మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు BRSకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ వీడతారని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలొచ్చాయి. కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలూ వచ్చాయి. హైదరాబాద్ వేదికగా సెప్టెంపర్ 16,17వ తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే హైకమాండ్ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. అయితే అంతకంటే ముందుగానే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇన్నాళ్లూ BRSకి రాజీనామా చేస్తారన్న వార్తలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా ఆయనే రాజీనామా లేఖ రాసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పంపారు. ఆ లేఖను కేవలం ఒకే వాక్యంతో ముగించినట్టు తెలుస్తోంది. "నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. రాజీనామాని ఆమోదించండి" అని మాత్రమే రాసి పంపారట. పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా హైకమాండ్ అందుకు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు తుమ్మల. కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గు చూపారు. అనుకున్న విధంగానే ఆ పార్టీ కండువా త్వరలోనే కప్పుకోనున్నారు.
No comments:
Post a Comment