Saturday, 9 September 2023

మొదలైన జీ20 'వన్‌ ఎర్త్‌' సమావేశం..!

 



  • 2hr
  • ఇంటర్నెట్‌డెస్క్‌: జీ20లో తొలి సమావేశమైన వన్‌ ఎర్త్‌ మొదలైంది. తొలుత షెడ్యూల్‌ ప్రకారం సభ్య దేశాల అగ్రనేతలు మొత్తం ఉదయం 9.20 నుంచి 10.30 వరకు సదస్సు ప్రాంగణానికి చేరుకొన్నారు.

వీరికి ప్రధాని మోదీ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌, సింగపూర్‌ ప్రధాని లీ హీన్‌ లూంగ్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, చైనా ప్రధాని లి చియాంగ్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌, తుర్కియే అధ్యక్షుడు తైపీ ఎర్డోగాన్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ ఇయోల్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, చివరిగా సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ రాకతో స్వాగత కార్యక్రమం ముగిసింది. సల్మాన్‌ను తీసుకొని ప్రధాని మోదీ సదస్సు వేదిక వద్దకు వెళ్లారు.

తొలి సెషన్‌లో 'వన్‌ఎర్త్‌' పేరిట పర్యావరణ అంశాలను చర్చించనున్నారు. వాతవరణ మార్పులు, శుద్ధి ఇంధన, నెట్‌ జీరో ఉద్గారాలు వంటి వాటిపై ప్రధానంగా నేతలు సంప్రదింపులు జరుపుతారు. కర్బన ఉద్గారాలు తగ్గించేలా పరిశుద్ధ ఇంధనాల వైపు మళ్లేందుకు అవసరమైన క్లైమెట్‌ ఫైనాన్సింగ్‌ అంశం కూడా చర్చకు రానుంది.


No comments:

Post a Comment