 రబీ సీజన్‌లో ఇచ్చిన ధాన్యం విలువ రూ.4.15 కోట్లు; 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.5.41 కోట్లు.. మొత్తం రూ.9.56 కోట్లు ఉంటుందని తేల్చారు. మిల్లు యజమాని భూక్య నవీన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పారు.

30న బీజేపీ రైతు దీక్ష: ఏలేటి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌24 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రైతు హామీల సాధన పేరిట ఈనెల 30వ తేదీన రైతుదీక్ష నిర్వహించనున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌లో 30న ఉదయం 11 గంటల నుంచి 24 గంటల పాటు దీక్ష కొనసాగుతుందని చెప్పారు. రైతులకు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో నిర్వహించనున్న ఈ దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నాయకులంతా పాల్గొంటారని పేర్కొన్నారు.

ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు పోటెత్తుతున్న జర్నలిస్టులు

     ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు పోటెత్తుతున్న జర్నలిస్టులు

 -  మూడోరోజు ఉత్సాహంగా సాగిన సభ్యత్వాలు 

 - సభ్యత్వాలు స్వీకరించిన సీనియర్ జర్నలిస్టులు, చిన్న పత్రికల ఎడిటర్లు

 నల్గొండ, నీలగిరి శంఖారావం:



నల్లగొండ ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులతో పాటు చిన్న పత్రికల ఎడిటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నారు. సభ్యత్వాల సేకరణ మూడవ రోజు బుధవారం పెద్ద ఎత్తున సీనియర్ జర్నలిస్టులు చిన్న పత్రికల ఎడిటర్లు సభ్యత్వాలను స్వీకరించారు. నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ లు జర్నలిస్టులకు సభ్యత్వలను అందజేసి మాట్లాడారు.


చిన్న పత్రిక ఎడిటర్లు 30 మంది ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. చిన్న పత్రిక ఎడిటర్లు ప్రెస్ క్లబ్ లో చేరడం ప్రెస్ క్లబ్ కు ఎంతో బలం చేకూర్చినట్లుగా భావిస్తున్నామన్నారు. యూనియన్లకు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అందరూ కలిసి రావాలని కోరారు. సోమవారం ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు ప్రారంభించుకున్నామని బుధవారం నాటికి మూడవరోజు కొనసాగుతుందని నేటికీ 130 మంది వరకు సభ్యత్వం తీసుకున్నారన్నారు. చిన్న పత్రిక ఎడిటర్లు సంపాదకులు ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవడానికి స్వాగతిస్తున్నామన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ నడవలేదని, ప్రెస్ క్లబ్ ను పున ప్రారంభించుకొని కొనసాగుతున్నామన్నారు. చిన్న పత్రిక ఎడిటర్ల గౌరవానికి ఎక్కడ బంగం కలగకుండా నడుచుకుంటామని అదే స్థాయిలో ప్రెస్ క్లబ్ యూనియన్ కు కూడా సంపూర్ణమైన మద్దతు భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో కొనసాగించాలని కోరారు. చిన్న పత్రికల సభ్యత్వం తీసుకున్న వారిలో ఎన్నమల్ల రమేష్ బాబు, మక్సుద్, భూపతి రాజు, షరీఫ్ బాబు, బి. లక్ష్మినారాయణ, నారాయణ, టి. శ్రీనివాస్, ఆసిఫ్ అలీ, మోయిజ్, కారింగుల యాదగిరి, శ్రీనివాస్, వీరెల్లి సతీష్ తో పాటు పలువురు జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ సభ్యత్యం తీసుకున్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టు పాల్గొన్నారు.

Monday, 23 September 2024

యూట్యూబ్స్ కు బ్రాండ్ కాస్టింగ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

 యూట్యూబ్స్ కు బ్రాండ్ కాస్టింగ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి 




ఇంకా లోతైన చర్చ అవసరం


 రౌండ్ టేబుల్ మీట్ లో వక్తలు


హైదరాబాద్ :


యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు,  నియమ నిబంధనలు,   అనుసరించాల్సిన విధివిధానాలపై,  తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్  టూరిజం ప్లాజాలో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ సంపాదకులు, సీనియర్  జర్నలిస్టులు, యూట్యూబ్ చానెల్స్ నిర్వాహకులు పలు సూచనలు చేశారు.రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 50 మంది సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు వాటి వ్యవస్థాపకులు హాజరయ్యారు. పత్రికలకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్, టీవీ చానల్స్ కు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ గుర్తింపు, కంపెనీ ఆక్ట్ కింద నమోదు కావటం యూట్యూబ్ న్యూస్ చానెల్స్ కి కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. న్యూస్ వెబ్సైట్లకి కూడా అలాంటి నియమనిబంధనలే ఉన్నాయన్నది గుర్తు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపుకు అనుసరించాల్సిన అంశాలపై ఈ కార్యక్రమంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలు అయినందున వాటిని అమలుపర్చాల్సిన కర్తవ్యం యూట్యూబ్ చానెల్స్ పై ఉందని సమావేశం అభిప్రాయబడింది. అకాడమీ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం పట్ల సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ హర్షం వెలిబుచ్చారు. ఇంకా దీనిపై నిర్దిష్ట చర్యలు జరపడానికి  మరిన్ని చర్చలు జరపాలని, రౌండ్ టేబుల్ లో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఇది మొదటిదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అంశం పై ఇంకా లోతైన చర్చ జరగాల్సి ఉందన్నారు.


భావస్వేచ్ఛకు ఉన్న పరిమితులకు లోబడి, జర్నలిజం వృత్తికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు వార్తలు, చర్చా గోష్టిలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ సంస్థలను మాత్రమే మీడియా సంస్థలుగా గుర్తించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. సబ్ స్కయిబర్స్, వ్యూస్ ని ప్రధాన క్రైటేరియగా తీసుకోరాదని, ఎందుకంటే అంగట్లో సరుకుల్లాగా వాటి విక్రయం జరుగుతుందని పలువురు అభిప్రాయ పడ్డారు. వ్యక్తిగత ఎజెండాలతో, ద్వేషాలతో, కక్ష్యపూరిత ధోరణులతో, సమాజాన్ని తప్పు ద్రోవ పట్టించే వైఖరితో ప్రసారాలు చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోకపోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

ఎలాంటి చట్టబద్దత లేకుండా యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లు సృష్టించి, హద్దు అదుపు లేకుండా చెలామణి అవుతున్న వారికి గుర్తింపు ఇవ్వడం ద్వారా మీడియా వ్యవస్థకు మచ్చ కలుగుతుందని, ఇందుకుగాను సంస్థ రిజిస్ట్రేషన్, లేబర్ లైసెన్స్, పోస్టల్ లైసెన్స్, ట్రేడ్ మార్క్ లైసెన్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, కార్యాలయ నిర్వహణ తీరు, సిబ్బంది తదితర అంశాలను పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. యూట్యూబర్స్ చేస్తున్న ప్రసారాలు జర్నలిజం నైతిక  ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

సియాసత్ మేనేజింగ్ ఎడిటర్, ఎమ్మెల్సీ ఆమెరలి ఖాన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ , ముఖ్యమంత్రి సి పి ఆర్ ఓ, అయోధ్య రెడ్డి, మీడియా అకాడమీ పూర్వాధ్యక్షులు అల్లం నారాయణ, ప్రముఖ జర్నలిస్టులు దిలీప్ రెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి,  పద్మజా షా, ఎం. ఏ. మాజీద్, కరుణాకర్ దేశాయ్, జర్నలిస్ట్ నాయకులు విరహత్ అలీ, సోమయ్య, పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Sunday, 22 September 2024

సినీ నటుడు చిరంజీవి కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

సినీ నటుడు  చిరంజీవి కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 




ప్రముఖ సినీ నటుడు శ్రీ కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనల


Thursday, 19 September 2024

తెలంగాణ జర్నలిస్ట్ యాంటీ అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దాస్

 తెలంగాణ జర్నలిస్ట్ యాంటీ అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దాస్


హైదరాబాద్ :



ఐజేయూ అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) జర్నలిస్ట్ యాంటి అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దాస్ మాతంగి నియమితులయ్యారు.ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మాతంగి దాస్ మూడు దశాబ్దాలకు చేరువగా జర్నలిజం వృత్తిలో ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో సేవలందించి నిర్విఘ్నంగా కొనసాగు తున్నారు. జర్నలిజం తొలినాళ్ళ నుంచి జర్నలిస్టు సంఘంలో సమ్మిళితమవుతూ వేములపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అరంగ్రేటం చేసి ఇంతింతై వటుడింతై అన్న చందంగా మిర్యాలగూడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షులుగా, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, పదేళ్లు నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, సంఘం రాష్ట్ర కౌన్సిల్, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా, నల్గొండ జర్నలిస్ట్ యాంటి అటాక్స్ కమిటీ సభ్యులుగా వివిధ పర్యాయాలు విశిష్ఠ సేవలందించారు.1995లోనే ఆంధ్రజ్యోతిలో వేములపల్లి కంట్రిబ్యూటర్ గా జర్నలిజం రంగంలోకి అరంగ్రేటం చేసి ఆ తదుపరి వార్త వేములపల్లి, మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ పట్టణ, కోదాడ స్టాఫ్ రిపోర్టర్, నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, బ్రాంచ్ మేనేజర్, స్టేట్ బ్యూరో, నమస్తే తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్, తెలంగాణ చిన్న మధ్యతరహా డైలీస్, పిరియాడికల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా వివిధ స్థాయిల్లో సేవలందించారు.

