*విల్లంబులు చేపట్టిన వికాస వేదిక*
డా: కాచం సత్యనారాయణ స్థాపించిన వికాస వేదిక గత కొంత కాలంగా విద్యార్థులను, విద్యావేత్తలను, ప్రశంసిస్తూ పురస్కారాలు అందించడమే కాకుండా సబ్బండ జాతుల వారికి పలు సేవాకార్యక్రమాలతో, ఆర్థిక సహాయ సహకారాలందించడం ద్వారా అందరి మన్ననలు పొందుతున్న తరుణం లో కొందరు వైశ్య విద్యావేత్తల ఆవేదన ,ఆలోచనలతో వైశ్యల ఐక్యత చాటాలనే సంకల్పం తో సంఘాలు వేరైనా , వైశ్య జాతి ఒక్కటేనని జాతి ఏకమైతే మన ఆత్మ గౌరవం కాపాడుకోవడం సలభతరమని గ్రహించి ఉన్నత విద్యావేత్తలైన వైశ్య సోదర సోదరీమణుల సలహాలతో ప్రభుత్వం పై వత్తిడి పెంచి కొన్ని (10) డిమాండ్లను వారి దృష్టి కి తెచ్చి సాదించుకన్నట్లైతే మన జాతికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కడం మే కాకుండా, భావితరాలకు సంఘసమాజములో సముచిత గౌరవం లభిస్తుంది.అలాగే దారిద్ర్య రేఖ కు దిగువున ఉన్న మన కుటింభికులకు సహాయం తో పాటు విద్యా విధానం లో ఉద్యోగాలలో కూడా అవకాశాలు మెరుగు పడుతాయని ఆశాభావం తో రాష్ట్ర నలుమూలల సభలు , సమావేశాలు జరుపుతూ,
అక్టోబర్ 1 న హైదరాబాద్ నడిబొడ్డున లక్ష మంది వైశ్యులతో భారీ బహిరంగ సభ
*వైశ్య ఘర్జన* పేరున జరుపతలపెట్టారు. రాష్ట్ర నలుమూలల జరిపిన ప్రతి సమావేశం వైశ్య ఘర్జన విజయవంతం కోరకు సహకరిస్తామని ఏక గ్రీవంగా తీర్మానించడం తో వేదికకు మరింత బలం చేకూరింది.
ఇదే తరుణంలో *వైశ్యల ఐక్యత ను జీర్ణించుకోలేని బడా నేతలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా, ఐక్యతకు భంగం కలిగే విధంగా మాట్లాడటం తో సమావేశానికి హాజరైన వైశ్యులు వారిపై ఆగ్రహాం వెల్లబుచ్చారు. సభికుల ఆవేశాలను గ్రహించిన ఉద్యమనేత , వైశ్యగర్జన నిర్వాహకులు డా: కాచం సత్యనారాయణ గారు తన సుదీర్ఘ ప్రసంగం లో తన దైన శైలిలో ఘాటుగా స్పందిస్తూ నా జాతి బిడ్డలకు నేటి వరకు ఏ సంఘం సహకరించక పోగా , జాతి గౌరవం కోసం ఏర్పాటు చేసుకొన్న *వైశ్య ఘర్జన* మీ పెద్దరికాల కోసం ఐక్యత ను దూరం చేస్తే సహించేది లేదని, ఉద్యమ సమయం లో
*గౌ: ముఖ్యమంత్రి కే సి ఆర్ గారి శిష్యరికం లో శిక్షను పొందిన నాకు ఈ గర్జన విజయవంతం చేయడం సులభతరమే కాని ఆ తదుపరి అంటంక పరిచిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించడంతో సభికులు పెద్ద ఎత్తున హర్శద్వనాలు చేయడం తో సహా ప్రాంగణం దద్దరిల్లింది*.
వివిధ సంఘాల సభ్యులును ఉద్దేశించి *అక్టోబర్ 1 న జరిగే వైశ్య ఘర్జన కు ర్యాలీ గా మీ సంఘం పేరున గాని , క్లబ్ల పేరున గానీ మీ జిల్లా పేరుతో, కాలనీల పేరుతో బ్యానర్ పెట్టుకొని రావచ్చని*
సభ వేదిక పై అందరికి సముచిత స్థానం కల్పిస్తామని ఇది మన అందరి వేదిక అని కేవలం మన జాతి ఐక్యత నిరూపనయే నా ధ్యేయం అని ...భావి తరాల కోసమైనా మనం మన డిమాండ్లను సాధించు కోవాలని ఇందుకోసమే ఈ వైశ్య ఘర్జన అని ఆవేశ పూరితమైన ప్రసంగం చేశారు.
No comments:
Post a Comment