Wednesday, 6 September 2023

*ఘనంగా ఏలూరి లింగయ్య గుప్తా గారి 79వ జయంతి వేడుకలు!*






 *ఘనంగా ఏలూరి లింగయ్య గుప్తా గారి 79వ జయంతి వేడుకలు!*

హైదరాబాద్,: కాచిగూడ ఆర్య వైశ్య హాస్టల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో *ఏలూరి లింగయ్య గుప్తా గారి 79వ జయంతి వేడుకలు!* ఉపాధ్యాయులు, దివంగత మాజీ రాష్ట్రపతి, సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి & *టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త* పాల్గొని

కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకి *మొత్తం 86 మంది విద్యార్థులకు 6000 రూపాయలు చొప్పున 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఒక స్టూడెంట్ కి 21 వేల రూపాయలు టూరిజం పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త* గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.
*తదనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..* రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. సమాజాభివృద్ధికి విద్యయే మూలం’ అనే మహనీయుల స్పూర్తితో, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యార్థి చదువుతోపాటు సంస్కారాన్ని, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదన్నారు.
దిశా,దశలను నిర్దేశించేది రేపటి తరానికి చక్కటి మార్గదర్శనం కావాలని ఆయన ఆకాంక్షించారు.దేశానికే తెలంగాణా తలమానికంగా నిలబడాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన చెప్పారు. అటువంటి సంకల్పం నెరవేర్చే గురుతర బాధ్యత ఉపాద్యాయుల మీద ఉందన్నారు.ఈరోజు సహాయం పొందిన పేద విద్యార్థులందరూ భవిష్యత్తులో పెరిగి పెద్దయి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాన్ని చేరుకొని నలుగురు పేదలకు సాయం చేయాలని ఆకాంక్షించారు.
*ఈ కార్యక్రమంలో..* ప్రెసిడెంట్ వెంపటి మధు జనరల్ సెక్రెటరీ ఉప్పల రాజేశ్వర్, కోశాధికారి రఘువీర్, కూర జయరాములు గుప్త, కూర జయ ప్రకాష్, దయాకర్ మేడం, ధనుంజయ్ చైర్మన్, నగేష్ సెక్రటరీ, ఏలూరు రవీంద్రనాథ్ గుప్త, ఏలూరు కిషోర్ వెంకటేశం మరియు ట్రస్ట్ సభ్యులు, పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
+

No comments:

Post a Comment