ఆ తదుపరి జర్నలిజంలో మూడు దశాబ్దాలుగా అన్న అనుభవాన్ని రంగరించుకొని అక్షిత తెలుగు జాతీయ దిన పత్రికను స్థాపించి చీఫ్ ఎడిటర్ గా... పత్రికను హైద్రాబాద్ కేంద్రంగా ప్రధాన పత్రికలకు ధీటుగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న తనను తెలంగాణ జర్నలిస్ట్ యాంటి అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల ఐజేయూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, సంఘం జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, హెచ్ యూజే అధ్యక్షులుగా శిగా శంకర్, తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ ఇతర యూనియన్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సంఘం తనకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ పెద్దల సహకారంతో జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకం పట్ల వివిధ సంఘాల బాధ్యులు, సీనియర్ జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి జర్నలిస్టులకు మరిన్ని సేవలందించాలని పలువురు ఆకాంక్షించారు.

Wednesday, 18 September 2024

యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే

 


UPSC ESE 2025 Exam: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025’ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు తుది గడువు అక్టోబర్‌ 8వ తేదీతో ముగుస్తుంది. ఈసారి మొత్తం..

                    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025’ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు తుది గడువు అక్టోబర్‌ 8వ తేదీతో ముగుస్తుంది. ఈసారి మొత్తం 232 పోస్టులు భర్తీ చేయనున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

యూపీఎస్సీ- ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..పోస్టును అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణత లేదంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్ (ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌, రేడియో ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు వయసు జనవరి 1, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.200 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే.. స్టేజ్‌-1 (ప్రిలిమినరీ/ స్టేజ్‌-1) ఎగ్జామ్‌, స్టేజ్‌-2 (మెయిన్‌/ స్టేజ్‌-2) ఎగ్జామ్‌, స్టేజ్‌-3 (పర్సనాలిటీ టెస్ట్‌), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది. ప్రిలిమినరీ/ స్టేజ్-I పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్న పత్రాలు ఇస్తారు. మొత్తం 500 మార్కులకు పేపర్ I నుంచి 200 మార్కులు, పేపర్ II నుంచి 300 మార్కుల చొప్పున వస్తాయి. మెయిన్ (స్టేజ్-II) ఇంజినీరింగ్ విభాగంలో రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు కేటాయిస్తారు. ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేదీ ఫిబ్రవరి 09, 2025న ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూజే, ఐజేయూ) రాష్ట్ర అనుబంధ


 *తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూజే, ఐజేయూ) రాష్ట్ర అనుబంధ 

తెలంగాణ జర్నలిస్టుల దాడుల నిరోధక కమిటి రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమితులైన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మన సంఘం రాష్ట్ర నాయకులు, అక్షిత చీఫ్ ఎడిటర్, మన ఆత్మీయులు  మాతంగి దాస్ గారికి

హృదయ పూర్వక అభినందనలు.*💐💐💐💐💐💐

టీయూడబ్ల్యూజేతోనే చిన్న పత్రికల మనుగడ

 టీయూడబ్ల్యూజేతోనే 

చిన్న పత్రికల  మనుగడ 



తెలంగాణ స్మాల్  మీడియం న్యూస్ పేపర్  అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్

రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు 


హైదరాబాద్ : 


 టీయూడబ్ల్యూజే- ఐజేయూతోనే చిన్న పత్రికల  మనుగడ సాధ్యమని తెలంగాణ స్మాల్  మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్

రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు  అన్నారు. నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం కోసం పరితపిస్తూ అవిశ్రాంతంగా కృషి చేస్తూ చిన్న పత్రికల  మనుగడకు కొండంత  అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)  సంఘంతోనే తమకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం  ఉందన్నారు. బుధవారం సాయంత్రం నల్గొండ  జిల్లాకు చెందిన 10 మంది సీనియర్  చిన్న పత్రికల సంపాదకులు , 143,  ఇతర సంఘాలకు రాజీనామా చేసి, బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో యూసుఫ్ బాబు  సమక్షంలో  టీయూడబ్ల్యూజే-ఐజేయూకి అనుబంధ సంఘమైన  తెలంగాణ స్మాల్  మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ లోకానికి మార్గదర్శకులు, ఐజేయూ జాతీయ అధ్యక్షులు మీడియా అకాడమీ చైర్మన్   శ్రీనివాస్ రెడ్డికి మన సమస్యలపై పూర్తి అవగాహన ఉండటం,చిన్న పత్రికల పక్షపాతిగా ఉన్న మన సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ సహకారం ఉన్నందువల్ల     మన పత్రికలు మరింత పురోగతి సాధిస్తాయన్నారు. ఇటీవల జరిగిన  టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ జర్నలిస్ట్స్ అటాక్స్ కమిటీ సభ్యులుగా ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మన సంఘం రాష్ట్ర నాయకులు దాస్ మాతంగిని నియమించడం

అభినందనీయమన్నారు. జాతీయ, రాష్ట్ర కమిటీలకు కృతజ్ఞతలు  తెలుపుతూ  అసోసియేషన్ పక్షాన మాతంగి దాస్ ని   శాలువాలతో ఘనంగా

సన్మానించారు. ఇదే ఉత్సాహం, సమిష్టి కృషితో    మన  సమస్యలు పరిష్కరించుకొనే దిశగా సాగుదామన్నారు. కలసి ఉంటే కలదు సుఖమన్న చందంగా మనందరం ఒకే గొడుగు కిందికి రావడం శుభపరిణామమన్నారు. సంఘంలో చేరిన ప్రజా సౌమ్యం సంపాదకులు వెన్నమళ్ల రమేష్ బాబు, వార్తా ప్రవాహం ఎడిటర్ వేమిరెడ్డి సుభాష్ రెడ్డి, వేముల ఎక్స్ ప్రెస్ ఎడిటర్

వేముల వెంకన్న, పురపాలక దీపిక ఎడిటర్ సంద్యాల విద్యాసాగర్,  కీర్తీ వాయిస్ ఎడిటర్ మధు, అన్వేషి

 సంపాదకులు అన్నెబోయిన మట్టయ్య, స్టూడెంట్ లైఫ్ ఎడిటర్ బి. బుచ్చయ్య,  గిరిజన సంస్కృతి ఎడిటర్ ధర్మానాయక్ తదితరులు సంఘం తీర్థం పుచ్చుకున్నారు.అసోసియేషన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్  అధ్యక్షతన  జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి అజం ఖాన్,రాష్ట్ర నాయకులు మాతంగి దాస్ ,   వెంకటయ్య, కలకొండ రామకృష్ణ, అహ్మద్ అలీ, మక్సూద్ , యాదయ్య , చంద్ర శేఖర్, కొమరాజు

శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే చిన్న మధ్యతరహా పత్రికల ప్రధాన సమస్యలైన ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడిటేశన్ కార్డులు, అప్ గ్రేడింగ్, యాడ్ లు, బిల్లులు తదితర అంశాలపై చర్చించి తగు కార్యాచరణతో ముందుకు సాగుటకు నిర్ణయించనైనది.

Tuesday, 17 September 2024

జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు :అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్

    రానున్న వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్





ఆదేశించారు.


       మంగళవారం ఆయన తన చాంబర్లో రానున్న వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు ,రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు.


       వానకాలం ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు డి ఆర్ డి ఓ, ఎఫ్ సి ఐ, వ్యవసాయ తదితర శాఖలు రానున్న రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని తెలిపారు. ధాన్యం  కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని తూర్పారబట్టే యంత్రాలు, అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. వానకాలం ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర స్థాయిలో సైతం సమావేశం ఉంటుందని, ఆ సమావేశం అనంతరం ప్రభుత్వం నుండి వెలువడే ఆదేశాల మేరకు ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామం వారిగా  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామాల పేర్లతో సహా టాగింగ్ చేస్తూ రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు .


      అనంతరం ఆయన  మిల్లర్లతో కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్) పై సమీక్షించారు. 2023- 24 సంబంధించి సెప్టెంబర్ వరకు పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటివరకు జిల్లాలో 83% పూర్తికాగా, ఇంకా 17% పెండింగ్లో ఉందని, ఇందుకు సంబంధించి ఇంకా సి ఎం ఆర్ చెల్లించాల్సిన రైస్ మిల్లర్లు త్వరితగతిన పెండింగ్ సిఎంఆర్ ను చెల్లించాలని ఆదేశించారు.రోజు వారీ టార్గెట్ నిర్దేశించుకొని సి ఎం ఆర్ పూర్తి చేయాలన్నారు.ఇంఫోర్సుమెంట్ సిబ్బంది రెగ్యులర్ గా మిల్లర్లతో సమన్వవయం చేసుకొని సి ఎం ఆర్ ను పర్యవేక్షించాలన్నారు.


      డి ఎస్ ఓ వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి ఎం హరీష్,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్,డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి తదితరులు ,రైస్ మిల్లర్లు,ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ,తదితరులు ఉన్నారు

____________________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు,సమాచార శాఖ,నల్గొండ*

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వివరణ

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వివరణ                       

టంగుటూరి రామకృష్ణ, పసుమర్తి మల్లిఖార్జున్  ల పై కా చిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, FIR నమోదు కావడం తో నష్ట నివారణ చర్యలు చేపట్టి    WAM  వివరణ ఇచ్చింది.


ఆ వివరణ  యధాతధంగా ప్రచురిస్తున్నాం


*WAM నుండి వివరణ*


అబుదాబి UAEలోని నేషనల్ థియేటర్‌లో సెప్టెంబరు 15న జరిగిన మా ఇటీవలి గ్లోబల్ కన్వెన్షన్ 2024 విజయవంతంగా ముగిసినందుకు మేము సంతోషిస్తున్నాము, ఇందులో ప్రపంచవ్యాప్తంగా 1100 మంది పాల్గొనేవారు, ఇందులో మాజీ రాజ్యసభ సభ TG వెంకటేష్  మరియు మన సమాజం ప్రముఖ వ్యాపార ప్రముఖులు ఉన్నారు.


అయినప్పటికీ, లోటస్ ట్రావెల్స్ హైదరాబాద్ డిఫాల్ట్‌తో సంబంధం ఉన్న దురదృష్టకర పరిస్థితితో మా వేడుక కప్పివేయబడింది, దీని ఫలితంగా చాలా మంది వ్యక్తులు నష్టపోయారు. మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు బాధిత సభ్యులతో ఐక్యంగా ఉంటాము. 


ప్రభావితమైన వారందరికీ మేము మా హృదయపూర్వక మద్దతు మరియు సంతాపాన్ని తెలియజేస్తున్నాము. మేము, WAM నాయకత్వం బాధ్యులు జవాబుదారీగా ఉండాలని పోరాడుతాము మరియు బాధితులను పరిష్కరించడానికి మరియు పరిహారం ఇవ్వడానికి త్వరిత చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. తక్షణమే మేము అన్ని నిజమైన క్లెయిమ్‌లను పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నాము మరియు వారు తమ డబ్బును, లోటస్ ట్రావెల్స్ package amount మరియు కన్వెన్షన్ ద్వారా చెల్లించిన రిజిస్ట్రేషన్ రుసుమును వీలైనంత త్వరగా తిరిగి పొందుతారని నిర్ధారించుకోండి.


రామకృష్ణ టంగుటూరి 

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ

Dr pm rao 

General secretary



         అబుదాబి UAEలోని నేషనల్ థియేటర్‌లో సెప్టెంబరు 15న జరిగిన   గ్లోబల్ కన్వెన్షన్ 2024  డబ్బులు కట్టించుకొని తీసుకపోకుండ మోసం చేశారని కాచిగూడ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులో ముద్దాయిలు ఎవరో విచారణ లో తేలాల్సి ఉంది.

Monday, 16 September 2024

కీ.శే.సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం పులిహోర పంపిణీ చేసిన అయన కుమారుడు ప్రముఖ న్యాయవాది సోమవరపు సత్యనారాయణ


 నల్గొండ, నీలగిరి శంఖారావం:

 దివంగత సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం అయన కుమారుడు ప్రముఖ న్యాయవాది సోమవరపు సత్యనారాయణ ఈరోజు నల్గొండలో గణేష్ నిమంజనం సందర్భంగా 250 కిలోల పులిహోరను భక్తులకు ప్రసాదంగా అందచేశారు.