Wednesday, 6 September 2023

శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?


శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?

    : శ్రీకృష్ణుడు ఈలోకానికి వీడ్కోలు పలికిన తరువాత తల్లిదండ్రులు ఏమయ్యారు..? పెంచిన కన్న తల్లిదండ్రులు దేవకీ-వాసుదేవ్, పెంచిన తల్లిదండ్రులు యశోద-నందుడు ఎలా మరణించారు..? శ్రీకృష్ణుడు వారిని ఎప్పుడు కలుసుకున్నాడు..? ఆ వివరాలు ఇవిగో..  

: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?

Krishna Janmashtami History: ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ట జన్మదిన వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు. తమ పిల్లలను శ్రీకృష్ణుడి, గోపిక వేషధారణలు వేయించి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మధుర, బృందావనం, ద్వారక సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను అంగరంగ వైభవంగా అలకరించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ట పుట్టినరోజు సందర్భంగా ఓ ఆసక్తికర కథను గురించి తెలుసుకుందాం. వేటగాడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మరణించిన విషయం అందరికీ తెలుసు. కానీ కృష్ణుడు తల్లిదండ్రులు యశోద-నందుడు, దేవకి-వాసుదేవ్‌లు ఏమయ్యారు..? వాళ్లు ఎలా చనిపోయారు..? లేదా శాశ్వతంగా జీవించారా..? వాళ్ల గురించి చాలామందికి తెలియదు. వివరాలు ఇలా..

            గ్రంథాల ప్రకారం.. కురుక్షేత్ర యుద్ధం ఆరంభానికి ముందే.. శ్రీ కృష్ణుడు ద్వారకను విడిచిపెట్టి మధురలోని గోకులానికి చేరుకుని తనను పెంచిన తల్లి యశోదమ్మను కలుసుకున్నాడు. ఆ సమయంలో యశోదమ్మ చాలా అనారోగ్యంతో ఉన్నారు. కన్నయ్య ఇంటికి చేరుకోగానే.. నందుడు, యశోదా చాలా సంతోష్యం వ్యక్తంచేశారు. చాలారోజుల తరువాత తమ కుమారుడిని చూడడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వెళ్లిన కొద్ది రోజులకే యశోదమ్మ అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు. 

                మహాభారత యుద్ధం ముగిసిన తరువాత.. శ్రీకృష్ణుడు మళ్లీ గోకులానికి వచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన తల్లి యశోదమయ్య మరణించిన విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. నందుడు పరామర్శించి.. అనంతరం ద్వారక నగరానికి తిరిగి వచ్చాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు నది ఒడ్డున కూర్చుని ఉండగా.. ఒక కోడి నుంచి వచ్చిన బాణం అతని పాదానికి తగిలింది. ఈ కారణంగానే శ్రీకృష్ణుడు మరణించాడని పురణాలు చెబుతున్నాయి. అయితే విష్ణువు భూమి నుంచి వీడ్కోలు చెప్పడానికి ఇలాంటి ఏర్పాటును సృష్టించాడని పుర్వీకులు చెప్పారు. 

        శ్రీ కృష్ణుడు మరణించి విషయం మధురకు చేరగానే.. తండ్రి వాసుదేవ్ తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. కన్నయ్య మరణాన్ని తట్టుకోలేక అక్కడే కుప్పుకూలి ప్రాణాలు విడిచారు. భర్త, కొడుకు మరణవార్త తల్లి దేవకీ తట్టుకోలేకపోయారు. ఇద్దరి మరణాన్ని జీర్ణించుకోలేక సతీదేవిగా మారాలని నిర్ణయించుకుని.. అగ్నిలో దూకి తన జీవితాన్ని అర్పించారు. 

ఇక నందుడు గురించి గ్రంథాలలో పెద్దగా సమాచారం లేదు. అయితే నందుడు పరమ శివుని భక్తుడు అని.. ఆయన ఆరాధనలో నిమగ్నమై ఉండేవారని చెబుతారు. శివుడి అనుచరులు స్వయంగా భూలోకానికి వచ్చి ఆయనను స్వీకరించి భౌతికంగా స్వర్గానికి తీసుకెళ్లారని అంటారు. దాని వలన నందుడు మోక్షాన్ని పొందారని ఓ కథ ఉంది. 

No comments:

Post a Comment