Saturday, 2 September 2023

వైశ్య గర్జన సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూరాచకొండ సీపీ డి ఎస్ చౌహాన్ ను వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ

 వైశ్య హక్కుల సాధన కై  అక్టోబర్ 1 వ తేదీన సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించే  వైశ్య గర్జన సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శనివారం  ఎల్బ్ నగర్ లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ డి ఎస్ చౌహాన్ ను వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక  చైర్మన్ డాక్టర్ కాచం  సత్యనారాయణ


గుప్త, వైశ్య ప్రతినిధులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కా చం మాట్లడుతూ అగ్ర కులాలు అని చెప్పుకునే తమ వైశ్య కులస్థుల లో ఎక్కువగా పేదవారు ఎంతో మంది ఉన్నారని, వారి హక్కుల సాధనాలతో పాటు వైశ్యుల జాతి కోసం కార్పొరేషన్ సత్వరమే ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేస్తున్నామన్నారు.. అదే విధంగా రాజకీయ పార్టీ ల లో సరైన ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నామని,అందుకే అక్టోబర్ 1 తేదీన నిర్వహించే వై శ్యా గర్జన కు తెలంగాణ నలుమూలల నుండి వేలాది మంది వైశ్యులు తరలి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వైశ్యుల ఆత్మ గౌరవం కాపాడుకోవాలంటే ముందుగా యువత సైతం ముందుకు రావాలని ఆయన కోరారు. సి పి కి వినతిపత్రం  ఇచ్చిన వారిలో ఎసిపిఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ, గుంత మురళి మోహన్,కూర రమేష్, తెలుకుంట్ల రాంబాబు,వీరు దివ్వెల తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment