: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే భారీ గిఫ్ట్ రానుంది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి డీఏ పెంపు 3 శాతం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు.
ఈ ఏడాది రెండో డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న తరుణంలో గుడ్‌న్యూస్ తెరపైకి వస్తోంది. దీపావళి గిఫ్ట్‌గా డీఏ పెంపు ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. దీపావళికి ముందుకు డీఏ పెంపు ఉంటుందని చెబుతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. 47.58 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, సుమారు 69.76 లక్షల మంది పెన్షనర్లు సహా కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏను సవరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరంలో మొదటి సవరణ మార్చి 24న జరిగింది. 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేలా జనవరి 1 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఈసారి కూడా 4 శాతం డీఏను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈసారి 3 శాతం డీఏ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వెలువడినా.. జూలై 1 నుంచి అమలు చేయనున్నారు.
డీఏ పెంపుదలలు ద్రవ్యోల్బణం రేట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే.. ఉద్యోగులు డీఏ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) డేటా ఆధారంగా ప్రతి జనవరి 1, జూలై 1న కేంద్ర ఉద్యోగులకు డీఏను సవరిస్తారు. జూలై 2023లో CPI-IW 3.3 పాయింట్లు పెరిగి 139.7కి చేరుకుంది. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 0.90 శాతం ఎక్కువ పెరిగింది.
నివేదిక ప్రకారం కేం
ద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచితే.. అది 45 శాతానికి చేరుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.18 వేలు అనుకుంటే.. ప్రస్తుతం 42 శాతం డీఏ ప్రకారం అది రూ.7,560. మూడు శాతం పెంపుతో అది రూ.8,100 అవుతుంది. ఫలితంగా జీతం రూ.540 పెరుగుతుంది. గరిష్టంగా రూ. 56,900 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రస్తుత డీఏ రూ.23,898 కాగా.. అది 3 శాతంతో రూ. 25,605కి పెరుగుతుంది.
No comments:
Post a Comment