కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు
* రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం
* ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలో కాంగ్రెస్ గెలుపు
టి పి సి సి కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి
పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఇక కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టిపిసిసి కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ మండల పరిధిలోని ఆయా గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక రాజీవ్ భవన్ లో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్ గ్రాఫ్ పడిపోతుందని తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మటం లేదన్నారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని మోసపూరిత వాగ్దానాలు ప్రకటించిన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించి బుద్ధి చెప్తారని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు పథకాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిందని ప్రజలందరూ కాంగ్రెస్ వైఫై ఉన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 70 నుంచి 80 స్థానాలు గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఉందని ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్ మరిన్ని స్థానానికి గెలిచే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన అవుతుందని మిర్యాలగూడ టికెట్ ఎవరికీ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రాష్ట్రస్థాయిలో సర్వేలు, అభ్యర్థి బలాబలాలు, పార్టీకి విధేయత, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అయిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు సైనికులుగా పని చేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పొదిలా వెంకన్న, ఎండి సలీం, మెడ సురేందర్ రెడ్డి, బక్కా రెడ్డి, తలకొప్పుల సైదులు, హరి ప్రసాద్, ఎం ఏ అరిఫ్, బసవయ్య గౌడ్, ఎండి ఇమ్రాన్, మెరుగు శ్రీనివాస్, నర్సింగ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment