: హైదరాబాద్ జాతీయ రాజకీయ నిర్ణయాలకు వేదిక కానుంది. ఈ నెల 17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరపాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ నెల 17న హైదరాబాద్ లో సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక ఖరారైంది. అదే రోజు కేసీఆర్ మరో సభలో పాల్గొంటున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో : తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించి, ఇటీవల అధిష్ఠానానికి లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలోనే సమావేశం జరుగుతోంది. సోనియా, రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, అశోక్ గెహ్లోత్, భూపేష్ భాగేల్, సుఖ్విందర్ సింగ్ సుఖు సహా 39 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశం కోసం రాష్ట్రానికి వస్తున్నారు. 16న సోనియా, రాహుల్ రాక ఖరారైంది. రేపు (శుక్రవారం) మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎన్నికల శంఖారావం : సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలేమిటో సోనియా ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన సోనియానే హైదరాబాద్ వేదికగా జరిగే కార్యక్రమంలో పాల్గొని..ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి కేంద్రం అనూహ్యంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయించింది. మంది పైగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలు అదే రోజు తెలంగాణవ్యాప్తంగా పర్యటించి, ఎన్నికల ప్రచారాన్ని ఏక కాలంలో ప్రారంభించేలా పార్టీ కసరత్తు చేస్తోంది. 17న సోనియా ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో చేసే ప్రసంగంలో పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే అంశాలను వివరించనున్నట్లు చెబుతున్నారు. పార్టీ మేనిఫెస్టోను ప్రకటించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. సెప్టెంబర్ 17న పోటీ పోటీగా : ఇదే సమయంలో హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. కేంద్రం అధికారికంగా నిర్వహించే హైదరాబాద్ విమోచన వేడుకల్లో పాల్గొంటారని చెబుతున్నారు. పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో షా పాల్గొంటారు. 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు వీలుగా కొత్త అంచనాలతో కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందకు కేంద్రం సిద్దమైంది. ఈ సమయంలో సోనియా, రాహుల్..ఇటు అమిత్ షా హైదరాబాద్ కేంద్రంగా చేసే ప్రసంగాలు కీలకం కానున్నాయి. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయంగా ఈ రెండు రోజుల కార్యక్రమాల ద్వారా మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
No comments:
Post a Comment