చిన్న పత్రికల బిల్లుల విడుదలకు మంత్రి హరీష్ రావు అంగీకారం
హైదరాబాద్ : ఏడాది కాలంగా
చిన్న పత్రికల బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ చిన్న, మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం ఆధ్వర్యంలో
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తేగా అందుకు స్పందించారు. సోమవారం నానక్ రాంగూడలోని మంత్రి క్యాoపు కార్యాలయoలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో చిన్న పత్రికల నిర్వహణ కష్టతరంగా మారిందని తెలంగాణ చిన్న, మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి దాస్, గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ అలీ, ప్రజాస్వామ్యం ఎడిటర్, సీనియర్ నాయకులు వెన్నమళ్ల రమేష్ బాబులు మంత్రి హరీష్ రావు దృష్టికి తెచ్చారు. అందుకు స్పందించిన మంత్రి హరీష్ రావు చిన్న పత్రికల బిల్లులన్నింటిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. గత ఏడాది జూన్ నెల నుంచి ఇప్పటి వరకు గల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొమర్రాజు శ్రీనివాస్, నల్లగొండ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కోటగిరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మక్సూద్ అహ్మద్, సభ్యులు వీరెల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment